పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు ఎన్నో రకాల చార్జీలు వసూలు చేస్తుంటాయి. వాటిని పరిశీలిస్తే...
రిజిస్ట్రేషన్ ఫీజు
చాలా వరకు సంస్థలు రిజిస్ట్రేషన్ చార్జీ కింద రూ. 100 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నాయి.
లోన్ ప్రాసెసింగ్ చార్జీ
మంజూరు అయిన రుణం మొత్తంలో 1–10 శాతం మధ్య ఉంటుంది. రిస్క్ గ్రేడ్‌పై ఈ చార్జీ ఆధారపడి ఉంటుంది. అయితే, పలు పీ2పీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ చార్జీ సగటున 2–4 శాతం మధ్య ఉంటుంది.
వడ్డీ రేట్లు
వడ్డీ రేట్లను రుణదాత, రుణగ్రహీత నిర్ణయిస్తారు. వీరిరువురు చర్చించుకోవడం ద్వారా ఓ రేటును ఖరారు చేసుకోవచ్చు. 14–36 శాతం మధ్య ఇది ఉంటుంది. రుణ కాల వ్యవధి, రుణ గ్రహీత ఆర్థిక, సామాజిక పరిస్థితులపైనా ఆధారపడి ఉంటుంది.
ముందస్తు చెల్లింపులపై చార్జీలు
మూడు నెలల తర్వాత రుణాన్ని ముందుగా తీర్చివేసినా చార్జీలు ఉండవు. మూడు నెలల్లోపు రుణం మొత్తాన్ని చెల్లించేస్తానంటే చార్జీలు భరించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మూడు నెలల వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.
లేట్ పేమెంట్ ఫీజు
రుణ ఈఎంఐ చెల్లింపులో జాప్యం జరిగితే చార్జీలు ఉంటాయి. లీగల్ నోటీసు పంపిస్తే రూ.500 వరకు చార్జీ చెల్లించాల్సి వస్తుంది.
చెక్‌బౌన్స్ చార్జీలు
రూ.250 వరకు చార్జీ ఉంటుంది.
స్టాంప్ డ్యూటీ
స్టాంప్ డ్యూటీ చార్జీలను రుణ గ్రహీతే భరించాలి.
ఇతర చార్జీలు
బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు చోటు చేసుకుంటే కొన్ని సంస్థలు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈఎంఐ బకాయి ఉన్నా చార్జీ వసూలు చేసేవీ ఉన్నాయి. రూ.200–1,000 వరకు వీటి రూపంలో వసూలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment