
సాక్షి, జనగామ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బతుకమ్మ చీరలపై వచ్చిన కమీషన్ డబ్బులతో టీఆర్‌ఎస్ సింగరేణి ఎన్నికల్లో విజయం సాధించిందని విమర్శించారు. ఆయన శుక్రవారం జనగామలోని టీడీపీ పార్టీ కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల కమీషన్ డబ్బులను ఇబ్బడి ముబ్బడిగా సింగరేణి ఎన్నికల్లో ఖర్చుపెట్టి కేసీఆర్ గట్టెక్కారు.
అలాంటి కేసీఆర్‌ను అవే బతుకమ్మ చీరలతో ఉరి వేయాలి. జనగామ ఎమ్మెల్యే ప్రభుత్వ కుంటను ఆక్రమించారని స్వయంగా కలెక్టర్ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేసీఆర్ తక్షణమే స్పందించి ఈ అంశంపై న్యాయ విచారణ చేపట్టి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment