file photo
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)ల నియామకాలపై సీనియర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, విమర్శలు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టికి వెళ్లాయి. హరియాణాలోని ఖేర్లీలాలా వద్ద రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి ఆయనతో కలిసి కొద్దిసేపు నడిచారు. ఈ సందర్భంగా టీపీసీసీ వ్యవహారాలపై ఆయనతో మాట్లా డారు. తనతోపాటు పార్టీలోకి వచ్చిన నేతలు 15 మందికి మించి ప్రస్తుత కమిటీలలో లేరని, ఈ నియామకాల్లో ఆయానేతలు సిఫారసు చేసిన పేర్లను పరిగణనలోకి తీసుకున్నామని రాహుల్‌కు వివరించినట్లుగా తెలిసింది.
ఈ విషయంలో ఇప్పటికే అధిష్టాన దూతగా వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్యకు చేసిన ప్రయత్నాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లుగా సమాచారం. ఇదే సమయంలో ఏఐసీసీ దేశవ్యాప్తంగా తలపెట్టిన ‘హాత్ సే హాత్ జోడో’యాత్రపైనా ఇద్దరి నేతలు చర్చించుకున్నట్లు తెలిసింది. దీంతోపాటే జనవరి 26 నుంచి తాను తలపెట్టిన ‘యాత్ర ఫర్ చేంజ్’ పాదయాత్రపైనా రేవంత్ వివరణ ఇచ్చినట్లుగా సమాచారం.
దీనికి రాహుల్ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఎల్పీ నేతల భేటీలోనూ రేవంత్ పాల్గొన్నారు. ఈ భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సైతం హాజరయ్యారు. ఇందులో రేవంత్ పాదయాత్ర అంశం ప్రస్తావనకు తెచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రధాని మోదీ నియంతృత్వాన్ని ఈ యాత్ర ద్వారా ఎండగట్టే అంశాల ప్రణాళికను ఏఐసీసీ భేటీలో వివరించినట్లు తెలిసింది.
జనవరి 2, 3 తేదీల్లో శిక్షణాతరగతులు: రేవంత్
హాత్ సే హాత్ జోడో యాత్ర, యాత్ర ఫర్ చేంజ్ అంశాలు ఏఐసీసీ భేటీలో ప్రస్తావనకు వచ్చాయని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేలా కొత్త కార్యవర్గానికి జనవరి 2, 3 తేదీల్లో శిక్షణా తరగ తులు నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. యాత్రల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై కార్య వర్గానికి దిశానిర్దేశం చేస్తామన్నారు. ఐఏసీసీ భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ యాత్రల ద్వారా తెలంగాణలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైన కేసీఆర్ తీరును, దేశ రక్షణ విషయంలో ప్రధాని మోదీ విధానాలను ఎండగడతామని స్పష్టం చేశారు. కరోనా పేరు చెప్పి రాహుల్ భారత్ జోడో యాత్రను ఆపాలని చూడటంపై రేవంత్ ఆగ్ర హం వ్యక్తం చే శారు. యాత్ర విజయవంతాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడు తున్నా రని ఎద్దేవా చేశారు. రాహుల్ యాత్రకు సంఘీభావంగా కాంగ్రెస్ ఎంపీలు అందరం శనివారం యాత్రలో పాల్గొంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment