patriots
-
‘వారు దేశభక్తులు’: ఇవాంకపై విమర్శలు
వాషింగ్టన్: అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ జో బైడెన్ గెలుపును ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఆందోళనలను అణచివేసే క్రమంలో జరిపిన కాల్లుల్లో ఇప్పటి వరకు నలుగురు మరణించారు. ఇక ట్రంప్ తీరును సొంతపార్టీ నేతలతో పాటు ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుమార్తె, వైట్‌హౌజ్ సలహాదారు ఇవాంక ట్రంప్ తీరు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్తతలను తగ్గించాల్సింది పోయి అనాలోచిత వ్యాఖ్యలతో వాటిని మరింత పెంచుతూ.. అగ్నికి ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. ఇంతకు విషయం ఏంటంటే క్యాపిటల్ భవనంపై దాడి చేసిన ట్రంప్ మద్దతురాలను ఇవాంక దేశభక్తులతో పోల్చారు. నిరసకారులను దేశభక్తులతో పోల్చడం పట్ల తీవ్ర విమర్శలు రేగడంతో ఆ ట్వీట్‌ని డిలీట్ చేశారు. (చదవండి: మమ్మల్ని ఏ శక్తి ఆపలేదు; మేం ఊహించలేదు!) ఈ ట్వీట్లో ఇవాంక ‘అమెరికా దేశభక్తులురా.. భద్రతా ఉల్లంఘన, చట్టాల అమలును అగౌరవపర్చడం ఆమోదయోగ్యం కాదు. హింస ఎన్నిటికి ఆమోదం కాదు. దయచేసి గౌరవంగా ఉండండి’ అని కోరారు. దీనిపై భారీ ఎత్తున విమర్శలు రావడంతో వెంటనే ఈ ట్వీట్‌ని డిలీట్ చేశారు. కానీ ఈలోపే నెటిజనులు ఆ ట్వీట్‌ని ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ తర్వాత కూడా ఇవాంక తన తండ్రి మద్దతుదారులను ఆందోళన విరమించమని కోరకపోగా.. దేశభక్తులంటూ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను దేశ భక్తులన్నది ఆందోళనకారులని కాదని.. వారు చేసే నిరసనని అంటూ కేట్ బెన్నెట్ చేసిన ట్వీట్‌కి సమాధానం ఇచ్చారు ఇవాంక. ఈ క్రమంలో ‘శాంతియుత ఆందోళన దేశభక్తికి చిహ్నం. హింస ఎన్నిటికి ఆమోదయోగ్యం కాదు.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ కేట్ బెన్నెట్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు ఇవాంక.(చదవండి: క్యాపిటల్ బిల్డింగ్ విమానంతో కూల్చేస్తాం!) No. Peaceful protest is patriotic. Violence is unacceptable and must be condemned in the strongest terms. https://t.co/GwngZTqzTH — Ivanka Trump (@IvankaTrump) January 6, 2021 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్ శాంతియుతంగా అధికార మార్పడికి సహకరించట్లేదు. పైగా జో బైడెన్ గెలుపును అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో బైడెన్ ఎన్నికను వ్యతిరేకించాలంటూ రిపబ్లికన్ నేతల మద్దతు కోరి భంగపడ్డ సంగతి తెలిసిందే. -
మనోజ్ తివారీ స్పెషల్ సాంగ్.. ఇది వారికోసమే!
న్యూఢిల్లీ : ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఓ స్పెషల్ సాంగ్ పాడారు. అయితే ఈ పాట ఓ మూవీ కోసమో, ప్రైవేట్ ఆల్బమ్ కోసమో కాదు. పాత నోట్లు రద్దయిన దగ్గర్నుంచి నగదు కోసం బ్యాంకుల వద్ద నిరీక్షిస్తున్న వారికోసం ఈ ప్రత్యేక పాటను ఆలపించారు. క్యూలో నిల్చున్న వారందరూ దేశభక్తులుగా నిలిచిపోతారంటూ అభివర్ణిస్తూ మనోజ్ తివారీ ఈ పాటను పాడారు. పాత నోట్లు రద్దయిన దగ్గర్నుంచి బ్యాంకులు, ఏటీఎంల వద్ద నుంచి నగదు తీసుకోవడం కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. రోజుల తరబడి ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్దనే నిరీక్షిస్తున్నారు. వారందరి కోసం మనోజ్ తివారీ ఆ పాటను దేశరాజధానిలోని మోతీ బాగ్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఓ ప్రొగ్రామ్‌లో ఆలపించారు. బ్లాక్‌మనీపై పోరాటానికి ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించే వారు దేశభక్తులుగా పరిగణించబడతారని పలువురు అభివర్ణించారు కూడా. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్న మనోజ్ తివారీ, రాజకీయాలోకి రాకముందు గాయకుడు, నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, సంగీత దర్శకుడు. అనంతరం ఆయన బిహార్ నుంచి రాజకీయాలోకి ప్రవేశించి, ఢిల్లీకి పార్టీ అధ్యక్షుడయ్యారు. -
ఆర్యవైశ్యులకు దేశభక్తి ఎక్కువ
రాస్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆదోని: ఆర్యవైశ్యులకు దేశభక్తి ఎక్కువని, సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఆదోని పట్టణ శివారులో ఐదెకరాల విస్తీర్ణంలో రూ.25 లక్షలతో చేపట్టిన శ్రీ వాసవీ కన్వెన్షెన్ సెంటర్ భవన నిర్మాణానికి ఆదివారం టీజీ దంపతులు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ పట్టణంలో కన్వెన్షన్ సెంటర్‌తోపాటు వాసవీమాత ఆలయ నిర్మాణానికి స్థానిక ఆర్యవైశ్య ముఖ్యులు కార్యోన్ముఖులు కావడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు. గోదావరి, కష్ణా పుష్కరాల్లో కూడా ఆర్యవైశ్యుల సేవలు ఎంతో అభినందనీయంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల్లో కూడా ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని, అలాంటి వారి ఆర్థిక అభివద్ధి కోసం రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అంతకు ముందు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు టీజీకి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయమై తాము ముఖ్యమంత్రితో మాట్లాడతామని టీజీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాచోటి రామయ్య, మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేకర్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పత్తి సర్వేశ్వర ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విట్టా సురేంద్రబాబు, సంఘం ప్రముఖులు విట్టా రమేష్ కుమార్, టీజీ పాండురంగశెట్టి, మహిళా సంఘం ముఖ్యులు విట్టా రాధిక, కౌన్సిలర్ విట్టా శ్రీలత, యార్డు మాజీ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.