
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో తిరుగులేని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి మంచి పరిపాలన అందిస్తున్నారని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కొనియాడారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాజధాని ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరిగి ఉంటే మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయే వారు కాదన్నారు. రాజధాని ప్రాంతం రైతులు వైఎస్ జగన్‌కు ఓటు వేశారని తెలిపారు. కర్నూలు జిల్లాలో రాజధాని ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment