'కేసీఆర్ దొరకని దొంగ' | t congress blames kcr | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ దొరకని దొంగ'

Published Thu, Jun 18 2015 3:22 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

'కేసీఆర్ దొరకని దొంగ' - Sakshi

'కేసీఆర్ దొరకని దొంగ'

హైదరాబాద్:ఓటుకు నోటు వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ అయితే... తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ దొరకని దొంగని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క  విమర్శించారు. చంద్రబాబు, కేసీఆర్ రాజకీయ తప్పిదాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని భట్టి స్పష్టం చేశారు.

 

కోట్లు రూపాయిలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసు ఎందుకు నత్తనడకన సాగుతుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బీజేపీ ఎందుకు మీన మేషాలు లెక్కిస్తోందన్నారు. లక్ష రూపాయలు తీసుకున్నందుకే బీజేపీ సీనియర్ నేత బంగారు లక్ష్మణ్ వేసిన అధిష్టానం.. రూ. 5కోట్ల ఎపిసోడ్ లో చంద్రబాబును ఎందుకు సమర్ధిస్తుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సెక్షన్ -8 ను తెరపైకి తెస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement