సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తు ప్రారంభించాయి.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కీలక దశకు చేరుకుంది. నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ క్రమంలో తెలంగాణలో రానున్న ఎన్నికల కోసం పోటీచేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయనుంది. అలాగే, రాష్ట్రంలో ఒకరికి మించి పోటీలేని స్థానాల్లో అభ్యర్థులను ఈ కమిటీ ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. అయితే, దాదాపు 30 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి లిస్టును కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. సీఈసీకి పంపనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇటీవలే హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం విజయవంతంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరలో తెలంగాణ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరు గ్యారంటీలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది.
ఇది కూడా చదవండి: జనగణన లేకుండా బిల్లు పెట్టి ఏం చేస్తారు?
Comments
Please login to add a commentAdd a comment