టీజీ వ్యాఖ్యలపై బాబు స్పందించాలి | Babu should respond on TG comments :kancha ilaiah | Sakshi
Sakshi News home page

టీజీ వ్యాఖ్యలపై బాబు స్పందించాలి

Published Wed, Sep 20 2017 3:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM

టీజీ వ్యాఖ్యలపై బాబు స్పందించాలి - Sakshi

టీజీ వ్యాఖ్యలపై బాబు స్పందించాలి

ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య డిమాండ్‌
 
హైదరాబాద్‌: నడిరోడ్డు మీద ఉరితీయాలని తనపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించాలని ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య డిమాండ్‌ చేశారు. స్పందించ కుంటే ఆయన ఎంపీ తీరును సమర్థిస్తున్నట్టు భావిం చాల్సి వస్తుందని మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీ–మాస్‌ ఫోరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఒక పార్టీ ఎంపీ ఇలా మాట్లాడటంవల్ల అభద్రతాభావానికి గురికావల్సి వస్తుందన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో టీజీ వెంక టేశ్‌పై కేసు పెట్టనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తరువాత మూడేళ్లుగా టీజీ వెంకటేశ్‌ హైదరా బాద్‌లో పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారన్నారు.

కేసీఆర్‌ –టీజీ ఏకాభిప్రాయంతో నడుస్తున్నారని, తనను చంప టానికి ఇద్దరి మధ్యా అంగీకారం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పార్లమెం టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చించేలా పోరా టం చేస్తానని ఐలయ్య చెప్పా రు. దేశంలో వైశ్యులకు అనేక వ్యాపారాలు, పెద్ద పెద్ద పరిశ్ర మలున్నాయని, ప్రభుత్వ ఉద్యోగాలు లేనందున... ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉదన్నారు. ఈ రిజర్వేషన్లపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. వైశ్యుల సంవత్సర ఆదాయంలో ఒక శాతం తీస్తే రూ.30వేల కోట్లు వస్తా యని, వీటితో రైతు సహాయ నిధి ఏర్పాటు చేసి, రైతు ఆత్మహత్యలను ఆపాలని కోరారు. దేశంలోని మేధావులు పరిశోధన చేసి, తాను రాసింది తప్పని రుజువు చేస్తే తన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’పుస్తకాన్ని నిషేధిస్తానని ఐలయ్య చెప్పారు. టీ–మాస్‌ నాయకులు జాన్‌వెస్లీ, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement