కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై టీజీ ఫైర్ | TG Venkatesh attack on Kotla Suryaprakash Reddy | Sakshi
Sakshi News home page

కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై టీజీ ఫైర్

Published Sun, Jan 19 2014 12:00 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై టీజీ ఫైర్

కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై టీజీ ఫైర్

కర్నూలు: కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిక్కెట్టు ఇవ్వలేదని కార్యాలయానికి నిప్పంటించే సంస్కృతి ఒక్క సూర్య ప్రకాశ్‌ రెడ్డికే ఉందని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే భయంతో ఎవరుపడితే వారిపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. ఓవైపు మంత్రి పదవులు అనుభవిస్తూ మరోవైపు కాంగ్రెస్ పార్టీని నిందించటం సరికాదని టీజీని ఉద్దేశించి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్‌ పార్టీని  వీడతానన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీజీ వెంకటేష్ తెలిపారు. పార్టీ కన్నా ప్రజల మనోభావాలే ముఖ్యమని అన్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే సీమాంధ్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement