అది ‘సెంటిమెంట్’కు శంకుస్థాపన | Foundation stone to sentiment AP development | Sakshi
Sakshi News home page

అది ‘సెంటిమెంట్’కు శంకుస్థాపన

Published Sun, Oct 25 2015 1:33 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

అది ‘సెంటిమెంట్’కు శంకుస్థాపన - Sakshi

అది ‘సెంటిమెంట్’కు శంకుస్థాపన

శంకుస్థాపన ఆర్భాటాలకు వందల కోట్లు ఎలా కేటాయిస్తున్నారు? కొంత మంది మంత్రులు శంకుస్థాపన పనులకు రూ.9 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదని చెప్పారు. ‘ఖర్చులపై శ్వేతపత్రం ఇవ్వచ్చుగా’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. కొన్ని పనులు శాశ్వత ప్రాతిపదికన చేస్తున్నాం. కనుక ఆ ఖర్చును ఈ పద్దులో చూపలేం అని తప్పించుకుంటున్నారు.
 
 ‘అప్రాధాన్యతాంశాన్ని ప్రాధాన్య తాంశంగా మార్చడం; ప్రాధాన్య తాంశాన్ని అప్రాధాన్యతాంశం చేయడమే రాజకీయం’(Making a non-issue into an issue and an issue into a non-issue) అన్నది ఓ రాజకీయ నానుడి. దీనిని ఓ కళగా చేసుకొని రాజకీయాల స్వరూప స్వభావాల్ని తమకు అనుకూలంగా మార్చుకొన్న నాయకులు చరిత్రలో అనేకమంది కనిపిస్తారు. తెలుగునాట ఆ కళలో ఆరితేరిన నేతల్లో చంద్రబాబునాయుడు ఒకరు. అందుకు గురువారం జరిగిన అమరావతి శంకుస్థాపన ఉదంతమే ఉదాహరణ. ‘అమరావతి నిర్మాణం’ పేరుతో ముఖ్య మంత్రి చంద్రబాబు గొప్ప ప్రచార హోరును సృష్టించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు చేస్తున్న పోరాటాలు ఆ హోరులో కొట్టుకుపోతాయన్నది చంద్ర బాబు వ్యూహం. అంతేకాదు.. అమరావతి శంకుస్థాపనలాంటి చరిత్రలో నిలిచిపోయే ఓ అపూర్వమైన వేడుకకు హాజరుకాకపోతే అదో నేరమనీ, గైర్హాజరయ్యేవారు చరిత్రహీ నులుగా మిగిలి పోతారనీ ఓ వింత వాదన లేవదీసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.
 
 ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన రాజధాని కావాల్సిందే. వద్దని ఎవ్వరూ అనలేదు. కానీ నూతన రాజధాని నిర్మాణం పేరుతో సాగిన విధ్వంసం, చట్టాల ఉల్లంఘన; శంకుస్థాపన పేరుతో జరి గిన ప్రజాధనం దుర్వినియోగం వంటి అంశాలపైననే ప్రతి పక్షాలు, మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రభు త్వం ఆలోచన వేరు. తాము ఏకపక్షంగా సాగిస్తున్న కార్యక్రమా ల్లోని లొసుగులను, ఉల్లంఘనలను ప్రశ్నించకుండా, నోరుకట్టేసు కొని అందరిలా కేవలం అతిథులుగా పాల్గొని వెళ్లాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమతంగా కనిపిస్తుంది.
 
 ఓటుకు కోట్లు కేసు ఏమైంది?
 అవసరం అనుకొంటే చంద్రబాబు రాజకీయంగా ఒకటికాదు, అనేక మెట్లు దిగడానికి సిద్ధపడతారు. అది ఆయన బలం కావొచ్చు. లేదా నైజం కావచ్చు. కాని, ప్రజాప్రయోజనాల విష యంలో రాజీపడడం సహించరానిది. తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశాన్ని కుదిపివేసిన ‘ఓటుకు కోట్లు కేసు ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి చంద్రబాబు, ఆయన పార్టీ సహచరులు డబ్బు ఎర వేశారని; తద్వారా తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని ప్రయత్నిస్తున్న క్ర మంలోనే తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి చిక్కినట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏసీబీ చార్జిషీట్‌లో చంద్రబాబు పేరును 22 సార్లు ఉటంకించింది.
 
 మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోన్‌తో సహా పలువురి ఫోన్లను ‘ట్యాప్’ చేశారని; దీంతో తెలం గాణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కౌంటర్ ఇచ్చారు. కానీ ఓటుకు కోట్లు కేసు దాదాపు క్లైమాక్స్‌కు చేరుకుందన్న దశలో అటు ఇటు అంతా అనూహ్యంగా మిన్నకుండిపోవడమే అనుమానాలు కలిగిస్తున్నది. శంకుస్థాప నకు ఆహ్వానించడానికి చంద్రబాబు స్వయంగా చంద్రశేఖర్‌రావు ఇంటికి  వెళ్లడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. రెండు రాష్ట్రాల అభివృ ద్ధికి అది అనివార్యం. కాకపోతే తీవ్రమైన స్థాయిలో ఆరోపణలు చేసుకొన్న నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు కలుసుకోవ డం, ఓ 10 నిమిషాలు ఏకాంతంగా చర్చించుకోవడం అనుమానా లకు ఆస్కారమిస్తుంది.
 
 ప్రత్యేక హోదా హక్కును వదులుకోవడానికి సిద్ధపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చడానికి ‘రాజ ధాని సెంటిమెంట్’కు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే... ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పెద్దల్ని కలుసుకొనే సమయంలో తిరుపతి లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్నారు. భక్తిప్రపత్తులు, మత విశ్వా సాలు వ్యక్తిగతంగా ఉండటంలో తప్పేమీకాదు. కాని, అవి పరిపా లనలో, ప్రభుత్వపరంగా చేసే ప్రతిపనిలో ప్రతిఫలించడం లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. ‘అమరావతి శంకుస్థాపన’ సందర్భంగా రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుండి మట్టి, నీరు సేకరించడానికి ‘మననీరు - మన మట్టి’ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఒక్కో జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున రూ.39 కోట్లు కేటాయించారు. ‘రాజధాని అమరావతి’ అందరిదీ అనే భావన కేవలం అన్ని ప్రాంతాల నుండి మట్టి, పవిత్రజలాలు తెచ్చి ఉపయోగిస్తే వస్తుందా? లేక అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం వల్ల కలుగుతుందా?
 
 శంకుస్థాపన పేరుతో జరిగిన దుబారా అందర్నీ విస్మయ పరుస్తోంది. రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా బడ్జెట్ లేదంటున్నారు. కాని, శంకుస్థాపన ఆర్భాటాలకు వందల కోట్లు ఎలా కేటాయిస్తున్నారు? కొంత మంది మంత్రులు శంకుస్థాపన పనులకు రూ.9 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదని చెప్పారు. ‘ఖర్చులపై శ్వేతపత్రం ఇవ్వచ్చుగా’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. కొన్ని పనులు శాశ్వత ప్రాతిపదికన చేస్తున్నాం. కనుక ఆ ఖర్చును ఈ పద్దులో చూపలేం అని తప్పించుకుంటున్నారు. గోదావరి పుష్కరాలకు రూ.1,550 కోట్లు కేటాయించి చేసిన పనులు ఏమిటో ప్రజలందరూ గమనించారు.
 
 సెంటిమెంట్ రాజకీయం
 ‘సెంటిమెంట్’ తాత్కాలిక భావన. దాని వల్ల దీర్ఘకాలంలో పాల కులకు కలిగే ప్రయోజనం శూన్యం. ఆ వాస్తవం చంద్రబాబు వంటి రాజకీయుడికి తెలియంది కాదు. కాని, ఒక వాస్తవాన్ని మరుగునపర్చడానికి సెంటిమెంట్‌ను వాడుకోవాలనుకుంటు న్నారు. తిరుపతిలో మునికోటి ఆత్మార్పణం మొదలుకొని.. వరు సగా జరిగిన సంఘటనలు; ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ దీక్ష మొదలైన అంశాలు.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. అదీ ఒకరకమైన సెంటిమెంట్‌గా రూపుదాల్చింది. అందుకే ‘ప్రత్యేకహోదా సెంటిమెంట్’ను దెబ్బ తీయడానికి అమరావతి నిర్మాణం సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అధికార పార్టీ నేతలు ప్రయాసపడుతున్నారు.
 
 ‘అమరావతి సెంటిమెంట్’ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కనిపిస్తే ఆశ్చర్యమేమీలేదు. అక్కడ భూములున్న మోతుబరులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు నిజంగా పండుగే. ప్రభు త్వమే స్వయంగా అక్కడి భూముల రిజిస్ట్రేషన్ ఆదాయం పెంచు కోవడానికి భూముల విలువలను విపరీతంగా పెంచేసింది. కాని, ఆ రెండు జిల్లాల్లో పేదలు, మధ్యతరగతి ప్రజల గురించి ఎవ్వరూ ఆలోచించడంలేదు. వారి ఆదాయంలో మార్పులేదు గానీ జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది. ఇక, అభివృద్ధి మొత్తం అమరా వతి చుట్టూనే జరగబోతోందన్న సంకేతాలు వెలువడటంతో.. మిగతా ప్రాంతాల ప్రజల్లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వాసుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.
 
 హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి సాగునీటి ప్రాజెక్టును చేపట్టకుండా; విభ జన బిల్లులో పేర్కొన్న విధంగా రాయలసీమలో ఏర్పాటు కావా ల్సిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఇతర జిల్లాలకు తరలించడం వంటి చర్యలతో... స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డే ప్రాంతీయ అసమానతలను పెంచే దిశగా ముందుకు సాగుతు న్నారు. తమ పార్టీకి ఎక్కువ స్థానాలు లభించనందున కర్నూలు లో ఏర్పాటు కావాల్సిన రెండు విద్యా సంస్థల్ని వేరే జిల్లా కు తర లించడం ఇందుకు ఒక ఉదాహరణ. కడప జిల్లాలో ఏర్పాటు కావా ల్సిన ఉక్కు ఫ్యాక్టరీపై ప్రజలకు స్పష్టత ఇవ్వకపోవడం మరొకటి.
 
 రాజకీయాల్లో సెంటిమెంట్లు ఉంటే ఉండొచ్చు. కాని.. ‘సెంటిమెంట్’తో రాజకీయం చేయాలనుకోవడం అవివేకం. ప్రత్యేక హోదా హక్కుకు సెంటిమెంట్ ప్రత్యామ్నాయం కాదు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన డం ఎంత ముఖ్యమో... ఆ సందర్భంగానైనా ఆయనతో ప్రత్యేక హోదా ప్రకటన చేయించడం కూడా ముఖ్యమే. శంకుస్థాపనకు ఎన్ని కోట్లు ఖర్చు చేసినా, ఎంత మంది ప్రముఖులు హాజరయి నా, ప్రత్యేకహోదా ప్రకటన వెలువడకపోవడంతో అంతా బూడి దలో పోసిన పన్నీరే అయింది. చంద్రబాబు ప్రత్యేకహోదా అడగ లేదు. ప్రధాని ప్రస్తావించలేదు.
 
ముఖ్యమంత్రి ప్రస్తావించిన ప్రత్యేక ప్యాకేజీని సైతం మోదీ పట్టించుకోలేదు. పైగా రాష్ట్ర విభ జనకు కాంగ్రెస్ పార్టీని నిందించడం మోదీ ద్వంద్వ నీతికి నిదర్శ నం. బాబూ, మోదీ జోడీ ఆంధ్రుల నోట్లో పార్లమెంట్ మట్టి కొట్టారు. చంద్రబాబు అడిగింది మట్టి, నీరు. ఆ రెండూ ప్రధాని పట్టుకొచ్చారు. పార్లమెంటు మట్టి, యమునానది నీళ్లు. యద్భా వం తద్భవతు. చంద్రబాబు భావన ఎట్లా ఉన్నదో ఆచరణలో అ దే జరిగింది. అందుకే మట్టి సత్యాగ్రహం చేయవలసి వస్తున్నది.
 వ్యాసకర్త ఎమ్మెల్సీ,
 లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్
  మొబైల్ : 8106915555
 - సి. రామచంద్రయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement