Lending
-
‘ప్రాధాన్యతా’ రుణాల విధానాల్లో సంస్కరణలు అవసరం
ప్రాధాన్యతా రంగాల రుణాలకు (పీఎస్ఎల్) సంబంధించిన విధానాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, పర్యావరణహిత ప్రాజెక్టులు, ఆరోగ్య సంరక్షణ, వినూత్న ఉత్పత్తుల తయారీ వంటి వర్ధమాన రంగాలు, అత్యధికంగా ప్రభావం చూపగలిగే పరిశ్రమలను కూడా ఈ విభాగంలో చేర్చాలని ప్రతిపాదించింది.ఇందుకోసం కొత్తగా డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ల (డీఎఫ్ఐ) ఏర్పాటు చేసే అంశంపై దృష్టి పెట్టేందుకు అత్యున్నత స్థాయి కమిటీని వేసే అవకాశాలను పరిశీలించాలని సీఐఐ పేర్కొంది. ఇప్పటికే నిర్దిష్ట రంగాల అవసరాలను ప్రస్తుతం ఉన్న సిడ్బీ, నాబ్‌ఫిడ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్) మొదలైనవి తీరుస్తున్నాయని సీఐఐ వివరించింది. పీఎస్ఎల్ విధానం విజయవంతమైనప్పటికీ.. అది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా దానికి తగు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఇదీ చదవండి: 36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’ఉదాహరణకు స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 30 శాతం పైగా ఉన్నప్పుడు పీఎస్ఎల్ కేటాయింపు 18 శాతంగా ఉండేదని.. ప్రస్తుతం సాగు రంగం వాటా 14 శాతానికి తగ్గిపోయినప్పుడు కూడా అదే తీరు కొనసాగుతోందని సీఐఐ పేర్కొంది. ఆర్థిక వృద్ధికి భారీగా తోడ్పడగలిగే సత్తా ఉన్నప్పటికీ మౌలిక రంగం, వినూత్న ఉత్పత్తుల తయారీకి పీఎస్ఎల్ పరంగా తగినంత ప్రాధాన్యం లభించడం లేదని వివరించింది. ఈ నేపథ్యంలో కొత్త పరిస్థితులు, జీడీపీలో నిర్దిష్ట రంగాల వాటా, వాటి వృద్ధి అవకాశాల ఆధారంగా పీఎస్ఎల్ విధానాన్ని ప్రతి 3–4 సంవత్సరాలకు ఒకసారి సవరించాలని సీఐఐ తెలిపింది. -
డిజిటల్ లెండింగ్ హవా
ముంబై: ఈ దశాబ్దంలో డిజిటల్ లెండింగ్ దూసుకుపోతుందని, ఫిన్‌టెక్ సంస్థలు ఈ సేవలను మరింతగా వినియోగదారుల చెంతకు తీసుకెళతాయని క్రెడిట్ సమాచార సంస్థ ఎక్స్పీరియన్స్ తెలిపింది. 2030 నాటికి అన్సెక్యూర్డ్ రుణాల్లో సంప్రదాయ రుణవితరణతో పోలిస్తే డిజిటల్ రుణాలదే పైచేయి అవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అన్సెక్యూర్డ్ చిన్న సైజు రుణాలతోపాటు, సెక్యూర్డ్ అధిక సైజు రుణాల్లో డిజిటల్ లెండింగ్ మరింత విస్తరిస్తుందని పేర్కొంది. ‘‘సంప్రదాయ రుణదాతలు సాధారణంగా ఆస్తుల తనఖాపై రుణాల్లో (సెక్యూర్డ్) అధిక వాటా కలిగి ఉంటారు. డిజిటైజేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ విభాగంలోకి సైతం ఫిన్‌టెక్ సంస్థలు చొచ్చుకుపోతాయి. దీంతో అవి చెప్పుకోతగ్గ మార్కెట్ వాటాను సొంతం చేసుకోగలవు’’అని ఎక్స్పీరియన్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇండియా ఎండీ సాయికృష్ణన్ శ్రీనివాసన్ తెలిపారు. డిజిటల్‌గా సౌకర్యవంతమైన అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తున్నప్పటికీ డిజిటల్ లెండింగ్ సంస్థలకు తదుపరి దశ వృద్ధి అన్నది సవాలుగా ఈ నివేదిక పేర్కొంది. డిజిటల్ లెండింగ్ విభాగంలో బడా టెక్నాలజీ సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది. రికవరీ ఏజెంట్లపై ముందే చెప్పాలి: ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ సంస్థలు (డిజిటల్ వేదికల రూపంలో రుణాలిచ్చేవి) కస్టమర్లకు రికవరీ ఏజెంట్ల వివరాలను ముందే వెల్లడించాలని ఆర్బీఐ ఆదేశించింది. ‘‘ఏదైనా రుణం చెల్లింపుల్లేకుండా ఆగిపోతే, ఆ రుణం వసూలుకు ఏజెంట్‌ను నియమించినట్టయితే.. సంబంధిత ఏజెంట్ పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను కస్టమర్‌కు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలో తెలియజేయాలి’’అని తాజా ఆదేశాల్లో ఆర్బీఐ పేర్కొంది. డిజిటల్ లెండింగ్, రుణాల రికవరీకి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ గతేడాది చివర్లో కఠినతరం చేయడం తెలిసిందే. -
యాంబిట్ ఫిన్‌వెస్ట్‌తో సిడ్బీ కో లెండింగ్ ఒప్పందం
హైదరాబాద్: చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) యాంబిట్ ఫిన్వెస్ట్ అనే ఎన్‌బీఎఫ్‌సీతో కో లెండింగ్ ఒప్పందం చేసుకుంది. సిడ్బీకి ఇది తొలి సహ లెండింగ్ ఒప్పందం. ఇరు సంస్థలు కలసి సంయుక్తంగా ఎంఎస్ఎంఈలకు అన్సెక్యూర్డ్ వ్యాపార రుణాలను అందివ్వనున్నాయి. సిడ్బీ వృద్ధి వ్యూహంలో ఎన్బీఎఫ్సీలు ముఖ్య వాహకమని సిడ్బీ సీఎండీ శివసుబ్రమణియన్ రామన్ పేర్కొన్నారు. రుణ సదుపాయం అంతంగా అందుబాటులో లేని ప్రాంతాలకు సైతం ఎన్బీఎఫ్సీలు చేరుకోగలవన్నారు. తమ తొలి కోలెండింగ్ ఒప్పందాన్ని యాంబిట్ ఫిన్‌వెస్ట్‌తో చేసుకోవడం పట్ల సంతోషంగా ఉందని, ఎంఎస్ఎంఈలకు సరసమైన రేట్లపై వ్యాపార రుణాలు అందించడానికి ఇది సాయపడుతుందన్నారు. చదవండి: ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు.. ఆదాయం, లాభాలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా? -
ఆర్థికమంత్రితో ఐఎఫ్‌సీ ఎండీ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సోమవారం అంతర్జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మఖ్తర్ డియోప్ భేటీ అయ్యారు. భారత్‌లో రుణ అవకాశాల విస్తృతిపై వారు ఇరువురూ చర్చించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రపంచబ్యాంక్‌కు ప్రైవేటు రంగ ఫండింగ్ అనుబంధ విభాగంగా ఐఎఫ్‌సీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్ ప్రకారం, భారత్‌లో ఐఎఫ్‌సీ రుణాన్ని వచ్చే ఒకటి రెండేళ్లలో 2 నుంచి 2.5 బిలియన్ డాలర్ల మేర పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థికమంత్రి భావిస్తున్నారు. మూడు, నాలుగు సంవత్సరాల్లో ఈ పరిమాణం 3 నుంచి 3.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. భారత్‌లో పెట్టుబడులకు ప్రత్యేకించి సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమకు (ఎంఎస్ఎంఈ) రుణ సౌలభ్యతను పెంచాలని ఐఎఫ్‌సీ భావిస్తోంది. తయారీ రంగం కేంద్రంగా ఎదగాలన్న భారత్ లక్ష్యాలని చేయూతను ఇవ్వాలన్న ఆకాంక్షను ఐఎఫ్‌సీ ఎండీ వ్యక్తం చేస్తున్నారు. సుస్థిర వృద్ధి కోసం గ్రామీణ రంగంలో ఫైనాన్సింగ్‌ను పరిశీలించడం, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలను సమీకరించడం, వారి ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరడం వంటి లక్ష్యాలను సైతం ఆయన ఉద్ఘాటించారు. -
నచ్చినోళ్లకు రుణం... బ్యాంకింగ్‌కు భారం
న్యూఢిల్లీ: క్రోనీ రుణ మంజూరీలకు దూరంగా ఉండాలని, అధిక నాణ్యత రుణ మంజూరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం ఫైనాన్షియల్ సంస్థలకు మంగళవారం పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి సంబంధించి విలువైన ఆస్తుల సృష్టికి అధిక నాణ్యతతో కూడిన రుణాలు దోహదపడతాయని అన్నారు. తద్వారానే దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా నడిపించవచ్చని సూచించారు. నచ్చిన వాళ్లకు లేదా రాజకీయ నాయకుల ప్రభావానికి గురై ఇతర ఎటువంటి అంశాలనూ పరిశీలనలోకి తీసుకోకుండా మంజూరు చేసే రుణాలను ‘క్రోనీ లెండింగ్’గా పరిగణిస్తారు. ఇండస్ట్రీ చాంబర్ ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ►నాణ్యత లేని పేలవ రుణ మంజూరీ సమస్యను 1990 నుంచీ భారత్ బ్యాంకింగ్ ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి బడా రుణాల విషయంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంటోంది. రుణాలను సకాలంలో తీర్చుతున్న (క్రెడిట్ వర్తీనెస్) వారికి రుణ మంజూరీలు సజావుగా లేవు. అదే సమయంలో క్రోనీ క్యాపిటలిస్టుల విషయంలో రుణ మంజూరీలు సునాయాసంగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్‌లో మొండిబకాయిలు పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. ►క్రెడిట్‌వర్తీ లేని ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయడం అంటే, క్రెడివర్తీ కలిగిన రుణ గ్రహీత రుణం పొందడంలో ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే భావించాల్సి ఉంటుంది. ►వృద్ధి బాటలో మూలధనాన్ని తగిన రుణ గ్రహీతకు అందజేయడం ఫైనాన్షియల్ రంగం విధి. ►మౌలిక రంగంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితలు కూడా బ్యాంకింగ్ మొండిబకాయిలు పెరిగిపోవడానికి కారణం. అధిక నాణ్యతతో కూడిన రుణాల మంజూరీల విషయంలో ఫైనాన్షియల్ రంగం బాధ్యతా ఉంది. ప్రత్యేకించి మౌలిక రంగంలో రుణాల విషయంలో ‘క్రోనీ’ లెండింగ్‌కు ఎంతమాత్రం స్థానం ఉండకూడదు. ఫైనాన్షియల్ రంగ ప్రధాన లక్ష్యంలో ఈ అంశం ఉండాలి. ►ఫైనాన్షియల్ రంగంలో కార్పొరేట్ పాలనా విధానం కూడా మెరుగుపడాలి. ఇది అధిక నాణ్యత కలిగిన రుణ మంజూరీలకు దోహదపడుతుంది. సీనియర్ మేనేజ్మెంట్కు ప్రోత్సాహకాలకు రుణ నాణ్యత ప్రాతిపదికగా ఉండాలి. దివాలా చట్రంలో 4000 కంపెనీలు: సాహూ కార్యక్రమంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఎస్ సాహూ మాట్లాడుతూ, దివాలా చట్రంలో ప్రస్తుతం 4,000 కంపెనీలు ఉన్నాయన్నారు. ఇందులో 2,000 కంపెనీలకు సంబంధించి దివాల ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీల విలువ లిక్విడేషన్ కన్నా అధికంగా ఉందనీ తెలిపారు. కొన్ని కంపెనీల విషయంలో విలువలు లిక్విడేషన్ వ్యాలూకన్నా 300 శాతం వరకూ అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. -
రుణ అర్హతలను పెంచుకోండిలా..
మీరు తీసుకున్న రుణమే మీ అర్హతలను నిర్దేశిస్తుంది. భవిష్యత్తులో మీకు అవసరం ఏర్పడితే రుణదాతలు క్యూ కట్టి ‘బాబ్బాబు మేము ఇస్తాం’ అనే విధంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నేటి రోజుల్లో రుణం లభించడం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఎందుకంటే ఓ వ్యక్తి రుణ చరిత్ర అంతా క్రెడిట్ బ్యూరోల రికార్డుల్లో వివరంగా నమోదవుతుంటుంది. రుణాల మంజూరుకు ముందు బ్యాంకు అయినా ఎన్బీఎఫ్సీ అయినా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరును కచ్చితంగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు మీ రుణ అర్హతను నిర్ణయించడమే కాదు.. ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలనే విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే.. మీకు అంత ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు, కోరుకున్నంత రుణం లభిస్తుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మీ రుణ దరఖాస్తు స్వీకరణ లేదా తిరస్కరణ అనేది మీ క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? మీ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలన్నది ఓసారి చూద్దాం. ఎలా లెక్కిస్తారంటే... రుణ గ్రహీతల విశ్వసనీయతను.. చెల్లింపుల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాల్లో క్రెడిట్ స్కోర్ ఒకటి. దరఖాస్తుదారుల రుణ అర్హతను అంచనా వేయడానికి, రుణ మొత్తాన్ని నిర్ణయించడానికి బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంటాయి. దీనికితోడు, ఇతర సమాచారం ఆధారంగా రుణాలకు అర్హులా, కాదా? అన్నది నిర్ణయిస్తారు. వడ్డీ రేటుకూ ఇదే ప్రామాణికం అవుతుంది. రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల సమాచారాన్ని రుణ గ్రహీతల పాన్ నంబర్ ఆధారంగా.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) క్రమం తప్పకుండా నిర్ణీత కాలానికోసారి క్రెడిట్ బ్యూరో సంస్థలకు (సిబిల్ తదితర) అందిస్తుంటాయి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తుంటాయి బ్యూరోలు. సాధారణంగా గత 36 నెలల రుణ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. చెల్లింపుల తీరు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మిశ్రమం ఎలా ఉంది, రుణాల కోసం విచారణలు, రుణాల వినియోగం.. ఈ నాలుగు అంశాలు మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆల్గోరిథమ్‌ల సాయంతో.. రుణ చరిత్రతోపాటు వినియోగదారుల దీర్ఘకాలిక ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ (చెల్లించాల్సిన బకాయిలు), క్రెడిట్ కార్డ్‌ల లావాదేవీల చరిత్ర, కొత్త ఖాతాల ప్రారంభం లేదా తొలగింపులు, తిరిగి చెల్లింపుల నిష్పత్తి వంటివి కూడా క్రెడిట్ బ్యూరోలకు ప్రామాణికంగా మారాయి. సాధారణంగా.. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది. రుణదాతలకు వ్యక్తిగత రుణాలు లభించాలంటే.. కనీస సిబిల్ స్కోర్ 720 నుంచి 750 మధ్య అయినా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణాన్ని అధిక మొత్తంలో పొందే అర్హత ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే రుణం కూడా తక్కువే వస్తుంది. స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలంటే.. రుణ వాయిదాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. గృహ, వాహన రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ రుణాలు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటాయి. సెక్యూర్డ్ రుణాల్లో రుణదాత విఫలమైనా, రుణమిచ్చిన సంస్థలకు రిస్క్ పెద్దగా ఉండదు. ఎందుకంటే హామీగా ఆస్తులు ఉంటాయి. వాటిని విక్రయించి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణాలను ఎగ్గొడితే.. వసూలు చేసుకోవడం రుణమిచ్చిన సంస్థలకు తలనొప్పిగా పరిణమిస్తుంది. అందుకే రుణదాతలు అన్సెక్యూర్డ్స్ రుణాలు, వాటిని తిరిగి ఏ విధంగా చెల్లిస్తున్నారన్న చరిత్ర గురించి లోతైన విశ్లేషణ చేస్తుంటారు. మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించేవి కూడా ఈ అన్సెక్యూర్డ్ రుణాలే. ముఖ్యంగా..జాయింట్ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్న వారికి హామీ ఇవ్వటంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఆయా ఖాతా చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులెదురైనా ఆ బాధ్యత జాయింట్ ఖాతాదారులైన మీ మీద కూడా పడుతుంది. అంతిమంగా దీని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద కూడా ఉంటుంది. వ్యక్తిగత రుణం, క్రెడిట్‌కార్డు వినియోగం, వాహన రుణం, గృహ రుణం ఇలా రుణ పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉండడం కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్‌కార్డు విషయంలో సకాలంలో చెల్లింపులతోనూ స్కోర్ పెంచుకోవచ్చు. స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు.. క్రెడిట్ బ్యూరో సంస్థలు ఏటా ఒక్కసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇక వివిధ రకాల ఆర్థిక సేవల సంస్థలు సైతం తమ పోర్టళ్ల నుంచి, యాప్స్ నుంచి క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంటాయి. తద్వారా రుణాల ఆఫర్లను అందించొచ్చన్న ప్రయోజనం అందులో దాగుంటుంది. మీకు రుణ అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పాన్ నంబర్ సాయంతో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ నంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మీ గుర్తింపును ధృవీకరించిన అనంతరం క్షణాల్లో ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్‌ను అందుకుంటారు. -
ఆర్బీఐ లోపాలే.. లోన్ యాప్‌లకు లాభాలు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ వ్యవహారాలకు పాల్పడిన చైనా లోన్ యాప్స్ కేసుల దర్యాప్తులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. అవసరార్థులకు రుణాల మంజూరు, వడ్డీ వసూళ్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల్లో ఉన్న లోపాలనే చైనా యాప్స్ తమకు అనుకూలంగా మార్చుకున్నాయని తేల్చారు. వీటికి దేశంలోని వివిధ మెట్రో నగరాలకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) సహకరించినట్లు గుర్తించారు. ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఆర్బీఐ సహా వివిధ సంస్థలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా పోలీసు విభాగం తమ దర్యాప్తులో గుర్తించిన వ్యవస్థాగత లోపాలను వారి దృష్టికి తీసుకెళ్లింది. రాజధానిలోని మూడు కమిషనరేట్లలోనూ నమోదైన కేసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను రూపొందించి ఆర్బీఐకి పంపాలని నిర్ణయించింది. ఒప్పందం చేసుకుని జంప్.. ఇక అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్‌తో పాటు బలవంతపు రివకరీల కోసం కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది చైనాకు చెందిన సంస్థలే అని తేలింది. అయితే రుణాలు ఇవ్వడానికి వినియోగించిన నగదు మాత్రం దేశం బయట నుంచి రాలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా మరికొన్ని మెట్రో నగరాల్లో ఉన్న ఎన్బీఎఫ్సీలతో చైనా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రుణాలు అందించడానికి, తిరిగి వసూలు చేయడానికి అవసరమైన ఫ్లాట్‌ఫామ్స్ (యాప్స్, కాల్ సెంటర్లు) తాము రూపొందిస్తామని, ఆయా కస్టమర్లకు రుణాలు మాత్రం మీరు ఇవ్వాలంటూ చైనా కంపెనీలు ఎన్బీఎఫ్సీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ పత్రాలపై సంతకాలు చేసిన సమయంలో మాత్రమే సూత్రధారులైన చైనీయులు ఎన్బీఎఫ్సీ నిర్వాహకుల్ని కలిశారు. ఆపై వాళ్లు పత్తాలేకుండా పోయి తమ అనుచరుల ద్వారా ఇక్కడి వ్యవహారాలు చక్కబెట్టారు. సర్వీసు చార్జీల కింద కొంత.. వడ్డీ పేరిట అంత! ఇక ఎన్బీఎఫ్సీలు - చైనా కంపెనీలు ఆర్బీఐ నిబంధనల్లో ఉన్న లోపాలను అధ్యయనం చేశాయి. అప్పులపై వసూలు చేసే వడ్డీ ఏడాదికి 36 శాతం దాటకూడదంటూ ఆయా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లలో రుణాలు మంజూరు చేసేప్పుడు ఆయా కంపెనీలు సర్వీస్ చార్జ్ కింద గరిష్టంగా ఎంత మొత్తం వసూలు చేయాలనేది మాత్రం ఆర్బీఐ నిబంధనల్లో ఎక్కడా లేదు. దీన్నే చైనా కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు తమకు కలసి వచ్చే అంశంగా మార్చుకున్నాయి. రూ.5 వేల రుణానికి రూ.1200 చొప్పున సర్వీసు చార్జ్ కింద మినహాయించుకుని రుణగ్రహీతకు రూ.3,800 మాత్రమే చెల్లించాయి. ఈ రుణాన్నీ వారం రోజుల్లో తిరిగి చెల్లించేలా నిబంధన విధించాయి. ఆ సమయంలో వడ్డీగా మాత్రం కేవలం రూ.15 నుంచి రూ.20 మాత్రమే వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తం సరాసరిన చూస్తే ఏడాదికి 25 శాతం లోపే ఉంటోంది. వడ్డీ మొత్తం ఎన్‌బీఎఫ్‌సీలకే వెళ్తున్నప్పటికీ సర్వీస్ చార్జీని మాత్రం వీరిలో పాటు యాప్, కాల్ సెంటర్ల నిర్వాహకులు పంచుకుంటున్నారు. మరోపక్క ఈ లోన్ యాప్స్ లావాదేవీలపై పోలీసులకు ఇప్పటివరకు స్పష్టత రాలేదు. 3 వీటి ద్వారా రుణగ్రస్తులకు నగదు ఇచ్చిన, ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించిన రోజర్‌పే సంస్థ అందించిన వివరాల ప్రకారం ఆయా ఎన్‌బీఎఫ్‌సీల టర్నోవర్ రూ.25 వేల కోట్ల వరకు ఉంది. అయితే ఎన్బీఎఫ్సీలు కేవలం లోన్ యాప్స్ ద్వారా అప్పులు ఇవ్వడమే కాకుండా ఇతర ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అవన్నీ కలుపుకుంటే ఈ మొత్తం వస్తోందని పోలీసులు చెప్తున్నారు. ఇందులో కేవలం రుణ యాప్‌ల ద్వారా మాత్రమే జరిగిన లావాదేవీలు ఎంత అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదని పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ లోన్ యాప్స్‌కు సంబంధించిన వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. ఒకప్పుడు ఇవి ఫోన్లు, సందేశాలు, సోషల్ మీడియా ద్వారా డిఫాల్టర్లను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా చేశాయి. అయితే వీటిపై కేసుల నమోదు, నిందితుల అరెస్టులు, ఎన్‌బీఎఫ్‌సీల బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్ వంటి చర్యల్ని పోలీసులు తీసుకున్నారు. దీంతో ఇటీవల కాలంలో ఎగవేతదారులకు ఫోన్లు చేస్తున్న కాల్ సెంటర్ల వారు చాలా మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం కట్టలేకుంటే సర్వీసు చార్జ్, వడ్డీ మినహాయించి అప్పుగా తీసుకున్న నగదు చెల్లించాలని కోరుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిపై వచ్చే ఫిర్యాదులు లేవని పేర్కొంటున్నారు. రూ.320 కోట్లు ఫ్రీజ్ చేశాం.. లోన్ యాప్స్ కేసులకు సంబంధించి ఇప్పటివరకు చైనా జాతీయుడి సహా 20 మందిని అరెస్టయ్యారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.320 కోట్లు ఫ్రీజ్ చేశాం. గతంలో నమోదైన కలర్ ప్రిడెక్షన్ కేసులో రూ.105 కోట్లు హాంకాంగ్‌లోని బ్యాంకు ఖాతాలకు మళ్లినట్లు గుర్తించాం. ఏదైనా యాప్ వ్యవహారాలపై అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. అక్కడ ఓ బృందం వీటిపైనే 24 గంటలూ పని చేస్తుంటుంది. -- అంజనీకుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ చదవండి: "వికీలీక్స్" వీరుడి కోసం వేట మొదలైంది! తీపి కబురు: దిగొచ్చిన బంగారం ధరలు! -
రుణ వృద్ధి దారుణం..
ముంబై : దేశీ బ్యాంకుల రుణ వితరణ రెండేళ్ల కనిష్ట స్ధాయికి పతనమైందని ఆర్బీఐ వెల్లడించిన తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. సెప్టెంబరు చివరి నాటికి బ్యాంకుల రుణాల వృద్ధి దాదాపు 8.8 శాతానికి తగ్గడం గమనార్హం. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నా ఉత్పతులు, సేవల కొనుగోళ్లు ఊపందుకోలేదు. బ్యాంకుల్లో రుణ వృద్ధి పెరిగేలా, అర్హులకు రుణాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారానే డిమాండ్‌ను పెంచగలమని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. బ్యాంకుల ద్వారా రుణ వితరణను పెంచేలా చొరవ చూపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డిమాండ్, సరఫరా పడిపోవడంతో రుణ వృద్ధి మందగించిందని కేర్ రేటింగ్స్‌లో చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ అభిప్రాయపడ్డారు. రుణ వితరణ పెంచాలని, దేశవ్యాప్తంగా లోన్ మేళాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించినా క్రెడిట్ గ్రోత్ నిరుత్సాహకరంగానే ఉండటం గమనార్హం. ఆర్థిక వృద్ధికి కీలకమైన రిటైల్ రుణాల విషయంలో బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కస్టమర్లలో అత్యధిక డిఫాల్ట్స్ను సాకుగా చూపుతూ బ్యాంకులు రిటైల్ రుణాల జారీలో దూకుడు పెంచడం లేదు. మరోవైపు డిమాండ్ తగ్గుదలతో పాటు మార్కెట్లో లిక్విడిటీ తగినంత లేకపోవడం కూడా రుణాల జారీ ఆశించిన మేర సాగడం లేదని భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించి రుణాలను చౌకగా అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక పండుగ సీజన్లో డిమాండ్ ఊపందుకోవడం ద్వారా రుణ వితరణ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
అనిల్ అంబానీ కీలక నిర్ణయం : రుణ వ్యాపారానికి గుడ్‌బై
సాక్షి, ముంబై: రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రుణ వితరణ వ్యాపారానికి గుడ్ బై చెప్పాలని రిలయన్స్ కేపిటల్ నిర్ణయించినట్టు తెలిపారు. సోమవారం జరిగిన కంపెనీ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ఈ మేరకు ప్రకటించిన అంబానీ రిలయన్స్ క్యాపిటల్ తన రుణ వ్యాపారాలన్నింటిని నుంచి డిసెంబర్ నాటికి నిష్క్రమిస్తుందని చెప్పారు. గత ఆరు నెలల్లో చోటు చేసుకున్న ప్రతికూల సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ మందగించిన ఆర్థిక వ్యవస్థ, ఈ రంగంలో రుణాల సంక్షోభంతో రిలయన్స్ క్యాపిటల్ నష్టాన్ని ఎదుర్కోందని తెలిపారు. రిలయన్స్ క్యాపిటల్ ఇకపై రుణ వ్యాపారంలో ఉండదని నిర్ణయించింది. రుణ వ్యాపారాలు - రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ - డిసెంబరు నాటికి పూర్తవుతాయని భావిస్తున్నామని వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ వాటాదారులకు చెప్పారు. రిలయన్స్ క్యాపిటల్ అప్పు రూ .25 వేల కోట్లు తగ్గుతుందని అంబానీ చెప్పారు. అలాగే ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయడం ఆర్ఇన్ఫ్రాకు కలిసి వస్తుందనీ, రక్షణ రంగంలో మరిన్ని వ్యాపార అవకాశాలు తమకు లభిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశంలో అత్యుత్తమ 5 ప్రైవేటు రక్షణ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని భావిస్తున్నామన్నారు. ఆధునాతన సాంకేతికను అందిపుచ్చుకొని అంతర్జాతీయ సరఫరా సంస్థగా మారతా మన్నారు. రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుతం చిన్న, మధ్యతరహా సంస్థలకు రిలయన్స్ మనీ ద్వారా, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ద్వారా గృహ కొనుగోలుదారులకు రుణాలు ఇస్తుంది. ఈ రెండు వ్యాపారాలు గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయంలో 15 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది కంపెనీ ఆస్తులను డిజిస్ట్మెంట్ చేయనుంది. రిలయన్స్ క్యాపిటల్ తన మ్యూచువల్ ఫండ్ విభాగమయిన రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ (ఆర్‌నామ్)లోని 21.54 శాతం వాటా విక్రయాన్ని పూర్తి చేసినట్లు కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్గ్రూపులో మూతపడనున్న రెండవ పెద్ద వ్యాపారం ఇది. ఇప్పటికే ప్రధానమైన రిలయన్స్ కమ్యూనికేషన్ రెండేళ్ల క్రితం మూత పడి దివాలా ప్రక్రియలో ఉంది. ఇక రక్షణ వ్యాపారం - రిలయన్స్ నావల్ - కూడా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి లోనవుతుంది. -
పీఎన్బీ రుణ రేట్ల కోత
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను స్వల్పంగా తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వడ్డీరేటును 0.10% తగ్గించింది. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.55%నుంచి 8.45%కి తగ్గింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 8.65%కి కుదిం చింది. అయితే, బేస్‌రేటులో ఎటువంటి మార్పులేదని, 9.25% వద్ద ఈ రేటు యథాతథంగా ఉందని వెల్లడించింది. అలహాబాద్ బ్యాంకు కూడా... ప్రభుత్వ రంగ అలాహాబాద్ బ్యాంక్.. కూడా రుణాలపై ఎంసీఎల్ఆర్ను 0.10 శాతం తగ్గించింది. మార్చి 1 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. అన్ని రకాల కాల పరిమితులపై ఈ తాజా తగ్గింపు వర్తిస్తుందని స్పష్టంచేసింది. -
ఈ రంగంలో ప్రముఖ సంస్థలు...చార్జీల వసూలు ఇలా...
పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు ఎన్నో రకాల చార్జీలు వసూలు చేస్తుంటాయి. వాటిని పరిశీలిస్తే... రిజిస్ట్రేషన్ ఫీజు చాలా వరకు సంస్థలు రిజిస్ట్రేషన్ చార్జీ కింద రూ. 100 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నాయి. లోన్ ప్రాసెసింగ్ చార్జీ మంజూరు అయిన రుణం మొత్తంలో 1–10 శాతం మధ్య ఉంటుంది. రిస్క్ గ్రేడ్‌పై ఈ చార్జీ ఆధారపడి ఉంటుంది. అయితే, పలు పీ2పీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ చార్జీ సగటున 2–4 శాతం మధ్య ఉంటుంది. వడ్డీ రేట్లు వడ్డీ రేట్లను రుణదాత, రుణగ్రహీత నిర్ణయిస్తారు. వీరిరువురు చర్చించుకోవడం ద్వారా ఓ రేటును ఖరారు చేసుకోవచ్చు. 14–36 శాతం మధ్య ఇది ఉంటుంది. రుణ కాల వ్యవధి, రుణ గ్రహీత ఆర్థిక, సామాజిక పరిస్థితులపైనా ఆధారపడి ఉంటుంది. ముందస్తు చెల్లింపులపై చార్జీలు మూడు నెలల తర్వాత రుణాన్ని ముందుగా తీర్చివేసినా చార్జీలు ఉండవు. మూడు నెలల్లోపు రుణం మొత్తాన్ని చెల్లించేస్తానంటే చార్జీలు భరించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మూడు నెలల వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. లేట్ పేమెంట్ ఫీజు రుణ ఈఎంఐ చెల్లింపులో జాప్యం జరిగితే చార్జీలు ఉంటాయి. లీగల్ నోటీసు పంపిస్తే రూ.500 వరకు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. చెక్‌బౌన్స్ చార్జీలు రూ.250 వరకు చార్జీ ఉంటుంది. స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ చార్జీలను రుణ గ్రహీతే భరించాలి. ఇతర చార్జీలు బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు చోటు చేసుకుంటే కొన్ని సంస్థలు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈఎంఐ బకాయి ఉన్నా చార్జీ వసూలు చేసేవీ ఉన్నాయి. రూ.200–1,000 వరకు వీటి రూపంలో వసూలు చేస్తున్నాయి. -
ఈ రంగంలో ప్రముఖ సంస్థలు...
మార్కెట్లో ఎన్నో పీ2పీ సంస్థలు ఉన్నాయి. అయితే, వీటిల్లో కొన్ని ప్రముఖమైన పోర్టళ్లు, వాటికి సంబంధించి ముఖ్యమైన అంశాలను గమనించినట్టయితే... ఫెయిర్‌సెంట్ రూ.750 అప్పు కూడా ఈ సంస్థ నుంచి సాధ్యమే. ఉదాహరణకు ఏ అనే ఒక రుణ గ్రహీత రూ.లక్ష రుణాన్ని కోరుకుంటుంటే... రుణం ఇవ్వాలనుకునే వ్యక్తి అయితే ఇందులో 20 శాతం అంటే రూ.20,000 వరకే రుణాన్ని ఇవ్వడానికి అవకాశం. అదే అధిక నెట్‌వర్త్ కలిగిన వారు 50 శాతం వరకు, ఇన్స్టిట్యూషన్స్ అయితే 100 శాతం వరకు రుణాన్ని మంజూరు చేయవచ్చు. తిరిగి రాని, ఏకకాల రిజిస్ట్రేషన్ చార్జ్ కింద రూ.1,000 సమర్పించుకోవాలి. రుణ కాల వ్యవధి ఆరు నెలల నుంచి 36 నెలల వరకు ఉంటుంది. తమకు అనువైన కాల వ్యవధి పరిధిలో ఉన్న రుణ గ్రహీతలను ఎంచుకుని రుణాలు ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. వడ్డీ రేట్లు 12 నుంచి 28 శాతం మధ్య ఉన్నాయి. లెండెన్ క్లబ్ కనీసం రూ.2,000 నుంచి రూ.15,000 వరకు ఒక్కొకరికి రుణాన్ని ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చార్జ్ 500. వడ్డీ రావడం ప్రారంభమైన దగ్గర్నుంచి ఫెసిలిటేషన్ ఫీజు వసూలు చేస్తుంది. కమీషన్ అన్నది పెట్టుబడిపై వచ్చే రాబడిపై 1 శాతం నుంచి 25 శాతం వరకు ఉండొచ్చు. 26–35 శాతం మధ్య రాబడుల రేటు ఉంటే 1.5 శాతం, అంతుకుమించితే 3 శాతం కమీషన్ తీసుకుంటుంది. మూడు నెలల నుంచి 24 నెలల కాలానికి రుణాలు ఇచ్చుకోవచ్చు. రుణాలిచ్చే వారికి సగటు రాబడులు 25.5 శాతంగా ఉన్నాయి. ఐటూఐ ఫండింగ్ రూ.5,000 మొత్తం నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌పై అప్పిచ్చు వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. రుణ కాల వ్యవధి నెల నుంచి 36 నెలల మధ్య ఉంటుంది. అన్ని ïపీ2పీ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ కలిపి గరిష్టంగా రూ.10 లక్షల వరకే ఒకరు రుణాలు ఇచ్చుకోవడానికి పరిమితి ఉంది. 3, 6, 9, 12, 24, 36 నెలల రుణ కాల వ్యవధులు ఉన్నాయి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 వసూలు చేసుకోవచ్చు. ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు కూడా రుణం మంజూరుపై ఉంటుంది. రాబడుల రేటు 27.99 శాతం వరకూ ఉంది. లెండ్‌బాక్స్ రుణ దాతలు కనీసం రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రుణ గ్రహీతలు రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాష్ మేకర్ రూ.20,000 నుంచి రూ.1.5 లక్షల వరకు రుణాలు మంజూరు చేసుకోవచ్చు. రుణ కాలవ్యవధి 3–12 నెలలు. 3 ఈఎంఐలు చెల్లించిన తర్వాత ఎప్పుడైనాసరే ముందస్తుగా రుణం తీర్చేసే అవకాశం రుణగ్రహీతలకు ఉంటుంది. రుణదాతల నుంచి రూ.1,000ను రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తోంది. -
రుణానికి కొత్త రూటు.. పీ2పీ
పీర్ టు పీర్ (పీ2పీ) లెండింగ్‌కు 2018 మంచి ప్రోత్సాహకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పీటూపీ సంస్థలను ఎన్‌బీఎఫ్‌సీలుగా ఆర్బీఐ గుర్తించి, లైసెన్స్‌లను మంజూరు చేసింది గతేడాదే. దీంతో క్రౌడ్ ఫండింగ్ వేదికలకు అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో 2016 నాటికి 30కి పైగా పీ2పీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటిలో 11 సంస్థలకు గతేడాది ఎన్బీఎఫ్సీ–పీ2పీ లైసెన్స్‌లు ఆర్బీఐ నుంచి లభించాయి. వీటిల్లో తొలి లైసెన్స్‌ను పొందిన సంస్థగా ఫెయిర్‌సెంట్ గుర్తుండిపోతుంది. మార్కెట్లో పెద్ద సంస్థ కూడా ఇదే. ఓఎంఎల్పీ2పీ, క్యాష్‌కుమార్, మానెక్సో, ఐటూఐ ఫండింగ్, ఫించీ, పీర్లాండ్, లెండెన్క్లబ్, పైసాదుకాణ్ తదితర సంస్థలు లైసెన్స్‌లు పొందిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. 2018 ఈ రంగానికి పునాది వేసిన సంవత్సరం అయితే, 2019 ప్రోత్సాహకరంగా ఉంటుందని... ఈ ఏడాది పీ2పీ సంస్థలు రూ.1,000–1,500 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయవచ్చని అంచనా. ఎటువంటి క్రెడిట్ స్కోర్ లేకపోయినా రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్న... పీటూపీ సంస్థలపై సమగ్ర కథనమే ఇది... పీర్ టు పీర్ లెండింగ్ అంటే? పీర్ టు పీర్ లెండింగ్‌ను పీ2పీ లెండింగ్‌గా కూడా పిలుస్తారు. ఇది క్రౌడ్ ఫండింగ్ తరహాలో ఉంటుంది. రుణాలు ఆశించే వారు, రుణాలు ఇవ్వాలనుకునే వారు ఎవరి సాయం అవసరం లేకుండా ఈ పీటూపీ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా లావాదేవీలు చేసుకోవచ్చు. సంప్రదాయ విధానంలో రుణాలిచ్చే సంస్థల వద్ద అప్పు పుట్టని వారికి పీటూపీ వేదికలు అనువుగా ఉంటాయి. అధిక వడ్డీ రాబడి ఆశించే వారు పీ2పీ ద్వారా రుణాలు ఇచ్చుకోవచ్చు. పీ2పీ ప్లాట్‌ఫామ్‌లపై రుణాలు కావాలనుకునే వారు, రుణాలు ఇవ్వాలనుకునే వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికంటే ముందు అన్ని నియమ, నిబంధనలు, రిస్క్ వివరాలను తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని పీ2పీ ప్లాట్‌ఫామ్‌లను ఆర్బీఐ ఎన్బీఎఫ్సీ సంస్థలుగా ప్రస్తుతం పరిగణిస్తోంది. కనుక వీటిపై ఆర్బీఐ నియంత్రణ ఉంటుంది. రుణదాతలు అయితే... పీ2పీ ప్లాట్‌ఫామ్ ద్వారా రుణాలు ఇచ్చి మంచి ఆదాయం గడిద్దామనుకునే వారు ముందు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. గుర్తింపు పొందిన పీటుపీ ప్లాట్‌ఫామ్‌లు కచ్చితమైన మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. సమాచార భద్రత, సమాచార వెల్లడి, రుణ గ్రహీత సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలకు ఇవ్వడం, అలాగే, పలు అంశాలకు సంబంధించి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆన్లైన్ ప్రపంచంలో ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు పీ2పీ సేవలను ఆఫర్ చేస్తుంటే, వీటిలో ఎన్బీఎఫ్సీ–పీటూపీగా ఆర్బీఐ వద్ద పేర్లను నమోదు చేసుకున్నవి కొన్నే. ‘‘సంబంధిత ప్లాట్‌ఫామ్‌పై రుణాల పరిమాణం?, ఎంత మంది రుణ గ్రహీతలు పేర్లను నమోదు చేసుకున్నారు, రుణాలు మంజూరు వంటివి కంపెనీ ప్రణాళికలు. వ్యాల్యూమ్ తక్కువగా ఉంటే, దీర్ఘకాలం పాటు రుణ గ్రహీత లభించకపోవచ్చు. పీ2పీ లెండింగ్ కంపెనీ నుంచి ఈ వివరాలే తెలుసుకోవాలి’’ అని ఐటూఐ ఫండింగ్ సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. రుణ ఎగవేతల శాతం ఏ విధంగా ఉందని, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగితే, లేదా ఎగవేస్తే ఏంటి పరిస్థితి? అన్న వాటిపైనా దృష్టిపెట్టాలి. ప్రతీ పీ2పీ సంస్థ పారదర్శకతలో భాగంగా పోర్ట్‌ఫోలియో పనితీరు సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, చాలా సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌పై రుణ ఎగవేతలు ఏ స్థాయిలో ఉందన్న సమగ్ర వివరాలను బహిర్గతం చేయడం లేదు. అయితే, సంబంధిత ప్లాట్‌ఫామ్ ద్వారా రుణాలు ఇవ్వాలనుకునే వారు ఈ వివరాలను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యతను విస్తరించొద్దు. రుణ చెల్లింపుల్లో జాప్యం, ఎగవేతల పట్ల సంబంధిత పోర్టల్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఎలా రికవరీ చేస్తుందనేది కీలకం. అలాగే చట్టపరమైన ప్రక్రియల గురించి కూడా తెలుసుకోవాలి. రాబడులు ఏ మేర... రుణగ్రహీతల అర్హతలపై రుణాలిచ్చే వారి రాబడులు ఆధారపడి ఉంటాయి. భిన్న రిస్క్ కేటగిరీల గురించి ముందు తెలుసుకోవాలి. అప్పుడు రాబడులపై స్పష్టత వస్తుంది. అధిక సగటు రాబడులు వస్తున్నాయంటే అదే స్థాయిలో రిస్కూ ఉంటుందని తెలుసుకోవాలి. కనుక భిన్న విభాగాల్లో రుణాలు ఇవ్వడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. రుణ గ్రహీత పేరు, ఇతర సమాచారాన్ని పీటూపీ ప్లాట్‌ఫామ్ వెల్లడించకపోవచ్చు. అయితే, రుణం ఇచ్చేవారిగా తీసుకునే వారి వివరాలను అడిగి తెలుసుకునే హక్కు ఉంటుంది. అందుకని వెబ్సైట్లో వెల్లడించకపోయినా అడిగి తెలుసుకోవాలి. రుణ గ్రహీతలు అయితే... ఇతర మార్గాలలో రుణాలు లభించని వారు సహజంగానే పీ2పీ ప్లాట్‌ఫామ్‌లవైపు చూడొచ్చు. ఈ తరహా వ్యక్తులు పీ2పీ ప్లాట్‌ఫామ్ వేదికలపై తమ పేర్లు, ఇతర వివరాలతో నమోదు చేసుకుని, రుణాలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ముందుగా మీరు పేరు నమోదు చేసుకుంటున్న సంస్థకు ఆర్బీఐ అనుమతి ఉందా? అని. చాలా సంస్థలు వేగంగా రుణ సదుపాయం కల్పిస్తున్నప్పటికీ ఆర్బీఐ వద్ద తమ పేర్లను నమోదు ఎన్బీఎఫ్సీ–పీటూపీ రిజిస్ట్రేషన్ పొంది వ్యాపారం చేస్తున్నవి కొన్నే. ఆర్బీఐ గుర్తింపు ఉన్నవి మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థల ద్వారా లావాదేవీలు నిర్వహించడం ఒకింత నయం. అదనపు ఫీజులు, కనిపించని చార్జీల గురించి కూడా వాకబు చేయాలి. మొత్తం వడ్డీకి అదనంగా ఏవైనా చార్జీలు వసూలు చేసేదీ, లేదా తాము పొందే రుణంలో ఏమైనా కత్తిరింపు ఉందా అని విచారించాలి. రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజులు సహజంగానే ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేద్దామనుకుంటే చార్జీల విధింపు ఉందా అని చూడాలి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఒక ఈఎంఐని 90 రోజుల్లోపు చెల్లించడంలో విఫలమైతే అది చెల్లింపుల వైఫ్యలంగా పరిగణించడం జరుగుతుంది. ఈ గడువు కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో భిన్నంగా ఉంది. సకాలంలో రుణం లభించడం ఎంతో అవసరం. అప్పుడే అవసరాలకు ఉపయోగపడుతుంది. అందుకే మీరు ఆశ్రయించే ప్లాట్‌ఫామ్‌పై ఎంత వేగంగా రుణాల మంజూరు ఉందనేది తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఒక్కో కంపెనీకి ఇది వేర్వేరుగా ఉంటుంది. అప్పు ఎగ్గొడితే...? పీ2పీ లెండింగ్ సంస్థల ద్వారా ఎవరైనా రుణాలను ఇతరులకు ఆఫర్ చేయడం ద్వారా వడ్డీ ఆదాయం అందుకోవచ్చు. రెండంకెల రాబడులంటే సహజంగానే ఆసక్తి ఉంటుంది. మరి రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఏంటి పరిస్థితి? వీరి విషయంలో పీ2పీ సంస్థలు ఏ విధంగా వ్యవహరిస్తాయి? అన్న సందేహాలు ఉంటుంటాయి. అయితే, ఈ విషయంలో పీ2పీ సంస్థలు ఎన్బీఎఫ్సీ సంస్థల మాదిరే చురుగ్గానే వ్యవహరిస్తున్నాయి. రుణాలు తీసుకునే వారికి సంబంధించిన సమాచారాన్ని భిన్న మార్గాల్లో సేకరిస్తుంటాయి. ‘‘నిజమైన కస్టమర్లకే రుణాలు అందించాలి. కస్టమర్ ఉద్దేశాన్ని తెలుసుకుని, దరఖాస్తులను ప్రాసెస్ చేసే విషయంలో ప్రత్యామ్నాయ సమాచారం ఉపయోగపడుతుంది’’ అని క్యాష్‌కుమార్ సహ వ్యవస్థాపకుడు ధీరేన్ మఖిజియా తెలిపారు. మా దగ్గర నమోదు చేసుకునే ప్రతీ కస్టమర్ డేటా, క్రెడిట్ సమాచారం, రిస్క్‌ను ఆటోమేటెడ్ ఆల్గోరిథమ్ టూల్స్ ద్వారా తనిఖీ చేయబడుతుంది. ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత స్థాయిలో 400 పాయింట్లను పరిశీలించడం జరుగుతుంది. ఎన్నో చర్యల్ని తీసుకోవడం ద్వారా రుణ ఎగవేతల రేటును పరిమిత స్థాయిలోనే ఉండేలా చూస్తాం’’ అని ఫెయిర్‌సెంట్ వ్యవస్థాపకుడు వినయ్ మాథ్యూస్ తెలిపారు. -
విచ్చలవిడి రుణాలతో కుదేలైన బ్యాంకులు..
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులు మొండిబకాయిలతో సతమతమయ్యేందుకు 2008 నుంచి 2014 వరకూ విచ్చలవిడిగా రుణాలు ఇవ్వడమే కారణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బ్యాంకులు విచక్షణ లేకుండా రుణాలు జారీ చేస్తుంటే అడ్డుకోవడంలో ఆర్బీఐ విఫలమైనందునే ప్రస్తుతం బ్యాంకింగ్ పరిశ్రమలో ఎన్పీఏ సంక్షోభం నెలకొందన్నారు. ద్రవ్య విధాన నిర్ణేతల స్వతంత్రతపై ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య తీవ్రస్ధాయిలో విభేదాలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం అనంతరం 2008 నుంచి 2014 మధ్య ఆర్థిక వ్యవస్థను కృత్రిమంగా పెంచేందుకు బ్యాంకులను విపరీతంగా రుణాలు ఇవ్వాలని అప్పటి పాలకులు కోరారని ఇండియా లీడర్షిప్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ జైట్లీ పేర్కొన్నారు. ఈ క్రమంలో రుణ వృద్ధి సగటు 14 శాతం కాగా, ఓ ఏడాది అసాధారణంగా 31 శాతానికి ఎగబాకిందన్నారు. బ్యాంకులు అడ్డగోలుగా రుణాలిస్తుంటే ఆర్బీఐ అడ్డుకోలేదన్నారు. మరోవైపు బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించేందుకు ఆర్బీఐకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య కేంద్రాన్ని కోరారు. స్థూల ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు ఆర్బీఐకి విస్తృత అధికారాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. -
అప్పుకు బదులు అమ్మాయితో పెళ్లి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అయ్యో పాపం కష్టాల్లో ఉన్నారా అంటూ చేరువయ్యాడు. అవసరానికి అప్పులిచ్చి ఆదుకున్నాడు. అప్పుతీర్చలేని వారి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన వివరాలు.. నామక్కల్ జిల్లా సేందమంగళంకు చెందిన గాంధీకన్నన్ (33) ఐఏఎస్ అధికారిగా చలామణి అయ్యేవాడు. తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన 16 ఏళ్ల బాలికను పెళ్లిచేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈనెల 5న గుడిలో బాల్యవివాహం జరుగుతున్నట్లు సాంఘిక సంక్షేమాధికారులకు సమాచారం అందటంతోఆలయానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వివాహ వేడుక పూర్తయి అందరూ వెళ్లిపోయారు. పెళ్లి కుమార్తె తల్లిని అధికారులు ఫోన్లో సంప్రదించగా తమ కుమార్తెకు 19 ఏళ్లు నిండాయని, అందుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని బదులిచ్చారు. ఆలయ పెద్దలకు సమర్పించిన పత్రాలను పరిశీలించగా అవి నకిలీవని తేలింది. వధువు పాఠశాల రికార్డులను తనిఖీ చేయగా 16 ఏళ్లుగా నిర్ధారణైంది. దీంతో వరుడు సహా ఐదుగురిపై పోలీసులు కేసు పెట్టటంతో పరారైన గాంధీకన్నన్ శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. -
జేపీ ఇన్ఫ్రాకు ప్రమోటర్ల ఆఫర్ రూ.10,000 కోట్లు
న్యూఢిల్లీ: జేపీ ఇన్ఫ్రాటెక్ కంపెనీని దివాలా స్థితి నుంచి బయటపడేసేందుకు ప్రమోటర్ మనోజ్ గౌర్ రూ.10,000 కోట్లతో బ్యాంకు రుణాలు తీర్చివేయడంతోపాటు, నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేయటానికి ముందుకొచ్చారు. రూ.9,800 కోట్ల రుణాల్లో కొంత తీర్చివేయడం, రుణాలిచ్చిన సంస్థలకు ఈక్విటీ వాటా కేటాయించడంతోపాటు అసంపూర్ణంగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రణాళికలో భాగం. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ ముందు గౌర్ ఈ ప్రణాళికను ఉంచారు. గ్రూపు కంపెనీని కాపాడుకునేందుకు హైడ్రో ఎలక్ట్రిక్, సిమెంట్ ప్రాజెక్టుల్లో మనోజ్గౌర్ తనకున్న వాటాలను ఇప్పటికే విక్రయించిన విషయం తెలిసిందే. అయితే, గౌర్ తాజా ప్రణాళికకు రుణదాతల కమిటీ అంగీకరించినదీ, లేనిదీ ఇంకా స్పష్టం కాలేదు. జేపీ ఇన్ఫ్రా కొనుగోలుకు లక్షద్వీప్ ప్రైవేటు లిమిటెడ్ ఇటీవలే రూ.7,350 కోట్లతో బిడ్ వేసింది. దీంతో పోలిస్తే మనోజ్గౌర్ ఎక్కువ ఆఫర్‌తో ముందుకొచ్చినట్టే. కాగా, దీనిపై రానున్న రెండు రోజుల్లో రుణదాతల కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జేపీ ఇన్ఫ్రాటెక్ 32,000 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికి కేవలం 9,500 మాత్రమే పూర్తి చేసి స్వాధీనం చేసింది. మరో 4,500 ఫ్లాట్ల నిర్మాణం పూర్తయింది. మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే రూ.6,500 కోట్లు కావాల్సి ఉంటుంది. -
ఎంత దారుణం
రుణాల మంజూరులో రాజకీయ ప్రమేయం చెప్పిన వారికే ఇవ్వాలంటూ అధికార పార్టీ నాయకుల హుకుం ఎమ్మెల్యేలనుంచి చోటా నాయకుల దాకా ఒత్తిళ్లు నిజమైన లబ్ధిదారులకు మొండిచెయ్యే! దిక్కుతోచని స్థితిలో అధికారులు అధికారంతో పనిలేకుండా అందరినీ సమానంగా చూడాల్సిన ప్రజాప్రతినిధులు వివక్ష పాటిస్తున్నారు. తాము చెప్పిన లబ్ధిదారులకే రుణాలు మంజూరు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అర్హులను పక్కనబెట్టి తమ కార్యకర్తలకే రుణాలు మంజూరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఇందులో తేడావస్తే సహించేది లేదంటూ అధికారులకు హెచ్చరికలు పంపిస్తున్నారు. చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పోటీ ఎక్కువకావడంతో అధికారపార్టీ నాయకులు రంగంలోకి దిగారు. తాము ఎవరికి చెబితే వారికే రుణాలు మంజూరు చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టార్గెట్లు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ ఈ ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం 4,142 యూనిట్లను టార్గెట్‌గా విధించింది. వీటికి 25,128 దరఖాస్తులు అందాయి. ఒక్కో యూనిట్‌కు సగటున ఆరుగురు పోటీపడ్డారు. ఎస్టీ కార్పొరేషన్‌కు 265 యూనిట్లకుగాను 6,002 దరఖాస్తులు వచ్చాయి. బీసీ రుణాలకు 1,662 యూనిట్లు కేటాయించగా 25,714 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాపు రుణాలకు 2,916 యూనిట్లు కేటాయించగా 13,834 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికార ముద్ర పడాల్సిందే రుణాల మంజూరులో జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైంది. మొదట జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదించి సంబంధిత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌కు సిఫార్సు చేస్తున్నారు. ఆపై తాము రూపొందించిన రహస్య నివేదికలను అధికారులకు చేరవేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో పలుచోట్ల అధికార పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గం వారికి ఇస్తే మరో వర్గం అధికారులపై ఒత్తిడి పెంచుతోంది. నిబంధనలు తూచ్ ఎంపిక ప్రక్రియలో నిబంధనలు పాటించడం లేదు. గ్రామసభల సమక్షంలో జన్మభూమి కమిటీలు, ప్రజాప్రతినిధు లు, డ్వాక్రా సంఘాల మహిళల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టాల్సి ఉంది. కానీ జిల్లాలో ఎక్కడా ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కై రహస్యంగా పంపిన నివేదికల ఆధారంగా అధికారులు రుణాలు మంజూరు చేయాల్సి వస్తోంది. హెచ్చరికలు ‘‘మేం చెప్పిన అభ్యర్థులకే రుణాలు మంజూరు చేయాలి.. లేదంటే మీ అంతు చూస్తాం’’ అంటూ కొందరు అధికారపార్టీ నేతలు అధికారులకు హెచ్చరికలు పంపిస్తున్నారు. చేసేది లేక నిజమైన లబ్ధిదారులను పక్కన పెట్టి, అనర్హులకు రుణాలు మంజూరు చేయాల్సి వస్తోందని పలువురు మదనపడుతున్నారు. -
రుణ మంజూరీలోజాగ్రత్త: రిజర్వ్ బ్యాంక్
ముంబై: రుణ మంజూరు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాంకింగ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా గురువారం సూచించారు. ఒక వ్యక్తికి అతని శక్తికి మించి రుణం ఇవ్వడం వల్ల... సంబంధిత రుణ చెల్లింపుల్లో అతను విఫలమవుతాడని పేర్కొంటూ.. ఈ ప్రతికూలతలు రుణ గ్రహీత క్రెడిట్ ప్రొఫైల్‌పై పడి.. అవసరమైనప్పుడు తిరిగి రుణం పొందలేని పరిస్థితి దాపురిస్తుందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో హెచ్చరించారు. ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు (డీబీటీ) పథకం అమలు ఇంకా పరిమితంగా ఉందని పేర్కొన్న ముంద్రా.. దేశంలోని పౌరులందరికీ ఆర్థికరంగంలో సమగ్ర భాగస్వామ్యం లభించడానికి డీబీటీ అమలు మరింత విస్తృతం కావాల్సి ఉంటుందని వివరించారు. ఇందుకు సంబంధించి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్.. అమలు పరిశీలనకు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటయ్యిందని ముంద్రా తెలిపారు. బ్యాంకింగ్ టెక్నాలజీ మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. -
బ్రోకర్ల బొక్కుడు
