ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీల ఏర్పాటు
సభ్యులుగా ముగ్గురు స్వచ్ఛంద సేవకులు
తెలుగు తమ్ముళ్లకు లబ్ధి చేకూరేలా పథకం!
కార్పొరేషన్ల డీడీల నుంచి అందిన ఆదేశాలు
జిల్లాలో నేటి నుంచి ఇంటర్వ్యూలు
పలమనేరు : రుణాల మంజూరులోనూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, సానుభూతి పరులకే పెద్దపీట వేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఎత్తు వేసింది. ఎస్‌సీ, ఎస్‌టీల్లో నిరుద్యోగులకు ఉపాధి, రైతులకు వ్యవసాయ బోర్లు, మోటార్ల మంజూరుకు అర్హుల ఎంపికలో కూడా ప్రభుత్వం పింఛన్ల కమిటీల తరహా బాటలో సాగుతోంది. అధికారులతో పాటు ముగ్గురు సోషియల్ వర్కర్లతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం 101 జీవోను విడుదల చేసింది. నేటి నుంచి మండల, మున్సిపాలిటీల పరిధిలో రుణాల మంజూరుకు అర్హులను గుర్తించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే ఎస్సీ,ఎస్టీ రుణాల్లోనూ తెలుగు తమ్ముళ్లకే లబ్ధి చేకూరేలా ఎత్తులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
స్క్రీనింగ్ కమిటీలే కీలకం
జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులను రుణాలకు ఎంపిక చేయడంలో స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం చెల్లుబాటయ్యేలా ఆదేశాలిచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నుంచి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా స్క్రీనింగ్ కమిటీ మెంబర్ల జాబితా అధికారులకు అందింది. ఒక్కో మండలానికి ముగ్గురు సోషియల్ వర్కర్ల పేరిట అధికారిక జాబితా పంపారు. వీరితో సంబంధిత అధికారులు ఇంటర్వ్యూ తేదీకి ముందు రోజే సమావేశాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల జాబితాను అందజేయడం ద్వారా వారు సూచించిన పేర్లనే ఖరారు చేసేలా ఈ తతంగం జరిగేలా ఉంది. అయితే ఉత్తర్వుల్లో మాత్రం దరఖాస్తుదారుల ఎంపిక ప్రక్రియపై నియమ నిబంధనలను వివరించాలని సూచించారు. ఇంటర్వ్యూలు జరిగే రోజు బ్యాంక ర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రయివేటు వ్యక్తుల జోక్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు కమిటీలతో అర్హులను కూడా అనర్హులుగా మార్చడం ద్వారా అన్యాయం చేసిన ప్రభుత్వం మళ్లీ అదే బాటలో సాగుతోంది.
నేటి నుంచి ఎస్సీ, ఎస్టీ రుణాలకు ఇంటర్వ్యూలు
ఈ నెల 6వ తేదీ: పలమనేరు, కుప్పం, పుంగనూరు, చం ద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లోని 16 మండలాలు
8వ తేదీ: మదనపల్లె, వాయల్పాడు, తంబళ్లపల్లె, పీలేరు, చంద్రగిరి నియోజకవర్గాల్లోని 22 మండలాలు
9వ తేదీ: శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి నియోజకవర్గాల్లోని 18 మండలాలు
10వ తేదీ: చిత్తూరు, పూతలపట్టు, తిరుపతి, చంద్రగిరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోని 17 మండలాల్లోని ఎస్‌సీ, ఎస్‌టీ దరఖాస్తుదారులైన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
రైతులకు తిప్పలే..!
కొత్త నిబంధనలతో ఎస్సీ, ఎస్టీలకు రుణాలు పూర్తిస్థాయిలో దరఖాస్తుదారులకు అందే పరిస్థితి కనిపించ డం లేదు. మైనర్ ఇరిగేషన్ పథకంలో బోరు, మోటారు తీసుకోవాలంటే ఏపీ ట్రాన్స్‌కో ఇచ్చిన ధ్రువపత్రంలో సర్వీ సు మూడు స్తంభాల దూరంలోనే ఉండాలి, భూగర్భ జలశాఖ జియాలజిస్ట్ ద్వారా ఫిజుబులిటీ కలిగి ఉండా లి. డార్క్ ఏరియా లేకుండా వాల్టా చట్టం ప్రకారం అనుమతులు కలిగిన ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. ఇక ఇప్పటికే బోర్లు వేసుకుని మోటార్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆ బోరులో నీళ్లు పుష్కలంగా ఉన్నట్లు ట్రాన్స్‌కో నిర్థారించిన ధ్రువపత్రం అందజే యాలి. ఇవన్నీ సంబంధిత శాఖల నుంచి తీసుకోవాలంటే పుణ్యకాలం దాటిపోవడం ఖాయం. శనివా రం నుంచి నాలుగు రోజుల్లో ముగిసే ఇంటర్వ్యూలకు ఈ ధ్రువపత్రాలను తీసుకెళ్లడం అంత సులభమైన పనికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోది. ఏదేమైనా ఎస్సీ, ఎస్టీల రుణాల్లోనూ కోతలు పెట్టి, రుణాలు అస్మదీయులకు పరిమితం చేసే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
పసుపు రుణ కమిటీలు
Published Sat, Dec 6 2014 2:53 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement