ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత రాష్ట్రంలో తప్పించుకొని పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఆయన దొంగతనాలు, దొంగ బుద్ధి సొంత రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా చూపించాడని తెలిపారు. కానీ, అక్కడి చివరికి దొరికిపోయాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరువును నిలువునా తీశారాని, భవిష్యత్తును తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసుపై చర్చ జరగాల్సిందిగా వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే, దీనికి స్పీకర్ నిరాకరించడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టారు. ఈ క్రమంలో సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మీడియా వద్ద చెవిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబులాంటి అవినీతి పరుడు రాష్ట్రంలో ఎవరూ లేరని అన్నారు. తన అవినీతి సొమ్ముతో ఇరు రాష్ట్రాల్లో ఓట్లు కొన్నారని ఆరోపించారు. రెండు ఎకరాల భూమి మాత్రమే ఉన్న చంద్రబాబునాయుడు రెండు వేల ఎకరాల స్థాయికి ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ఓటుకు కోట్లుపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎప్పుడైనా అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అవకాశం ఉన్నా విజయవాడ వెళ్లిపోదామంటున్నారని ఎద్దేవా చేశారు.
Published Fri, Sep 4 2015 9:51 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
Advertisement