కాన్సెంట్ లెటర్‌కు రూ.20 వేలు రుణం మంజూరైతే 30 శాతం వాటా కార్పొరేషన్ రుణాల్లో వారిదే హవా లబ్ధిదారులతో ముందే ఒప్పందాలు సహకరిస్తున్న బ్యాంకర్లు ఇదే బాటలో చోటామోటా లీడర్లు వరంగల్ : పేదవర్గాలకు ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బ్రోకర్ల ప్రమేయంతో అభాసుపాలవుతున్నాయి. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల రుణాల మంజూరులో దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది. పేదలకు ఎక్కువ లబ్ధి జరగాలనే ఉద్దేశంతో రుణాల మంజూ రులో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ శాతాన్ని పెంచింది. కార్పొరేషన్ రుణాల మంజూరుకు బ్యాంకుల ఆమోద పత్రాలు తప్పనిసరి అనే నిబంధన ఉంది. ఇది బ్రోకర్లకే కాకుండా కొందరు బ్యాంకు అధికారులకు కూడా ఆదాయవనరుగా మారింది. సంక్షేమ శాఖల కార్పొరేషన్ నుంచి రుణం పొందాలనుకునే వారు ముందుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనికి బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు సుముఖత చూపుతున్నట్లుగా అంగీకారపత్రం(బ్యాంక్ కాన్సెంట్ లెటర్) ఉంటేనే ఆన్లైన్ దరఖాస్తు చేసే వీలుంటుంది. దీంతో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నిబంధనల పేరుతో సవాలక్ష సాకులు చూపే బ్యాంకర్లు అర్హులైన వారికి రుణం ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. చేసేదిలేక లబ్ధిదారులు బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో దరఖాస్తుదారుల పనులు చక్కబెట్టినందుకు ఒక్కోపనికి ఒక్కోరేటు అన్నట్లు ఫిక్స్చేసి దళారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. బ్యాంకు నుంచి కాన్సెంట్ లెటర్ ఇప్పించేందుకే ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా రుణం కూడా మంజూరు చేరుుస్తామని, అందుకు మంజూరైన రుణం మొత్తంలో 30 శా తం డబ్బులు తమకు ఇవ్వాలని మధ్యవర్తులు లబ్ధిదారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎవరెవరికి రుణా లు మంజూరవుతాయో తెలియక ముందే ఇలాంటి ముం దస్తు ఒప్పందాలు ఎక్కువయ్యాయి. ఒక వ్యక్తి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.2 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇందులో సబ్సిడీ 70 శాతం ఉంటుంది. అంటే రూ.1.40 లక్షలు కార్పొరేషన్ వారు నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తారు. బ్యాంకర్ల వాటాగా రూ.60 వేలు ఇస్తారు. అరుుతే, బ్యాంకులకు కార్పొరేషన్ నుంచి సబ్సిడీ రాగానే.. బ్యాంకు రూ.60 వేలను లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో లబ్ధిదారులు తమ ఆర్థిక పరిస్థితిని బట్టి మధ్యవర్తులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి దరఖాస్తులు పెరగడంతో మధ్యవర్తుల మాటను నమ్మి దరఖాస్తుదారులు మోసపోతున్నారు. బ్యాంకర్ల తీరుతోనే... జిల్లాలో కార్పొరేషన్ రుణాల మంజూరు విషయంలో ఎక్కువ మంది బ్యాంకు అధికారులు నేరుగా లబ్ధిదారులకు కాకుం డా... మధ్యవర్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వరంగల్ నగరంలో ఉన్న కొ న్ని బ్యాంకులకు ముగ్గరు చొప్పున మధ్యవర్తులు ఉంటున్నారు. వీరు వెళ్తేనే బ్యాంకర్లు స్పందిస్తున్నారు. బ్యాంకు అధికారులు వీరిని తమ చాంబర్లలో కూర్చోబెట్టుకుని మర్యాదలు చేసి వీరు చెప్పిన వారికే రుణాలు ఇస్తామనే అంగీకార పత్రాలను ఇస్తున్నారు. మరికొన్ని బ్యాంకులలో ఫీల్డ్ ఆఫీసర్లు రుణాల మంజూరును ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పిన వారికే అంగీకార పత్రాలు వచ్చేందుకు అనుకూలంగా నివేదికలు ఇస్తున్నారు. మరోవైపు కార్పొరేషన్ల రుణాల మంజూరు ప్రక్రియలో రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు కూడా తమ ప్రతాపం చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులకు సబ్సీడీ రుణాల మంజూరులో టార్గెట్లు ఉన్నాయి. స్థానికంగా కాస్త పలుకుబడి ఉన్న నాయకులకే బ్యాంకర్లు పూర్తి సహకారం అందిస్తున్నారు. దీంతో స్థానిక నాయకుల బంధువులకే రుణాలు వచ్చేలా బ్యాంకర్లు, నాయకులు ప్రణాళికలు వేస్తున్నారు. గ్రామాల్లోని ద్వితీయ శ్రేణి నేతలందరూ ఇప్పుడు కార్పొరేషన్ రుణాల పనులపైనే తిరుగుతున్నారు. బ్రోకర్‌ను చితకబాదిన మహిళలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ గ్రామాల్లో మహిళల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఒక వ్యక్తిని కొద్ది రోజుల క్రితం కలెక్టరేట్లో దరఖాస్తుదారులు చితకబాదారు. రుణం ఇప్పించే పేరుతో ఒక్కొక్కరి నుంచి వేల రూపాయలు వసూలు చేశాడు. చివరకు రుణాలు మంజూరి కాకపోవడంతో విసిగిన కొందరు మహిళలు సదరు బ్రోకర్‌కు దేహశుద్ది చేసి మరీ తమ ఆగ్రహం వెళ్లగక్కారు. దరఖాస్తులు పెరిగిన ప్రస్తుత తరుణంలో మధ్యవర్తుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలిమరి. రుణం మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలంటే బ్యాంకు కాన్సెంట్ లెటర్ తప్పని సరి. లెటర్ ఇప్పిం చేందుకు బ్రోకర్లు ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. రుణం మంజూరు చేరుుస్తే, అందులో 30 శాతం ఇవ్వాలని లబ్ధిదారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. బ్రోకర్లు వెళ్తేనే బ్యాంకర్లు స్పందిస్తున్నారు. వాళ్లు చెప్పిన వారికే రుణం మంజూరు చేస్తామని అంగీకార పత్రాలను ఇస్తున్నారు. మరికొన్ని బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్లు రుణాల మంజూరును ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పిన వారికే అంగీకార పత్రాలు వచ్చేలా అనుకూలంగా నివేదికలు ఇస్తున్నారు. -
యువ పారిశ్రామికులకు ఎస్బీహెచ్ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న స్థాయి యువ పారిశ్రామిక వేత్తలకు రుణాలను మంజూరు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) ముందుకొచ్చింది. ఇందుకోసం భారతీయ యువశక్తి ట్రస్ట్‌తో ఎస్బీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఎస్బీహెచ్-బీవైఎస్టీ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పోగ్రామ్’ పేరుతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం జూలై1 నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ఎస్బీహెచ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం ఆమోదయెగ్యమైన వ్యాపార ప్రణాళిక ఉన్న 18 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు, అంగవైకల్యం కలిగినవారికి, గ్రామీణ పట్టణ యువతకు రూ. 50 లక్షల వరకు ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా రుణాలను అందిస్తారు. -
పసుపు రుణ కమిటీలు
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీల ఏర్పాటు సభ్యులుగా ముగ్గురు స్వచ్ఛంద సేవకులు తెలుగు తమ్ముళ్లకు లబ్ధి చేకూరేలా పథకం! కార్పొరేషన్ల డీడీల నుంచి అందిన ఆదేశాలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్వ్యూలు పలమనేరు : రుణాల మంజూరులోనూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, సానుభూతి పరులకే పెద్దపీట వేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఎత్తు వేసింది. ఎస్సీ, ఎస్టీల్లో నిరుద్యోగులకు ఉపాధి, రైతులకు వ్యవసాయ బోర్లు, మోటార్ల మంజూరుకు అర్హుల ఎంపికలో కూడా ప్రభుత్వం పింఛన్ల కమిటీల తరహా బాటలో సాగుతోంది. అధికారులతో పాటు ముగ్గురు సోషియల్ వర్కర్లతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం 101 జీవోను విడుదల చేసింది. నేటి నుంచి మండల, మున్సిపాలిటీల పరిధిలో రుణాల మంజూరుకు అర్హులను గుర్తించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే ఎస్సీ,ఎస్టీ రుణాల్లోనూ తెలుగు తమ్ముళ్లకే లబ్ధి చేకూరేలా ఎత్తులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. స్క్రీనింగ్ కమిటీలే కీలకం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను రుణాలకు ఎంపిక చేయడంలో స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం చెల్లుబాటయ్యేలా ఆదేశాలిచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నుంచి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా స్క్రీనింగ్ కమిటీ మెంబర్ల జాబితా అధికారులకు అందింది. ఒక్కో మండలానికి ముగ్గురు సోషియల్ వర్కర్ల పేరిట అధికారిక జాబితా పంపారు. వీరితో సంబంధిత అధికారులు ఇంటర్వ్యూ తేదీకి ముందు రోజే సమావేశాన్ని ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల జాబితాను అందజేయడం ద్వారా వారు సూచించిన పేర్లనే ఖరారు చేసేలా ఈ తతంగం జరిగేలా ఉంది. అయితే ఉత్తర్వుల్లో మాత్రం దరఖాస్తుదారుల ఎంపిక ప్రక్రియపై నియమ నిబంధనలను వివరించాలని సూచించారు. ఇంటర్వ్యూలు జరిగే రోజు బ్యాంక ర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రయివేటు వ్యక్తుల జోక్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు కమిటీలతో అర్హులను కూడా అనర్హులుగా మార్చడం ద్వారా అన్యాయం చేసిన ప్రభుత్వం మళ్లీ అదే బాటలో సాగుతోంది. నేటి నుంచి ఎస్సీ, ఎస్టీ రుణాలకు ఇంటర్వ్యూలు ఈ నెల 6వ తేదీ: పలమనేరు, కుప్పం, పుంగనూరు, చం ద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లోని 16 మండలాలు 8వ తేదీ: మదనపల్లె, వాయల్పాడు, తంబళ్లపల్లె, పీలేరు, చంద్రగిరి నియోజకవర్గాల్లోని 22 మండలాలు 9వ తేదీ: శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి నియోజకవర్గాల్లోని 18 మండలాలు 10వ తేదీ: చిత్తూరు, పూతలపట్టు, తిరుపతి, చంద్రగిరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోని 17 మండలాల్లోని ఎస్సీ, ఎస్టీ దరఖాస్తుదారులైన నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రైతులకు తిప్పలే..! కొత్త నిబంధనలతో ఎస్సీ, ఎస్టీలకు రుణాలు పూర్తిస్థాయిలో దరఖాస్తుదారులకు అందే పరిస్థితి కనిపించ డం లేదు. మైనర్ ఇరిగేషన్ పథకంలో బోరు, మోటారు తీసుకోవాలంటే ఏపీ ట్రాన్స్‌కో ఇచ్చిన ధ్రువపత్రంలో సర్వీ సు మూడు స్తంభాల దూరంలోనే ఉండాలి, భూగర్భ జలశాఖ జియాలజిస్ట్ ద్వారా ఫిజుబులిటీ కలిగి ఉండా లి. డార్క్ ఏరియా లేకుండా వాల్టా చట్టం ప్రకారం అనుమతులు కలిగిన ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. ఇక ఇప్పటికే బోర్లు వేసుకుని మోటార్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆ బోరులో నీళ్లు పుష్కలంగా ఉన్నట్లు ట్రాన్స్‌కో నిర్థారించిన ధ్రువపత్రం అందజే యాలి. ఇవన్నీ సంబంధిత శాఖల నుంచి తీసుకోవాలంటే పుణ్యకాలం దాటిపోవడం ఖాయం. శనివా రం నుంచి నాలుగు రోజుల్లో ముగిసే ఇంటర్వ్యూలకు ఈ ధ్రువపత్రాలను తీసుకెళ్లడం అంత సులభమైన పనికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోది. ఏదేమైనా ఎస్సీ, ఎస్టీల రుణాల్లోనూ కోతలు పెట్టి, రుణాలు అస్మదీయులకు పరిమితం చేసే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. -
రుణమాఫీ కోసం ఆస్తుల తనఖా!
-
రుణమాఫీ కోసం ఆస్తుల తనఖా!
