Dwarakanath
-
'టీడీపీ' కి మరో కొత్త తలనొప్పి! ద్వారకా రాకతో..
సాక్షి ప్రతినిధి, కడప: 'చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే ఆ ఇద్దరు 30 ఏళ్ల కిందట ప్రత్యక్ష రాజకీయ క్షేత్రంలో పోటీపడ్డారు. మూడు దశాబ్దాలుగా పరాన్నజీవులుగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. వారిని తెలుగుదేశం అధిష్టానం తెరపైకి తెచ్చింది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేని నాయకులను అంటగట్టడంపై మాకు ఇదేం ఖర్మ బాబు అనడం జిల్లాలో తెలుగుతమ్ముళ్ల వంతు అయింది. చెల్లని రూకలే మహా ప్రసాదంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుండగా, శిరోభారమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.' - చెన్నంశెట్టి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడప అసెంబ్లీ నుంచి 1985 ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి గెలుపొందారు. 1989లో జనరల్ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్‌కు, 1991 ఉప ఎన్నికల్లో కడప పార్లమెంట్ అభ్యర్థిగా తలపడి ఓడిపోయారు. తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ పరోక్ష రాజకీయాల్లో నెట్టుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నేతగా కొనసాగారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎంపియ్యారు. అయినప్పటికీ 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనేక పదవులతో సత్కరించిన టీడీపీ పట్ల విశ్వాసం, విధేయుతతో ఉండాల్సిన సీఆర్సీ ప్రజారాజ్యంలో, అక్కడి నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కూడా ఎమ్మెల్సీ దక్కించుకొని మంత్రి పదవిని చేజేక్కించుకున్నారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా పార్టీలు మారుతూ పచ్చి అవకాశవాదిగా సీఆర్సీ ముద్ర వేసుకున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వయోభారంతో నెట్టుకొస్తున్న ఈదశలో ఆయన పార్టీ మారి అనైతికతకు నిలువెత్తు నిదర్శనంగా ఉండిపోయారని పలువురు కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నాడు వైఎస్సార్ దీవెనలతో.. వ్యాపార వ్యవహారిక కార్యక్రమాల్లో ఉన్న గడికోట ద్వారకనాథరెడ్డి 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆరంగ్రేటం చేశారు. అప్పటి వర్గ రాజకీయాల ఫలితంగా మాజీ మంత్రి ఆర్ రాజగోపాల్‌రెడ్డి ఓటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గీయులు పనిచేశారు. వైఎస్సార్ చల్లని దీవెనలతో ద్వారకా లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత టీడీపీ ఛీ కొట్టింది. 1999లో టికెట్ నిరాకరించింది. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ప్రతిసారి ఎన్నికలకు ముందు ఉనికి చాటుకోవాలనే తపనతో తెరపైకి రావడం ద్వారకాకు సర్వసాధారణమైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తాజాగా టీడీపీ కండువా కప్పుకోవడం విశేషం. టీడీపీకి కొత్త తలనొప్పి రాయచోటి టీడీపీ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్‌కుమార్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబు ఆశిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి వచ్చి చేరారు. ఇప్పటికే అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న నేతల మధ్యలోకి ద్వారకా రావడం కొత్త తలనొప్పి తెచ్చిపెట్టినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు చెప్పుకొని వెలుగొందిన ద్వారకా వైఎస్సార్సీపీకి దూరం కావడం వెనుక అవకాశవాదం ఉన్నట్లు పరిశీలకులు దెప్పిపొడుస్తున్నారు. సీఆర్సీ,ద్వారకాలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు -
Dwarkanath Kotnis: భారత, చైనా మైత్రికి స్ఫూర్తి
భారత – చైనా దేశాల మధ్య స్నేహానికి స్ఫూర్తి డాక్టర్ ద్వారాకానాథ్ శాంతారాం కోట్నిస్. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ కాలంలో ఆయన జీవితం నుండి స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. డాక్టర్ కోట్నిస్ 1910 అక్టోబరు 10న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం ఉధృతం అవుతుండగా, జపాన్ ఫాసిస్టుల దురాక్రమణకు చైనా గురైనకాలం అది. ఈ సమయంలో చైనాకు చెందిన జనరల్ ఛూటే తమ సైనికులకు వైద్యసహాయం అందించటానికి డాక్టర్లను పంపమని జవహర్లాల్ నెహ్రూను కోరారు. ఆ మేరకు 1938లో చైనాకు పంపబడిన 5 మంది డాక్టర్ల బృందంలో 27 ఏళ్ల డాక్టర్ కోట్నిస్ ఒకరు. డాక్టర్ కోట్నిస్, ఆయన బృందం గాయపడిన చైనా సైనికులకు రోజుకు 800 మందికి వైద్యసహాయం అందించేవారు. బృందంలోని డాక్టర్లు తిరిగి ఇండియాకు వచ్చినా కోట్నిస్ అక్కడే ఉండి పోయారు. 1941లో చైనాలోని నార్మన్ బెతూన్ అంతర్జాతీయ శాంతి హాస్పిటల్‌కు ఆయన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1941 డిసెంబరులో ఆయన అక్కడే యుద్ధ రంగంలో పనిచేస్తున్న ఒక చైనా నర్సును వివాహ మాడారు. వారికి కల్గిన కుమారునికి ‘ఇన్ హువా’ అని పేరు పెట్టారు. ఇన్ అంటే ఇండియా, హువా అంటే చైనా అని అర్థం. 1942లో ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. అవిశ్రాంతంగా పనిచేసిన కోట్నిస్‌కు అక్కడి అతిశీతల వాతావరణం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. అందుకే తన కుమారుడు జన్మించిన కొద్ది నెలలకే 1942 డిసెంబరు 9న మూర్ఛవ్యాధితో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 32 సంవత్సరాలు మాత్రమే. ఆయన చనిపోయినపుడు ‘‘చైనా సైన్యం ఒక ఆపన్నహస్తాన్ని పోగొట్టుకుంది. చైనాదేశం ఒక స్నేహితుణ్ణి కోల్పోయింది. డాక్టర్ కోట్నిస్ అంతర్జాతీయ స్ఫూర్తిని మనం ఎల్లప్పుడూ మన మనస్సులలో పదిలపరచుకోవాలి’’ అని చైనా విప్లవ నాయకుడు కామ్రేడ్ మావో యువ డాక్టరుకు ఘనంగా నివాళులర్పించారు. చైనా కోట్నిస్ స్మృతికి గుర్తుగా చైనాలోని కొన్ని నగరాలలో వైద్యశాలలు, విగ్రహాలు, స్థూపాలు నిర్మించింది. చైనా నాయకులు ఇండియా పర్యటనకువచ్చినప్పుడల్లా డాక్టర్ కోట్నిస్ కుటుంబసభ్యులను తప్పనిసరిగా కలవటం ఒక ఆనవాయితీ. ప్రస్తుతం ఇరుదేశాల మధ్యగల సరిహద్దు తగాదాను సామరస్యంగాను, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోను పరిష్కరించుకోవాలి. భారత, చైనా దేశాల మైత్రికి సంకేతంగానూ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి ప్రతీకగానూ నిలిచిన డాక్టర్ కోట్నిస్ ఉద్వేగభరిత జీవితం నుండి స్ఫూర్తిని పొంది భారత, చైనా మైత్రీ ఉద్యమాన్ని నిర్మించటం నేటి తక్షణ కర్తవ్యం. (క్లిక్ చేయండి: తెలుగు నేలపై చైతన్య యాత్ర) – సి. భాస్కర్, యూసీసీఆర్ఐ (ఎమ్ఎల్) (డాక్టర్ కోట్నిస్ 80వ వర్ధంతి సందర్భంగా) -
నాడు వైఎస్.. నేడు జగన్
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం తలకిందులైన తరుణంలోనూ ప్రజలకిచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చుకుంటూ పోతున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఏడాదిలోపే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడమేగాక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్సార్ హయాంలో ఆర్యవైశ్యులకు ఎలా మేలు జరిగిందో.. అలాగే నేడు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మరింత మేలు జరుగుతోందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తొలి నుంచీ ఆర్యవైశ్యులంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆయన హయాంలోనే ఆర్యవైశ్యులే కన్యకాపరమేశ్వరి దేవస్థానాలు, సత్రాలు చూసుకునేలా జీవోలు ఇచ్చారని తెలిపారు. గతంలో తాము అడిగిందే తడవుగా నెల్లూరు జిల్లాకు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగా వైఎస్ నామకరణం చేశారన్నారు. వారింకా ఏమన్నారంటే... బాబు మోసం చేశారు.. ► టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారు. ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ద్వారా రూ.30 కోట్లు ఇస్తామని చెప్పి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గతంలో రాష్ట్రంలోని ఆర్యవైశ్య ప్రముఖులు కట్టించిన ఎన్నో సత్రాలు, ఆలయాలన్నీ దేవదాయ శాఖ పరిధిలోకి వెళ్లిపోయాయి. ► మేము అడిగిన తరువాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఆర్యవైశ్యుల ఆస్తులు వాళ్లే నిర్వహించుకునేలా ముఖ్యమంత్రి జగన్ చెప్పటం గర్వకారణం. ఇళ్ల పట్టాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లోనూ వైశ్యులు భాగస్వాములు అవ్వటం సంతోషంగా ఉంది. గతంలో వైఎస్సార్– కె.రోశయ్య ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులకు ఎలా మేలు జరిగిందో.. అలాగే నేడు జగన్–వెలంపల్లి ఆధ్వర్యంలో మరింత మేలు జరుగుతోంది. ఆర్యవైశ్యుల కల నెరవేర్చారు.. ► ఆర్యవైశ్యులకో కార్పొరేషన్ కావాలనేది ఎప్పటినుంచో ఉన్న కల. దానిని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. మేము నిధులు అడగ్గానే రూ.50 కోట్లను మంజూరు చేశారు. తరువాత మరో రూ.50 కోట్లు ఇస్తామన్నారు. టీటీడీ బోర్డులో ఇద్దరు ఆర్యవైశ్యులను నియమించారు. ఏపీ ఆర్టీఐ కమిషనర్‌గా రేపాల శ్రీనివాస్‌ను నియమించారు. అన్నవరం, కనకదుర్గ, ద్వారకా తిరుమల క్షేత్రాల్లో ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. వెలంపల్లి శ్రీనివాస్ గారికి మంత్రిమండలిలో స్థానం కల్పించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆర్యవైశ్యులపై చూపిస్తున్న ప్రేమను చూసే మద్దాలి గిరి, శిద్దా రాఘవరావు వంటి ఆర్యవైశ్య ప్రముఖులు మద్దతు పలికారు. ► చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యం. ఆర్యవైశ్యుల పట్ల ఆ కుటుంబానికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం ఎంతో గొప్పది. ఇప్పటివరకు జగన్ మాదిరిగా ఇంత ప్రాధాన్యత కలిగిన పదవులను వైశ్యులకు ఎవ్వరూ ఇవ్వలేదు. -
‘దగ్గరుండి దొంగ ఓట్లు వేయించిన టీజీ వెంకటేశ్..’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఖైరతాబాద్ చింతల్‌బస్తీలోని ఆర్యవైశ్య భవన్లో 2018-20గాను రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 13వందలమంది ఆర్యవైశ్యులకు ఓటుహక్కు ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ ద్వారాకనాథ్, పెనుగొండ సుబ్బరాయుడు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో 86శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అయితే, పోలింగ్ విషయంలో తీవ్ర అవకతవలు జరిగినట్టు ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. వైఎస్సార్సీపీకి చెందిన తనను ఓడించేందుకు టీడీపీ కుట్ర పన్నిందని ద్వారాకనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌లో టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారని, దొంగ ఓటు వేస్తున్న వ్యక్తిని ప్రత్యక్షంగా పట్టుకున్నా చర్యలు లేవని ఆయన అన్నారు. ఎన్నికలు వాయిదా వేసి మళ్లీ నిర్వహించాలని ద్వారాకనాథ్ డిమాండ్ చేశారు.