టీడీపీ-జనసేనలు కలిస్తే తప్పేంటి? | TG Venkatesh Gives Clarity On Janasena and TDP alliance..? | Sakshi
Sakshi News home page

టీడీపీ-జనసేనలు కలిస్తే తప్పేంటి?

Published Wed, Jan 23 2019 1:11 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

‘జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను ఏమనవద్దు’ అని రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు తమ నేతలకు స్పష్టమైన ఆదేశాలివ్వగా.. తాజాగా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ ఏకంగా టీడీపీ-జనసేనలు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు–పవన్‌ల రహస్య స్నేహం మరోసారి బయటపడింది. బుధవారం టీజీ వెంకటేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ-జనసేనల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ-జనసేన కలిస్తే తప్పేంటని పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఉంటాయని, టీడీపీ-జనసేనలు కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement