
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో ఉచిత సైకిళ్లు పంపిణీలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన అక్రమాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి! ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్ట్ చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!' అంటూ ట్వీట్ చేశారు.
కాగా మరో ట్వీట్‌లో.. 'పరవాడ ఫార్మా సిటీ కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. 'విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదం విచారకరం. సకాలంలో స్పందించి ప్రాణనష్టం నివారించిన అధికారులకు ధన్యవాదాలు. దర్యాప్తులో అన్ని వివరాలు తేలుతాయి' అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. చదవండి: మల్లేష్‌ను పరామర్శించిన ఎంపీ విజయసాయి రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment