
'కాంగ్రెస్ ఆ పనిచేయడం లేదు'
కాంగ్రెస్కు ఏపీ ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని టీజీ వెంకటేశ్ విమర్శించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకరావడంపై చిత్తశుద్ధి లేదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అనేక బిల్లులకు కాంగ్రెస్ సహకారం కోరుతోందని చెప్పారు.
ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా బిల్లు పాస్ చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేయడం లేదని టీజీ వెంకటేశ్ విమర్శించారు.