వారికంటే అవినీతిపరులే మేలు: టీజీ | former minister tg venkatesh statement on ias officers | Sakshi
Sakshi News home page

వారికంటే అవినీతిపరులే మేలు: టీజీ

Published Mon, Aug 31 2015 7:52 PM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM

వారికంటే అవినీతిపరులే మేలు: టీజీ - Sakshi

వారికంటే అవినీతిపరులే మేలు: టీజీ

కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): పనిచేయని మంత్రులు, ఐఏఎస్‌లకంటే అవినీతికి పాల్పడే అధికారులే తన దృష్టిలో ఉత్తములని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అధికారులు అవినీతికి పాల్పడినా అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సోమవారం  నిర్వహించిన పూర్వ విద్యార్థుల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు, మంత్రులు ఎలా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమనే విషయమై పది మంది విద్యార్థుల అభిప్రాయాలను సేకరించారు. దేశాభివృద్ధికి అవినీతే అడ్డని విద్యార్థులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇందుకు టీజీ స్పందిస్తూ గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను కాల్చివేయాలన్న సందర్భాన్ని గుర్తు చేశారు. అసలు పనిచేయకుండా ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించేందుకే ఆనాడు తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement