సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఖైరతాబాద్ చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్‌లో 2018-20గాను రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 13వందలమంది ఆర్యవైశ్యులకు ఓటుహక్కు ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ ద్వారాకనాథ్, పెనుగొండ సుబ్బరాయుడు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో 86శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అయితే, పోలింగ్ విషయంలో తీవ్ర అవకతవలు జరిగినట్టు ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి.
వైఎస్సార్‌సీపీకి చెందిన తనను ఓడించేందుకు టీడీపీ కుట్ర పన్నిందని ద్వారాకనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌లో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారని, దొంగ ఓటు వేస్తున్న వ్యక్తిని ప్రత్యక్షంగా పట్టుకున్నా చర్యలు లేవని ఆయన అన్నారు. ఎన్నికలు వాయిదా వేసి మళ్లీ నిర్వహించాలని ద్వారాకనాథ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment