కాన్సెంట్ లెటర్‌కు రూ.20 వేలు
రుణం మంజూరైతే 30 శాతం వాటా
కార్పొరేషన్ రుణాల్లో వారిదే హవా
లబ్ధిదారులతో ముందే ఒప్పందాలు
సహకరిస్తున్న బ్యాంకర్లు
ఇదే బాటలో చోటామోటా లీడర్లు
వరంగల్ : పేదవర్గాలకు ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బ్రోకర్ల ప్రమేయంతో అభాసుపాలవుతున్నాయి. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల రుణాల మంజూరులో దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది. పేదలకు ఎక్కువ లబ్ధి జరగాలనే ఉద్దేశంతో రుణాల మంజూ రులో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ శాతాన్ని పెంచింది. కార్పొరేషన్ రుణాల మంజూరుకు బ్యాంకుల ఆమోద పత్రాలు తప్పనిసరి అనే నిబంధన ఉంది. ఇది బ్రోకర్లకే కాకుండా కొందరు బ్యాంకు అధికారులకు కూడా ఆదాయవనరుగా మారింది. సంక్షేమ శాఖల కార్పొరేషన్ నుంచి రుణం పొందాలనుకునే వారు ముందుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనికి బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు సుముఖత చూపుతున్నట్లుగా అంగీకారపత్రం(బ్యాంక్ కాన్సెంట్ లెటర్) ఉంటేనే ఆన్‌లైన్ దరఖాస్తు చేసే వీలుంటుంది. దీంతో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నిబంధనల పేరుతో సవాలక్ష సాకులు చూపే బ్యాంకర్లు అర్హులైన వారికి రుణం ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.
చేసేదిలేక లబ్ధిదారులు బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో దరఖాస్తుదారుల పనులు చక్కబెట్టినందుకు ఒక్కోపనికి ఒక్కోరేటు అన్నట్లు ఫిక్స్‌చేసి దళారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. బ్యాంకు నుంచి కాన్సెంట్ లెటర్ ఇప్పించేందుకే ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా రుణం కూడా మంజూరు చేరుుస్తామని, అందుకు మంజూరైన రుణం మొత్తంలో 30 శా తం డబ్బులు తమకు ఇవ్వాలని మధ్యవర్తులు లబ్ధిదారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎవరెవరికి రుణా లు మంజూరవుతాయో తెలియక ముందే ఇలాంటి ముం దస్తు ఒప్పందాలు ఎక్కువయ్యాయి. ఒక వ్యక్తి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.2 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇందులో సబ్సిడీ 70 శాతం ఉంటుంది. అంటే రూ.1.40 లక్షలు కార్పొరేషన్ వారు నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తారు. బ్యాంకర్ల వాటాగా రూ.60 వేలు ఇస్తారు. అరుుతే, బ్యాంకులకు కార్పొరేషన్ నుంచి సబ్సిడీ రాగానే.. బ్యాంకు రూ.60 వేలను లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో లబ్ధిదారులు తమ ఆర్థిక పరిస్థితిని బట్టి మధ్యవర్తులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి దరఖాస్తులు పెరగడంతో మధ్యవర్తుల మాటను నమ్మి దరఖాస్తుదారులు మోసపోతున్నారు.
బ్యాంకర్ల తీరుతోనే...
జిల్లాలో కార్పొరేషన్ రుణాల మంజూరు విషయంలో ఎక్కువ మంది బ్యాంకు అధికారులు నేరుగా లబ్ధిదారులకు కాకుం డా... మధ్యవర్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వరంగల్ నగరంలో ఉన్న కొ న్ని బ్యాంకులకు ముగ్గరు చొప్పున మధ్యవర్తులు ఉంటున్నారు. వీరు వెళ్తేనే బ్యాంకర్లు స్పందిస్తున్నారు. బ్యాంకు అధికారులు వీరిని తమ చాంబర్లలో కూర్చోబెట్టుకుని మర్యాదలు చేసి వీరు చెప్పిన వారికే రుణాలు ఇస్తామనే అంగీకార పత్రాలను ఇస్తున్నారు. మరికొన్ని బ్యాంకులలో ఫీల్డ్ ఆఫీసర్లు రుణాల మంజూరును ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పిన వారికే అంగీకార పత్రాలు వచ్చేందుకు అనుకూలంగా నివేదికలు ఇస్తున్నారు. మరోవైపు కార్పొరేషన్ల రుణాల మంజూరు ప్రక్రియలో రాజకీయ పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు కూడా తమ ప్రతాపం చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులకు సబ్సీడీ రుణాల మంజూరులో టార్గెట్లు ఉన్నాయి. స్థానికంగా కాస్త పలుకుబడి ఉన్న నాయకులకే బ్యాంకర్లు పూర్తి సహకారం అందిస్తున్నారు. దీంతో స్థానిక నాయకుల బంధువులకే రుణాలు వచ్చేలా బ్యాంకర్లు, నాయకులు ప్రణాళికలు వేస్తున్నారు. గ్రామాల్లోని ద్వితీయ శ్రేణి నేతలందరూ ఇప్పుడు కార్పొరేషన్ రుణాల పనులపైనే తిరుగుతున్నారు.
బ్రోకర్‌ను చితకబాదిన మహిళలు
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ గ్రామాల్లో మహిళల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఒక వ్యక్తిని కొద్ది రోజుల క్రితం కలెక్టరేట్‌లో దరఖాస్తుదారులు చితకబాదారు. రుణం ఇప్పించే పేరుతో ఒక్కొక్కరి నుంచి వేల రూపాయలు వసూలు చేశాడు. చివరకు రుణాలు మంజూరి కాకపోవడంతో విసిగిన కొందరు మహిళలు సదరు బ్రోకర్‌కు దేహశుద్ది చేసి మరీ తమ ఆగ్రహం వెళ్లగక్కారు. దరఖాస్తులు పెరిగిన ప్రస్తుత తరుణంలో మధ్యవర్తుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలిమరి.
రుణం మంజూరుకు దరఖాస్తు చేసుకోవాలంటే బ్యాంకు కాన్సెంట్ లెటర్ తప్పని సరి. లెటర్ ఇప్పిం చేందుకు బ్రోకర్లు ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. రుణం మంజూరు చేరుుస్తే, అందులో 30 శాతం ఇవ్వాలని లబ్ధిదారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
బ్రోకర్లు వెళ్తేనే బ్యాంకర్లు స్పందిస్తున్నారు. వాళ్లు చెప్పిన వారికే రుణం మంజూరు చేస్తామని అంగీకార పత్రాలను ఇస్తున్నారు. మరికొన్ని బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్లు రుణాల మంజూరును ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పిన వారికే అంగీకార పత్రాలు వచ్చేలా అనుకూలంగా నివేదికలు ఇస్తున్నారు.
బ్రోకర్ల బొక్కుడు
Published Fri, Dec 25 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM
Advertisement
Advertisement