
'ముందుగా రాజీనామా ఆమోదింపచేసుకుంటా'
సీమాంధ్రలో ఉద్యమం తీవ్రతరం కావడానికి చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కారణమని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వ్యతిరేకించేందుకే తాము రాజీనామాలు చేయలేదని తెలిపారు. అవసరమైతే సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసేందుకు సిద్ధమని చెప్పారు. ముందుగా రాజీనామాను ఆమోదింపచేసుకునేది తానేనని అన్నారు.
కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఓట్లు, సీట్లు కోసం ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడాయని మంత్రి టీజీ వెంకటేష్ అంతకుముందు అన్నారు. సమైక్యాంధ్ర జేఏసీనే అధిష్టానంగా భావిస్తున్నామని చెప్పారు. అన్ని పార్టీల అధినేతలు ద్వితీయ శ్రేణి నేతలను నిలువునా ముంచారని పేర్కొన్నారు. సీమాంధ్రలో 6 మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాల్లేకుండా చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చొద్దని కోరారు.