
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అయ్యో పాపం కష్టాల్లో ఉన్నారా అంటూ చేరువయ్యాడు. అవసరానికి అప్పులిచ్చి ఆదుకున్నాడు. అప్పుతీర్చలేని వారి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన వివరాలు.. నామక్కల్ జిల్లా సేందమంగళంకు చెందిన గాంధీకన్నన్ (33) ఐఏఎస్ అధికారిగా చలామణి అయ్యేవాడు. తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగానికి చెందిన 16 ఏళ్ల బాలికను పెళ్లిచేసుకునేందుకు సిద్ధపడ్డాడు.
ఈనెల 5న గుడిలో బాల్యవివాహం జరుగుతున్నట్లు సాంఘిక సంక్షేమాధికారులకు సమాచారం అందటంతోఆలయానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వివాహ వేడుక పూర్తయి అందరూ వెళ్లిపోయారు. పెళ్లి కుమార్తె తల్లిని అధికారులు ఫోన్‌లో సంప్రదించగా తమ కుమార్తెకు 19 ఏళ్లు నిండాయని, అందుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని బదులిచ్చారు. ఆలయ పెద్దలకు సమర్పించిన పత్రాలను పరిశీలించగా అవి నకిలీవని తేలింది. వధువు పాఠశాల రికార్డులను తనిఖీ చేయగా 16 ఏళ్లుగా నిర్ధారణైంది. దీంతో వరుడు సహా ఐదుగురిపై పోలీసులు కేసు పెట్టటంతో పరారైన గాంధీకన్నన్ శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment