
కేసీఆర్ పక్కన తెలంగాణ ద్రోహులే: రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులను కుడిఎడమలుగా పెట్టుకున్న కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ ద్రోహులను పెట్టుకుంటున్నారని టీటీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన చినజీయర్‌స్వామి, కేవీపీ రామచంద్రరావు వంటివారిని కుడిఎడమలుగా కేసీఆర్ పెట్టుకుంటున్నారన్నారు.
కేసీఆర్ బంధువుకు చెందిన కావేరీ కంపెనీ భూములు 265 ఎకరాలను మునిగిపోకుండా చూసేందుకే కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 21టీఎంసీల నుంచి 7టీఎంసీలకు తగ్గిస్తు న్నారన్నారు. రెండున్నరేళ్లుగా రూ.2 లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలవడం ద్వారా రూ.20వేల కోట్లు కమీషన్లుగా సీఎం కేసీఆర్ తీసుకున్నారన్నారు. ఇప్పుడు ఓట్లకోసం కులాలు, ఉపకులాల మధ్య చిచ్చుపెట్టి కుట్రలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు.