AP TET Results 2018: APTET 2018 Results Released by Ganta Srinivasa Rao | ఏపీ టెట్ 2018 ఫలితాలు విడుదల
Sakshi News home page

ఏపీ టెట్ ఫలితాలు విడుదల

Published Mon, Mar 19 2018 4:45 PM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

AP TET Results Released By Ganta Srinivasa Rao - Sakshi

ఏపీ టెట్ ఫలితాలు

సాక్షి, అమరావతి: ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2018 (టెట్‌) ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఏపీ టెట్‌కు 4,14,120 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్‌ పేపర్ ‌-1లో 57.88 శాతం అభ్యర్థులు, పేపర్ -2లో 37.26 శాతం మంది, పేపర్ -3లో 43.60 శాతం అభ్యర్థులు అర్హత సాధించారని మంత్రి గంటా తెలిపారు. మొత్తంగా 25 శాతం అభ్యర్థులు 90 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఏపీ టెట్ ఫలితాలు .   

ఈ నెల 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. టెట్‌ పేపర్‌-1పై అత్యధికంగా 9,867 అభ్యంతరాలు రాగా, 9,867, పేపర్-2పై 4,162, పేపర్-3పై అభ్యర్థుల నుంచి 1,858 అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఫలితాలను విడుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement