vote for crores
-
మరోసారి ఓటుకు కోట్లు ?
-
చంద్రబాబుతో రేవంత్ భేటీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో టీ టీడీపీ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నేరుగా విజయవాడకు వెళ్లిన ఆయన మరికొందరు తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబును కలిశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయి ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. దీంతోపాటు త్వరలోనే తెలంగాణ ప్రాంత టీడీపీ బాధ్యతల పగ్గాలు అప్పగించేందుకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు మొదలైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో టీ టీడీపీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారనే ఊహాగానాలు కూడా ఊపందుకుంటున్న నేపథ్యంలో కూడా వారి సమావేశం చర్చనీయాంశం అయింది. -
అసెంబ్లీకి రాని బాబు.. ఛాంబర్‌కే పరిమితం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకాలేదు. కీలకమైన ఓటుకు కోట్లు కుంభకోణం అంశంపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చ జరపాలని పట్టుబడుతున్న నేపథ్యంలో చంద్రబాబు చర్చలో లేకపోవడం సర్వత్రా విమర్శ నెలకొంది. ఓటుకు కోట్లు కేసులో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆయన పార్టీకి చెందిన మరికొందరు ప్రధాన పాత్ర ఉన్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టిన విషయం తెలిసిందే. మరోపక్క, ఈ కేసునుంచే బయటపడేందుకే చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారనే విమర్శలు కూడా బాహాటంగానే వస్తున్నాయి. దీంతో ఏకంగా రాష్ట్ర భవిష్యత్తును తన వ్యక్తిగత కారణంగా కేంద్రం వద్ద ఫణంగా పెట్టిన చంద్రబాబునాయుడిపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఆగ్రహం ప్రదర్శిస్తోంది. ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఓటుకు కోట్లు కుంభకోణం కేసుపై చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో రెండుసార్లు సమావేశం వాయిదా కూడా పడింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సమావేశాలవైపు రాకుండా కేవలం ఛాంబర్ కే పరిమితమయ్యారని విమర్శలు చేస్తున్నారు. -
'ఆయన పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ'
-
'ఆయన పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత రాష్ట్రంలో తప్పించుకొని పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఆయన దొంగతనాలు, దొంగ బుద్ధి సొంత రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా చూపించాడని తెలిపారు. కానీ, అక్కడి చివరికి దొరికిపోయాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరువును నిలువునా తీశారాని, భవిష్యత్తును తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసుపై చర్చ జరగాల్సిందిగా వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, దీనికి స్పీకర్ నిరాకరించడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టారు. ఈ క్రమంలో సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మీడియా వద్ద చెవిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబులాంటి అవినీతి పరుడు రాష్ట్రంలో ఎవరూ లేరని అన్నారు. తన అవినీతి సొమ్ముతో ఇరు రాష్ట్రాల్లో ఓట్లు కొన్నారని ఆరోపించారు. రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్న చంద్రబాబునాయుడు రెండు వేల ఎకరాల స్థాయికి ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ఓటుకు కోట్లుపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎప్పుడైనా అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అవకాశం ఉన్నా విజయవాడ వెళ్లిపోదామంటున్నారని ఎద్దేవా చేశారు. -
'ఎన్నికుట్రలు చేసినా ఎవరేం చేయలేకపోయారు'
విజయవాడ: చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసులోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. తనపై గతంలోనే ఎన్నో కుట్రలు జరిగాయని అయినా ఎవరూ ఏం చేయలేకపోయారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏపీలో పెట్టుబడులకు సింగపూర్, చైనా, జపాన్ కంపెనీలు ముందుకొస్తున్నాయని చెప్పారు. భూసేకరణ ద్వారా 53 వేల ఎకరాలు, అటవీ భూముల నుంచి మరో 50 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రతివారం మంత్రులు, అధికారులతో సమీక్ష జరుపుతామని తెలిపారు. ప్రతి నెలా ప్రత్యేక సమావేశం నిర్వహించి దేశంలోనే ప్రతిష్టాత్మక కేపిటల్ నిర్మిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన, రాజకీయ పార్టీల ప్రవర్తన, పార్లమెంటులో అనుసరించిన విధానంపై విధాన పత్రాన్ని చంద్రబాబునాయుడు ప్రకటించారు. -
టీడీపీ నేత ప్రదీప్‌కు ఏసీబీ నోటీసులు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఉన్నవారి సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా ఏసీబీ అధికారులు టీడీపీ నేత ప్రదీప్‌కు ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందించారు. 160సీఆర్పీసీ కింద ప్రదీప్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో సీఆర్పీసీ కింద టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, ఇద్దరు డ్రైవర్లకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే విచారించారు. విచారణ జరిగిన వెంటనే టీడీపీ నేత ప్రదీప్‌కు నోటీసులు జారీ చేయడం మరోసారి ఓటుకు నోటుకు కేసు చర్చనీయాంశంగా నిలిచింది. -
ఓటుకు కోట్లు గల్లీ నినాదమైందా?
ఎన్నో దశాబ్దాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించింది. తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లాగా విడిపోయి, రెండు రాష్ట్రాలైనా ఆత్మీయులుగా కలిసుందా మని నేతలందరూ ప్రగల్భాలు పలికారు. ఇద్దరు ‘చంద్రు’లు అధికార పగ్గాలు చేపట్టి ఒకరిని మించి మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ, తమ పార్టీల ప్రయోజనాల మోజులో ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. 2009 తర్వాత ఇటీవల మరొకసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ తెరపైకి వచ్చింది. కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 63. కానీ ఎమ్మెల్యేల కోటాలో మొన్న జరిగిన ఎమ్మె ల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులకు 85 ఓట్లు ఎలా వచ్చాయంటే అధికార పక్షం నుండి స్పష్టమైన జవాబు లేదు. దొడ్డిదారినే ఈ ఎమ్మె ల్యేలు సంఖ్యను పెంచుకున్నారనేది నగ్నసత్యం. ఎమ్మెల్యేలు బహిరం గంగా పార్టీ మారుస్తారు. అధికార పార్టీలో తిరుగుతారు. స్పీకర్‌కు ఫిర్యాదులందినా చర్యలు లేవు. మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. నెలలు, సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పెడతారు. బ్యూరో క్రసీ అలాంటి పనులు చేస్తే చర్యలు చేపట్టవలసిన పాలకులే ఫైలు పెం డింగ్‌లో పెట్టడమంటే ప్రజాస్వామ్య విలువలను మంట కలపటమే. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రకటన వెలువడగానే సందడి ఆరంభమైంది. టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్‌రెడ్డి స్వయంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ దొరికిపోయా రు. ఇది చినికి చినికి గాలివానలా మారింది. ఈ నిర్వాకం దేశవ్యాపిత చర్చగా మారింది. దీని వెనుక సూత్రధారి ఎవరు అనేది పరోక్షంగా తెలుస్తూనే ఉన్నది. టీడీపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకున్నది. చంద్రబాబు ప్రమేయంపై ఆధా రాలు ఉన్నాయని, రేపో మాపో చట్టపరమైన చర్యలుంటాయని సాక్షా త్తు హోంశాఖామాత్యులు నాయిని నర్సింహారెడ్డి చెప్పి నెల కావస్తున్నా ఎలాంటి కదలిక లేదు. మరోవైపు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు అందులోని గొంతు తనది కాదని చంద్రబాబు ప్రకటించలేదు. చంద్ర బాబుకు ఏసీబీ నోటీసులిస్తుందని లీకేజీ వార్తలు వచ్చాయి. నోటీసు ఇస్తే ఒక గంటలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని చంద్రబాబు ప్రకటించడం బజారు పంచాయితీని గుర్తు చేస్తున్నది. మరొకవైపు చంద్రబాబు, ఆయన మంత్రులు నేరుగా గవర్నర్‌నే తప్పుపడుతున్నారు. ఆయన కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారానికి పూనుకున్నారు. ఈ వ్యవహారానికి సెంటిమెంట్ రంగు పులి మేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రులు సెక్షన్- 8, 9, 10లను తెర మీదకు తెస్తున్నారు. గవర్నర్ తన పాత్ర పోషించలేదనే మాట గట్టిగా వినిపిస్తున్నారు. నెల దాటినప్పటికీ ఈ అంశం చుట్టూ రాజకీయ వ్యవస్థలు పరిభ్రమించడం సిగ్గుచేటు. సెక్షన్ 8ని అమలు చేయకపోతే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరతామని టీడీపీ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. అనేక సుదీర్ఘ పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్ 8-9-10 లేదా ఏ ప్రతిపాదనను తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీ, సంస్థ కూడా అంగీకరించవు. పునర్విభజన చట్టంలో పొందుపరచిన నిబంధనలను ఎవరు అతి క్రమించినా చట్టం దాని పని అది చేయాలే తప్ప తిమ్మిని బమ్మిని చేసి, కాలం గడుపుకుంటామంటే సాగదని ప్రజాస్వామ్యవాదులు హెచ్చ రికలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్రం మౌనం వీడి చట్టప రమైన చర్యలు వేగవంతం చేసేందుకు ఆదేశాలివ్వాలి. లేకపోతే టీడీపీ ఉచ్చులో బీజేపీ పడిందనే వాదనకు బలం చేకూరుతుంది. ఇలాంటి కంపు రాజకీయాల అంతానికి వామపక్షాలు, ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు ప్రత్యక్ష ఆందోళనలకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైంది. (వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి) ఫోన్: 040-23224966