erasu prathap reddy
-
'సైకిల్' ఎక్కిన టీజీ, ఏరాసు
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు వద్ద రాజకీయ శిక్షణ తీసుకోవడం వల్ల మంచి పనులు చేయగలిగామని మాజీ టీజీ వెంకటేష్ అన్నారు. పార్టీ పెట్టే తహతు తనకు లేదన్నారు. ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. మంచివాళ్లను పార్టీలో చేర్చకుంటామని చెప్పి తమను చంద్రబాబు గౌరవంగా ఆహ్వానించారని టీజీ తెలిపారు. అదే తమకు పెద్దకు గౌరవంగా భావిస్తున్నామన్నారు. భూమి గుండ్రంగా ఉన్నట్టు టీడీపీ నుంచి బయటకు వెళ్లి మళ్లీ అదే పార్టీకిలోకి వచ్చామని ఆయన చమత్కరించారు. అయితే అప్పటి పరిస్థితుల కారణంగానే టీడీపీని వదిలిపెట్టామని సమర్థించుకున్నారు. టీడీపీని చంద్రబాబు చక్కగా నడపుతున్నారని కితాబిచ్చారు. ఒంటెద్దు పోకడలతో విభజన చేయడంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చామని ఏరాసు తెలిపారు. రాబోయే కాలంలో కాబోయే సీఎం చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుతో టీజీ, ఏరాసు, గంటా భేటీ
హైదరాబాద్: దేశంలో బీజేపీ సానుకూల పవనాలు వీస్తున్నాయని కర్నూలు కాంగ్రెస్ నాయకుడు టీజీ వెంకటేష్ అన్నారు. కేంద్రంలో బీజేపీ రావడం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. బీజేపీతో మంచి సంబంధాలున్న పార్టీ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు పాటు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. సీమాంధ్రకు జరిగిన అన్యాయంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ పాత్ర కూడా టీజీ వెంకటేష్ ఉందన్నారు. చంద్రబాబు ఒత్తిడి తేవడం వల్లే సీమాంధ్రకు ఆ మాత్రం ప్రోత్సకాలు తీసుకొచ్చేందుకు బీజేపీ పోరాడిందని చెప్పారు. చంద్రబాబు తమను టీడీపీలోకి ఆహ్వానించారని టీజీ తెలిపారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేసే సత్తా చంద్రబాబుకు ఉందని నమ్ముతున్నట్టు ఏరాసు ప్రతాపరెడ్డి తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూలును సీమాంధ్ర రాజధాని చేయాలని చంద్రబాబును కోరినట్టు వెల్లడించారు. -
బాబుతో గంటా, ఏరాసు భేటీ!
అరగంట పాటు మంతనాలు టీడీపీలో చేరికకు గ్రీన్‌సిగ్నల్ షరతులపై సీఎం రమేశ్‌తో చర్చలు సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ప్రభుత్వంలోని మం త్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి సోమవారం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో చంద్రబాబు నివాసానికి చేరుకున్న ఇద్దరు మం త్రులు దాదాపు 30 నిమిషాల పాటు ఆయనతో మంతనాలు జరిపారు. తాము పార్టీలో చేరితే ఇచ్చే ప్రాధాన్యత, తమ వెంట వచ్చే వారికి కూడా సీట్ల కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు. వారిద్దరితో పాటు వారి వెంట వచ్చే అనుచరులు తెలుగుదేశంలో చేరేం దుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అనంతరం గతంలోనే అంగీకరించిన షరతులపై టీడీపీ ఉపాధ్యక్షుడు, ఎంపీ సీఎం రమేష్‌తో మంత్రులు మరోమారు చర్చలు జరిపారు. గంటా నివాసంలో జరిగిన చర్చల్లో ఏరాసుతో పాటు టీజీ వెంకటేశ్, శిల్పా మోహన్‌రెడ్డిలు కూడా పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయ వర్గాలు మాత్రం మంత్రులు చంద్రబాబుతో భేటీ కాలేదంటూ మీడియాకు లీక్ ఇచ్చాయి. వారు ఈ నెల 27 లేదా ఆ తర్వాత భేటీ కానున్నట్టు తెలిపాయి. వారంతా వచ్చేలా చూడండి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశాలు లేని నేతలను గుర్తించి, వారిని తెలుగుదేశంలో చేర్పించాలన్న చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలోనే.. పారిశ్రామికవేత్తలైన టీడీపీ నేతలు కొందరు ఆ పనిలో నిమగ్నమైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలి పరిణామాలతో రాష్ట్రంలో టీడీపీ బాగా బలహీనపడిన నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి నేతలను చేర్పించుకుంటే తెలుగుదేశం బలంగా ఉందని ప్రజలు భావించే అవకాశాలుంటాయని, అందువల్ల గతంలో వైఎస్సార్సీపీలో చేరడానికి ప్రయత్నించినా చోటు దొరకని నాయకుల జాబితాను తయారుచేసి వారిని ఎలాగైనాసరే టీడీపీలో చేర్పించాలని అధ్యక్షుడు ఆదేశించినట్టు ఆ వర్గాలు వివరించారుు. సుష్మా చర్యలతో మోడీ ఇమేజ్ తగ్గింది లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చర్యలతో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఇమేజ్ తగ్గిందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం సీమాంధ్ర నేతల సమావేశంలో ప్రసంగించటంతో పాటు ఆ తరువాత జిల్లాల వారీగా ముఖాముఖి మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. -
రబీ ఆశలపై నీళ్లు
కర్నూలు(కలెక్టరేట్/రూరల్), న్యూస్‌లైన్: కాల్వల కింద రబీ పంటల సాగుపై రైతన్న ఆశలను ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు నీరుగార్చారు. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసినా, నదులు భారీగా ప్రవహిస్తూ ప్రాజెక్టులు నిండినా రబీ పంటలకు అత్తెసరు నీటితో సరిపెట్టేందుకు నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. రైతు ప్రయోజనాలపై చర్చించింది నామమాత్రమే అయినా.. వివిధ అంశాలపై ప్రజా ప్రతినిధులు నీటి పారుదల శాఖ అధికారులపై విరుచుకుపడ్డారు. జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు ఉండగా మంత్రులతో కలిసి ఆరుగురు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. ఎల్లెల్సీ నీటి విడుదలపై సమావేశంలో వాడివేడి చర్చ సాగింది. కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న నీటి చౌర్యంపై ఎల్లెల్సీ నీటి వాటా పరిరక్షణ కమిటీ సభ్యులు పి.సాయిబాబు తదితరులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎల్లెల్సీ కింద కౌతాళం, మంత్రాలయం ప్రాంతాల్లో మిరప, పత్తి లక్ష ఎకరాల్లో ఉందని, ఈ పంటలకు విధిగా డిసెంబర్ 15 వరకు సాగునీరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయితే అందుబాటులోని నీటితో మంచినీటి అవసరాలు తీరుస్తూ ఇప్పటికే వేసిన 50వేల ఎకరాల పంటలకు నీరిచ్చేందుకు మంత్రులు, అధికారులు అంగీకరించారు. అనంతపురం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు హెచ్ఎల్సీ నీటిని వాటా మేరకు రాబట్టుకుంటున్నారని, మన జిల్లా ప్రజా ప్రతినిధులు మాత్రం కోటా మేరకు నీటిని రాబట్టలేకపోతున్నారని.. ఇది చేతగాని తనమేనని సాయిబాబు తదితరులు ఘాటుగా విమర్శించారు. దీనిపై మంత్రి ఏరాసు స్పందిస్తూ ‘‘మేము చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఈ విషయమై ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డితో చర్చించాం. దురదృష్టవశాత్తు కర్ణాటకలో ముగ్గురు, రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. ఇందువల్ల న్యాయం పొందలేకపోతున్నాం’ అన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎంకు కూడా ఇదే విషయమే ప్రధానంగా చెప్పామని తెలిపారు. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రే ఉన్నా వెలుగోడు రిజర్వాయర్‌కు 3 టీఎంసీల నీరు తెచ్చుకోలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం డ్యాంలో పూర్తిగా నీరున్నా మన ప్రాంతానికి 3 టీఎంసీల నీరు తెచ్చుకోలేకపోయామన్నారు. ఎస్సార్బీసీ సర్కిల్-1 ఎస్ఈ, ఈఈ, హంద్రీనీవా అధికారులు, ట్రాన్స్‌కో అధికారులు గైర్హాజరు కావడంపై మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము పని లేక ఇక్కడికి వచ్చామా అంటూ గైర్హాజరైన వారికి చార్జి మెమోలు ఇవ్వాలని మంత్రులు టీజీ, ఏరాసులు కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి టీజీ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాలకు రూ.530 కోట్లు నిధులున్నాయని, ఇప్పటికే రూ.200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. వీటి ద్వారా 75 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ సీఈ సుబ్బారావు, ఎస్ఈ నాగేశ్వరరావు, డీఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, సీపీఓ ఆనంద్ నాయక్, జేడీఏ ఠాగూర్ నాయక్, కేసీ కెనాల్, ఎల్లెల్సీ, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, జీడీపీ తదితరులు పాల్గొన్నారు.