చంద్రబాబుతో రేవంత్ భేటీ | revanth reddy meets cm chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో రేవంత్ భేటీ

Published Tue, Sep 15 2015 11:34 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

చంద్రబాబుతో రేవంత్ భేటీ - Sakshi

చంద్రబాబుతో రేవంత్ భేటీ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో టీ టీడీపీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నేరుగా విజయవాడకు వెళ్లిన ఆయన మరికొందరు తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబును కలిశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయి ఇటీవల బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే.

దీంతోపాటు త్వరలోనే తెలంగాణ ప్రాంత టీడీపీ బాధ్యతల పగ్గాలు అప్పగించేందుకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు మొదలైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో టీ టీడీపీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారనే ఊహాగానాలు కూడా ఊపందుకుంటున్న నేపథ్యంలో కూడా వారి సమావేశం చర్చనీయాంశం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement