
'సీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలి'
రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని టీజీ డిమాండ్ చేశారు. సమ్మర్ లేదా వింటర్ రాజధానిగా దాన్ని ప్రకటించాల్సిందిగా ఆయన కోరారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో కొత్త రాజధాని ఏర్పాటుపై అక్కడి జనంలో ఆనందం కనిపించడం లేదని టీడీపీ నేత టీజీ వెంకటేష్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూములు కోల్పోతున్నామన్న బాధ, ధరల పెరుగుదల అంశాలపై స్థానికులు అసంతృప్తితో ఉన్నారన్నారు.
రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని టీజీ డిమాండ్ చేశారు. సమ్మర్ లేదా వింటర్ రాజధానిగా దాన్ని ప్రకటించాల్సిందిగా ఆయన కోరారు. రాజధాని కోసం కర్నూలు ప్రక్కన 30వేల ఎకరాల భూమి కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ గుడ్డిలోమెల్ల అన్న చందంగా ఉందని టీజీ వెంకటేష్ ఎద్దేవా చేశారు.