మార్కెట్లో ఎన్నో పీ2పీ సంస్థలు ఉన్నాయి. అయితే, వీటిల్లో కొన్ని ప్రముఖమైన పోర్టళ్లు, వాటికి సంబంధించి ముఖ్యమైన అంశాలను గమనించినట్టయితే...
ఫెయిర్‌సెంట్
రూ.750 అప్పు కూడా ఈ సంస్థ నుంచి సాధ్యమే. ఉదాహరణకు ఏ అనే ఒక రుణ గ్రహీత రూ.లక్ష రుణాన్ని కోరుకుంటుంటే... రుణం ఇవ్వాలనుకునే వ్యక్తి అయితే ఇందులో 20 శాతం అంటే రూ.20,000 వరకే రుణాన్ని ఇవ్వడానికి అవకాశం. అదే అధిక నెట్‌వర్త్ కలిగిన వారు 50 శాతం వరకు, ఇన్‌స్టిట్యూషన్స్ అయితే 100 శాతం వరకు రుణాన్ని మంజూరు చేయవచ్చు. తిరిగి రాని, ఏకకాల రిజిస్ట్రేషన్ చార్జ్ కింద రూ.1,000 సమర్పించుకోవాలి. రుణ కాల వ్యవధి ఆరు నెలల నుంచి 36 నెలల వరకు ఉంటుంది. తమకు అనువైన కాల వ్యవధి పరిధిలో ఉన్న రుణ గ్రహీతలను ఎంచుకుని రుణాలు ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. వడ్డీ రేట్లు 12 నుంచి 28 శాతం మధ్య ఉన్నాయి.
లెండెన్ క్లబ్
కనీసం రూ.2,000 నుంచి రూ.15,000 వరకు ఒక్కొకరికి రుణాన్ని ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చార్జ్ 500. వడ్డీ రావడం ప్రారంభమైన దగ్గర్నుంచి ఫెసిలిటేషన్ ఫీజు వసూలు చేస్తుంది. కమీషన్ అన్నది పెట్టుబడిపై వచ్చే రాబడిపై 1 శాతం నుంచి 25 శాతం వరకు ఉండొచ్చు. 26–35 శాతం మధ్య రాబడుల రేటు ఉంటే 1.5 శాతం, అంతుకుమించితే 3 శాతం కమీషన్ తీసుకుంటుంది. మూడు నెలల నుంచి 24 నెలల కాలానికి రుణాలు ఇచ్చుకోవచ్చు. రుణాలిచ్చే వారికి సగటు రాబడులు 25.5 శాతంగా ఉన్నాయి.
ఐటూఐ ఫండింగ్
రూ.5,000 మొత్తం నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌పై అప్పిచ్చు వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. రుణ కాల వ్యవధి నెల నుంచి 36 నెలల మధ్య ఉంటుంది. అన్ని ïపీ2పీ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ కలిపి గరిష్టంగా రూ.10 లక్షల వరకే ఒకరు రుణాలు ఇచ్చుకోవడానికి పరిమితి ఉంది. 3, 6, 9, 12, 24, 36 నెలల రుణ కాల వ్యవధులు ఉన్నాయి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 వసూలు చేసుకోవచ్చు. ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు కూడా రుణం మంజూరుపై ఉంటుంది. రాబడుల రేటు 27.99 శాతం వరకూ ఉంది.
లెండ్‌బాక్స్
రుణ దాతలు కనీసం రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రుణ గ్రహీతలు రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
క్యాష్ మేకర్
రూ.20,000 నుంచి రూ.1.5 లక్షల వరకు రుణాలు మంజూరు చేసుకోవచ్చు. రుణ కాలవ్యవధి 3–12 నెలలు. 3 ఈఎంఐలు చెల్లించిన తర్వాత ఎప్పుడైనాసరే ముందస్తుగా రుణం తీర్చేసే అవకాశం రుణగ్రహీతలకు ఉంటుంది. రుణదాతల నుంచి రూ.1,000ను రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment