
మాజీ మంత్రి టీజీ వివాదాస్పద వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా ఆదోనిలో ఐదుగురు ఎంఐఎం కార్పొరేటర్లు గెలుపొందారని.. ఇక ప్రశాంతత ఎలా సాధ్యమని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు.
కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోనిలో ఐదుగురు ఎంఐఎం కార్పొరేటర్లు గెలుపొందారని.. ఇక ప్రశాంతత ఎలా సాధ్యమని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
కులం, మతం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో కొన్ని ముస్లిం సంస్థలు రెచ్చగొట్టే దోరణి అవలంబిస్తున్నాయని.. వీరివల్లే తాను ఓటమి పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో బీజేపీ పొత్తుతో లాభం చేకూరితే.. కర్నూలులో మాత్రం టీడీపీకి నష్టం జరిగిందన్నారు.