
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని.. సైకిల్ పంక్చర్ అయిందని బీజేపీ విశాఖ నార్త్ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. గంటా శ్రీనివాసరావు కబ్జా దాహానికి నియోజవర్గంలో కొండలు, గుట్టలు మాత్రమే మిగిలాయని చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడ్డానని తనపై వచ్చిన ఆరోపణలకు విష్ణుకుమార్ రాజు ఖండించారు. నియోజకవర్గంలో కొందరు పచ్చనేతలు తనపై బురద జల్లుతున్నారని, దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. విశాఖ నార్త్ బీజేపీ క్యాడర్‌లో కొంతమందిని లక్షలు ఇచ్చి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎన్ని చేసినా ఇక్కడ గంటా మూడో స్థానంలోనే ఉంటారని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment