సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్న వేళ మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ముఖ్య నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఓబీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సీత బాబుయాదవ్, ఆయనతోపాటు జిల్లా కార్యదర్శులు ఎల్ లవకుమార్, రోహిత్ నాయుడు, ప్రవీణ్ కుమార్, రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ ముజీబ్‌లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు సరైన గుర్తింపు లేకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేశామని అన్నారు. తమ రాజీనామాలను ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment