
అమెరికా మిత్రుడు కంచ ఐలయ్య గృహ నిర్బంధంలో ఉంటేనే మంచిదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు.
సాక్షి, కర్నూలు: అమెరికా మిత్రుడు కంచ ఐలయ్య గృహ నిర్బంధంలో ఉంటేనే మంచిదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా ఉన్న వారిలో ఐలయ్య కుల మత విద్వేషాలు రెచ్చగొట్టారన్నారు. దేశంలో 95 శాతం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఐలయ్య మాట్లాడారని ఆరోపించారు. గృహ నిర్బంధంలో ఉంచినందుకు ఐలయ్య చంద్రబాబు, కేసీఆర్ లకు ధన్యవాదాలు తెలుపుకోవాలన్నారు.
ఐలయ్య విజయవాడకు వెళ్లి ఉంటే ప్రజలు కృష్ణా నది వరకు తరిమి కొట్టి ఉండేవారని తెలిపారు. విజయవాడలో జరిగిన చర్చల్లో.. బాధాకరమైన అంశాలను తొలగించుకుంటున్నట్లు ఐలయ్య అన్నట్టు.. తమ వద్ద సమాచారం ఉందన్నారు. అయితే, ఆయన అన్నీ విత్ డ్రా చేసుకుంటే తామూ గౌరవప్రదంగా తమ వాఖ్యలను విత్ డ్రా చేసుకుంటామన్నారు.