
హైదరాబాద్: చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) యాంబిట్ ఫిన్‌వెస్ట్ అనే ఎన్‌బీఎఫ్‌సీతో కో లెండింగ్ ఒప్పందం చేసుకుంది. సిడ్బీకి ఇది తొలి సహ లెండింగ్ ఒప్పందం. ఇరు సంస్థలు కలసి సంయుక్తంగా ఎంఎస్‌ఎంఈలకు అన్‌సెక్యూర్డ్ వ్యాపార రుణాలను అందివ్వనున్నాయి. సిడ్బీ వృద్ధి వ్యూహంలో ఎన్‌బీఎఫ్‌సీలు ముఖ్య వాహకమని సిడ్బీ సీఎండీ శివసుబ్రమణియన్ రామన్ పేర్కొన్నారు.
రుణ సదుపాయం అంతంగా అందుబాటులో లేని ప్రాంతాలకు సైతం ఎన్‌బీఎఫ్‌సీలు చేరుకోగలవన్నారు. తమ తొలి కోలెండింగ్ ఒప్పందాన్ని యాంబిట్ ఫిన్‌వెస్ట్‌తో చేసుకోవడం పట్ల సంతోషంగా ఉందని, ఎంఎస్‌ఎంఈలకు సరసమైన రేట్లపై వ్యాపార రుణాలు అందించడానికి ఇది సాయపడుతుందన్నారు.
చదవండి: ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు.. ఆదాయం, లాభాలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా?