
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ మతి భ్రమించిన, ఓ పిచ్చి నాయకుడని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ లోనూ ఎన్నో పదవులను చేపట్టిన ఎంపీ కె.కేశవరావుపై నోరుపారేసుకోవడం సరికాదని శనివారం హెచ్చరించారు. టీజీ లాంటి నాయకులు, వ్యక్తుల వల్ల ఏపీకే నష్టమన్నారు.
ఇలాంటి నేతల తప్పుడు మాటల వల్ల 2 రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబుదేనని హెచ్చరించారు. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడుతున్న వారే.. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించేలా, కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. మతి భ్రమించి మాట్లాడుతున్న టీజీని తక్షణమే పిచ్చాసుపత్రిలో చేర్చాలని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment