తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను రీకాల్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను రీకాల్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయమై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. గాంధీభవన్‌లో శనివారం టీ కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. వ్యవసాయ సమస్యలపై కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్న అంశంపై నేతలు చర్చించారు.
ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు. అనావృష్టి, అతివృష్టి వల్ల జరిగిన పంట నష్టం వివరాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వాన్ని సమర్పించాలని, ఇటీవలి వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు త్వరలో ఓ యాత్ర చేపట్టాలని నిశ్చయించారు. టీపీసీసీ కార్యాలయం కోసం భూమి కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు.