ఆర్యవైశ్యులకు దేశభక్తి ఎక్కువ
ఆర్యవైశ్యులకు దేశభక్తి ఎక్కువ
Published Sun, Aug 28 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
రాస్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్
ఆదోని: ఆర్యవైశ్యులకు దేశభక్తి ఎక్కువని, సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఆదోని పట్టణ శివారులో ఐదెకరాల విస్తీర్ణంలో రూ.25 లక్షలతో చేపట్టిన శ్రీ వాసవీ కన్వెన్షెన్ సెంటర్ భవన నిర్మాణానికి ఆదివారం టీజీ దంపతులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ పట్టణంలో కన్వెన్షన్ సెంటర్‌తోపాటు వాసవీమాత ఆలయ నిర్మాణానికి స్థానిక ఆర్యవైశ్య ముఖ్యులు కార్యోన్ముఖులు కావడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు. గోదావరి, కష్ణా పుష్కరాల్లో కూడా ఆర్యవైశ్యుల సేవలు ఎంతో అభినందనీయంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల్లో కూడా ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని, అలాంటి వారి ఆర్థిక అభివద్ధి కోసం రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అంతకు ముందు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు టీజీకి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయమై తాము ముఖ్యమంత్రితో మాట్లాడతామని టీజీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాచోటి రామయ్య, మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేకర్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పత్తి సర్వేశ్వర ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విట్టా సురేంద్రబాబు, సంఘం ప్రముఖులు విట్టా రమేష్ కుమార్, టీజీ పాండురంగశెట్టి, మహిళా సంఘం ముఖ్యులు విట్టా రాధిక, కౌన్సిలర్ విట్టా శ్రీలత, యార్డు మాజీ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement