Small Industries Development Bank
-
యాంబిట్ ఫిన్‌వెస్ట్‌తో సిడ్బీ కో లెండింగ్ ఒప్పందం
హైదరాబాద్: చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) యాంబిట్ ఫిన్వెస్ట్ అనే ఎన్‌బీఎఫ్‌సీతో కో లెండింగ్ ఒప్పందం చేసుకుంది. సిడ్బీకి ఇది తొలి సహ లెండింగ్ ఒప్పందం. ఇరు సంస్థలు కలసి సంయుక్తంగా ఎంఎస్ఎంఈలకు అన్సెక్యూర్డ్ వ్యాపార రుణాలను అందివ్వనున్నాయి. సిడ్బీ వృద్ధి వ్యూహంలో ఎన్బీఎఫ్సీలు ముఖ్య వాహకమని సిడ్బీ సీఎండీ శివసుబ్రమణియన్ రామన్ పేర్కొన్నారు. రుణ సదుపాయం అంతంగా అందుబాటులో లేని ప్రాంతాలకు సైతం ఎన్బీఎఫ్సీలు చేరుకోగలవన్నారు. తమ తొలి కోలెండింగ్ ఒప్పందాన్ని యాంబిట్ ఫిన్‌వెస్ట్‌తో చేసుకోవడం పట్ల సంతోషంగా ఉందని, ఎంఎస్ఎంఈలకు సరసమైన రేట్లపై వ్యాపార రుణాలు అందించడానికి ఇది సాయపడుతుందన్నారు. చదవండి: ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు.. ఆదాయం, లాభాలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా? -
5 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాకారానికి స్టార్టప్‌లు
హైదరాబాద్: ప్రధాన మంత్రి లక్ష్యమైన ‘2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం’ సాకారానికి స్టార్టప్‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఈ స్టార్టప్‌ల నిధుల అవసరాలను తీర్చడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) కీలకంగా పనిచేస్తాయని చిన్న పరిశ్రమ అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) సీఎండీ సుబ్రమణియన్ రామన్ పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిధుల అవసరాలు, అభివృద్ధి, ప్రోత్సాహకాలను సిడ్బీ చూస్తుంటుంది. ఈ నెల 27న ఇన్వెస్టర్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వాణిజ్య బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. స్టార్టప్‌లకు సంబంధించి ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, కొత్తగా ఏర్పాటైన క్రెడిట్ గ్యారంటీ స్టార్టప్‌లకు సంబంధించి సమాచారాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. స్టార్టప్‌లకు కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ శృతీసింగ్ అభినందించారు. -
స్టార్టప్స్ కోసం సిడ్బి వెంచర్ క్యాపిటల్ ఫండ్
న్యూఢిల్లీ: చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి) ప్రత్యేకంగా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రూ. 10,000 కోట్లు కేటాయించింది. ఈ ఫండ్ ద్వారా స్టార్టప్ సంస్థలకు అవసరమైన నిధులను సిడ్బి సమకూరుస్తుంది. నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) రాజీవ్ ప్రతాప్ రూడి రాజ్యసభకు ఈ విషయం తెలిపారు. స్టార్టప్ కంపెనీలు మరింతగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిడ్బి పెట్టుబడులు తోడ్పడతాయి.