పథకం అమలుపై పలు అంశాలను పరిశీలిస్తున్న టీ సర్కారు ‘రుణ మాఫీ’పై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు నిధుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల గుర్తింపు రైతులకు నేరుగా లేదా ఎస్పీవీ ఏర్పాటు చేసి బాండ్ల జారీ అన్ని అంశాలను పరిశీలించి 3 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం నెలాఖరు నుంచి రైతులందరికీ కొత్త రుణాలు ఏడు శాతం వడ్డీపై తీసుకున్నవన్నీ వ్యవసాయ రుణాలే వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాల మాఫీ కోసం తెలంగాణ సర్కారు ఆస్తులను తనఖా పెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. రైతులకు నేరుగా లేదా ఒక ప్రత్యేక సంస్థ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేసి బాండ్లు జారీ చేయాలని భావిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి, ఈ నెలాఖరులోగా ఆ రైతులకు కొత్తరుణాలు ఇప్పించే దిశగా ప్రయత్నం చేస్తోంది.. ఈ అంశాలన్నింటినీ పరిశీలించేందుకు ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి, మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మంత్రివర్గ ఉప సంఘానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారు. మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, కె.తారక రామారావు, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ నెల 20వలోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉప సంఘాన్ని కోరింది. రుణమాఫీపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలుచేయడంపై 30వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఇందుకు నాలుగు అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని రాజీవ్‌శర్మ ఉప సంఘానికి సూచించారు. బ్యాంకులకు 50% నిధులు.. రుణమాఫీ మొత్తంలో సగం నిధులను బ్యాంకులకు జమచేయాలని, మిగతా 50 శాతం నిధులను రైతులకు బాండ్లుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాసింది. ఈ ప్రతిపాదనపై బ్యాంకర్ల కమిటీ చర్చిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అవసరమైతే ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టి మాఫీ నిధులను సమీకరించుకోవాలని అందులో చెప్పినట్లు తెలుస్తోంది. అవి వ్యవసాయ రుణాలే.. బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీతో రైతులు తీసుకున్న రుణాలన్నీ వ్యవసాయ రుణాలుగానే పరిగణిస్తామని, అటువంటి వాటికి మాఫీ వర్తిస్తుందని మంత్రి వెల్లడించారు. రుణాల రీషెడ్యూలుకు ఆర్బీఐ నిబంధనలు అడ్డంకయ్యాయన్నారు. రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో రూ. 4,500 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం కోరగా..షరతులతో వంద మండలాల్లో రూ.1,000 కోట్లు మాత్రమే రీషెడ్యూల్ చే సేందుకు రిజర్వుబ్యాంకు అంగీకరించినట్లు చెప్పారు. రైతులకు ఇజ్రాయెల్ సాంకేతికత తెలంగాణలో వర్షాభావం వలన పంట దిగుబడి కోల్పోతున్న రైతులకు ఇజ్రాయెల్ దేశం అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నామని మంత్రి పోచారం తెలిపారు. ఇజ్రాయెల్ సహకార మంత్రి యెహల్ విలన్ ఆహ్వానం మేరకు మంత్రులు, అధికారుల బృందం ఆ దేశం వెళ్లేందుకు సీఎం అంగీకరించారన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధిస్తున్న ఇజ్రాయెల్ ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మంత్రి యెహల్ విలన్ మాట్లాడుతూ... తెలంగాణకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సీఎస్ చేసిన సూచనలు రుణమాఫీకి ఏవిధంగా నిధులు సమకూర్చాలి? తద్వారా అర్హులైన రైతులకు గత సంవత్సరం తీసుకున్న రుణ మొత్తం ఈసారి కూడా లభించేలా ప్రతిపాదనలు రుణ మాఫీకి ఎలా సాయం అందించాలన్న అంశంతో పాటు.. రైతులకు నేరుగా లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా బాండ్లు, పనిముట్లు ఇవ్వడానికి అనుసరించే విధానం రుణ మాఫీకి అవసరమైన నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను గుర్తించడం ఇతర ఆస్తులను ఎస్పీవీకి బదలాయించడంతో పాటు అందుబాటులో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టే అంశాన్ని పరిశీలించడం మూడు రోజుల్లో నివేదిక.. రుణమాఫీపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం వెంటనే సమావేశమై చర్చించింది. అనంతరం కమిటీ అధ్యక్షుడు, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు. మాఫీ చేయాల్సిన వ్యవసాయ రుణాల మొత్తం సుమారు రూ. 17 వేల కోట్లని పేర్కొన్నారు. రుణ మాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, రైతులందరికీ నెలఖారు నుంచి కొత్త రుణాలు ఇప్పించాలని సీఎం కేసీఆర్ తపన పడుతున్నారని చెప్పారు. 34 లక్షల మంది రైతుల రుణ ఖాతాలకు సంబంధించి బ్యాంకులనుంచి తమకు సమాచారం వచ్చిందన్నారు. ఉప సంఘం మరోమారు చర్చించి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వనుందన్నారు. -
10 రోజులు... రూ. 509 కోట్లు
వరంగల్, న్యూస్‌లైన్ : సరిగ్గా 10 రోజులు... ఇవ్వాల్సిన పంట రుణం రూ.509 కోట్లు. నాలుగు నెలల నుంచి రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి... తిరిగి అష్టకష్టాలు పడితెనే రూ.751 కోట్లు పంచిన బ్యాంకర్లు... కేవలం పది రోజుల్లో రూ.509 కోట్లు మంజూరు చేస్తారా...? ఇప్పుడు జిల్లా యంత్రాంగం ముందున్న అతిపెద్ద సవాల్ ఇది. రైతులకు ఇస్తామన్న పంట రుణాల భారీ లక్ష్యం కాగితాలకే పరిమితమవుతోంది. పెట్టుబడుల కోసం కాళ్లావేళ్లా పడుతున్నా... పట్టాదారు పాసుపుస్తకాలతో తిరుగుతున్నా... రైతులకు పంట రుణాలు అందడం లేదు. పెట్టుబడులకు చిల్లిగవ్వ లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇక కౌలు రైతులకు భరోసా అంటూ ప్రగల్భాలు పలికిన సర్కారు... వారికి రుణం ఇప్పించడాన్ని మరిచిపోయింది. జిల్లాలో ఇదీ పరిస్థితి... ఖరీఫ్‌లో మొత్తం రూ.1260 కోట్ల పంట రుణాలు ఇప్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక వేసింది. ఉన్నతాధికారులంతా కలిసి వార్షిక ప్ర ణాళికలో ఇది తమ పెద్ద విజయం అంటూ భు జాలు చరుచుకున్నారు. కానీ, అమల్లో మా త్రం పూర్తిగా మరిచిపోయారు. రైతుకు బ్యాం కర్లు పంట రుణాలు ఎలా ఇస్తున్నారు... ఏ మే రకు ఇచ్చారనే విషయాన్ని జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. భారీ లక్ష్యం ముందుంచుకున్నారే గానీ రైతులకు రుణాలు సరిగా ఇప్పించలేక చతికిలబడ్డారు. ఈసారి ఖరీఫ్ పంట రు ణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తున్నామ ని అధికారులు చెబుతున్నారు. మొత్తం రూ.1260 కోట్ల రుణాలివ్వాల్సి ఉండగా... ఇప్పటి వరకు మంజూరు చేసింది రూ.751 కోట్లు మాత్రమే. జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది పెట్టుబడుల కోసం రుణాలపైనే అధారపడ్డా రు. వరుసగా రెండేళ్లు కరువు రావడంతో ఈ సారి ఖరీఫ్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. పెట్టుబడులకు బ్యాంకులపైనే ఆధారపడ్డారు. కానీ, సరైన సమయంలో బ్యాంకుల నుంచి అప్పు రాకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పలేదు. ఇక బ్యాంకులకు అప్పు కోసం వెళ్లిన రైతులు కాగితాలన్నీ చేతపట్టుకుని నెలల తరబడి తిరుగుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 2.60 లక్షల మందికి రుణాలి చ్చిన బ్యాంకర్లు... ఇంకా లక్షకుపైగా దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. అంతేకాకుండా దరఖాస్తులు పట్టుకుని తిరుగుతున్న రైతులు మరో 60 వేలు ఉంటారని వ్యవసాయాధికారు లు పేర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు రుణం మంజూరు చేయాల్సిన దరఖాస్తులు లక్షకుపైగా ఉన్నాయని అధికారులే చెబుతుండడం గమనార్హం. పంట రుణాల పంపిణీకి సంబం ధించి బ్యాంకర్లకు జిల్లా ఉన్నతాధికారులు కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఫలితంగా రుణ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. సెప్టెంబర్ 30 వరకే రుణాలిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఈసారి లక్ష్యం చేరడం కష్టమే. గత ఖరీఫ్‌లో కూడా జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి రూ.875 కోట్ల రుణ లక్ష్యం ఉండగా... రూ.787 కోట్లే ఇచ్చారు. కౌలురైతుకు కష్టమే.. జిల్లా వ్యాప్తంగా 13,813 మంది కౌలు రైతులు 30,440 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. వారికి రుణ అర్హత కార్డులను సైతం పంపిణీ చేశారు. కానీ... వీరిలో ఇప్పటివరకు 748 ఎకరాల్లో కౌలు చేస్తున్న 189 మంది కౌలు రైతులకు మాత్రమే సుమారు రూ. 55 లక్షలు రుణంగా మంజూరు చేశారు. మిగిలిన వారికి ఉత్తి చేతులు చూపిస్తున్నారు. వారి చేసుకున్న దరఖాస్తులన్నీ బ్యాంకర్ల వద్దే పడి ఉన్నాయి. అధికారులకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నా... ఒక్కరికి కూడా రుణం ఇవ్వడం లేదు. కాగా, రుణాలు ఇవ్వడంతో కొంత వెనకబడ్డామని... అయినా లక్ష్యం మేరకు రుణాలు ఇస్తామని లీడ్ బ్యాంకు మేనేజర్ దత్తు తెలిపారు. ఈ నెలాఖరు వరకే పంట రుణాలు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ఆదుకునే వారేరి ? రైతులను ఆదుకునే వారే కరువయ్యారు. రెండు, మూడు నెలలుగా బ్యాంకుల చుట్టూ తిరిగినా... అప్పు ఇవ్వడం లేదు. వడ్డీ రాయితీ కోసం ముందస్తుగానే క్రాప్ లోన్ చెల్లించినా. ఇప్పటివరకు వడ్డీ రాలేదు. అదిరాకున్నా ఫర్వాలేదు కానీ... అసలు రుణాలు ఇవ్వడం లేదు. రైతులకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున వడ్డీలేని రుణం అందించాలి - మంజ మల్లేశం, రైతు, వీరన్నపేట (చేర్యాల)