బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ లౌకికత్వం గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ , మజ్లిస్ పార్టీల కలయికలో హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డంగా మారింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. మరో వైపు కేంద్రం తెలంగాణకు రూ. 10 వేల కోట్లు నిధులిచ్చినా విమర్శించడం తగదన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం పత్తికి బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.