రుణ మంజూరీలోజాగ్రత్త: రిజర్వ్ బ్యాంక్ | Don't be over-zealous while lending: RBI Dy Governor SS Mundra to banks | Sakshi
Sakshi News home page

రుణ మంజూరీలోజాగ్రత్త: రిజర్వ్ బ్యాంక్

Published Fri, Jun 10 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

రుణ మంజూరీలోజాగ్రత్త: రిజర్వ్ బ్యాంక్

రుణ మంజూరీలోజాగ్రత్త: రిజర్వ్ బ్యాంక్

ముంబై: రుణ మంజూరు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాంకింగ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా గురువారం సూచించారు. ఒక వ్యక్తికి అతని శక్తికి మించి రుణం ఇవ్వడం వల్ల... సంబంధిత రుణ చెల్లింపుల్లో అతను విఫలమవుతాడని పేర్కొంటూ.. ఈ ప్రతికూలతలు రుణ గ్రహీత క్రెడిట్ ప్రొఫైల్‌పై పడి.. అవసరమైనప్పుడు తిరిగి రుణం పొందలేని పరిస్థితి దాపురిస్తుందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో హెచ్చరించారు.

ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు (డీబీటీ) పథకం అమలు ఇంకా పరిమితంగా ఉందని పేర్కొన్న ముంద్రా.. దేశంలోని పౌరులందరికీ ఆర్థికరంగంలో సమగ్ర భాగస్వామ్యం లభించడానికి డీబీటీ అమలు మరింత విస్తృతం కావాల్సి ఉంటుందని వివరించారు. ఇందుకు సంబంధించి ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్.. అమలు పరిశీలనకు ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటయ్యిందని ముంద్రా తెలిపారు. బ్యాంకింగ్ టెక్నాలజీ మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement