ఢిల్లీ: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ 70 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసింది. మిగిలిన సీట్లలో అభ్యర్థుల ఎంపిక కోసం నేడు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించింది.
30 సీట్లలో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఆ 30 నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలపై కాంగ్రెస్ పార్టీ ఫ్లాష్ సర్వే నిర్వహించింది. సర్వే రిపోర్ట్ ఆధారంగా అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేయనుంది. నేడు మరిన్ని సీట్లలో అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ వార్ రూమ్ ఎదుట కాంగ్రెస్ టికెట్ ఆశావహులు ధర్నా నిర్వహించారు. ఓయూ విద్యార్థులకు టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలని నినాదాలు చేశారు. ధర్నాలో కురువ విజయ్, మానవతారాయ్, కేతురి వెంకటేష్ , పున్న కైలాష్ తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థుల పోటీ ఒకరికి మించి ఉన్న నియోజకవర్గాలు
జనగామ: కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య
తుంగతుర్తి: డాక్టర్ రవి, పిడమర్తి రవి
సత్తుపల్లి: సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్
గద్వాల: సరిత, కురువ విజయ్
మునుగోడు: కృష్ణా రెడ్డి, పున్న కైలాష్ నేత, స్రవంతి రెడ్డి
రామగుండం: హర్కార వేణుగోపాల్, రాజ్ ఠాకూర్
వనపర్తి: మేఘారెడ్డి, చిన్నారెడ్డి
దేవరకద్ర: కొత్తకోట సిద్దార్థరెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి
హుజూరాబాద్: బల్మూరు వెంకట్, వడితెల ప్రణవ్
సూర్యాపేట: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి
మక్తల్: పర్ణికారెడ్డి, శ్రీహరి ముదిరాజ్
ఖైరతాబాద్: విజయారెడ్డి, రోహిన్‌రెడ్డి
హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్, మరో నేత
కరీంనగర్: జైపాల్‌రెడ్డి, పురుమళ్ల శ్రీనివాస్, కె. నరేందర్‌రెడ్డి
చొప్పదండి: మేడిపల్లి సత్యం, సత్తు మల్లేశం
దుబ్బాక: చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, కత్తి కార్తీక
నర్సాపూర్: ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్ కుమార్
స్టేషన్ ఘన్‌పూర్: సింగాపురం ఇందిర, మరో నేత
కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు, డాక్టర్ కేతూరి వెంకటేష్
మహబూబాబాద్: బలరాం నాయక్, మురళీ నాయక్
డోర్నకల్: రామచంద్రనాయక్, నెహ్రూ నాయక్,
వరంగల్ వెస్ట్: నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి
పరకాల: కొండా మురళి, ఇనగాల వెంకట్రామిరెడ్డి
జూబ్లీహిల్స్: అజరుద్దీన్, విష్ణు
కూకట్‌పల్లి: సతీష్, మురళి, గొట్టిముక్కల వెంగళ్‌రావు
దేవరకొండ: బాలు నాయక్, ప్రవళిక కిషన్ నాయక్
ఇదీ చదవండి: TS Election 2023: పరిగి బరిలో శైలేందర్‌రెడ్డి?
Comments
Please login to add a commentAdd a comment