
న్యూఢిల్లీ: కరోనా భయాల నేపథ్యంలో పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదాపడింది. అంతకంతకూ కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో ఏప్రిల్ 3న జరగాల్సిన పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ప్రకటించింది. కాగా, ఈ ఏడాది పలు రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి. పద్మ విభూషణ్ అవార్డు ఏడుగురిని వరించగా.. పద్మభూషణ్ 16 మందిని.. 118 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఇక తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ క్రీడా కారిణి పీవీ సింధుకు పద్మ భూషణ్ పురస్కారం లభించగా.. రైతు చిన్నితల వెంకట్ రెడ్డి, సాహిత్య రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన విజయ సారథి శ్రీ భాష్యంకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కళారంగంలో సేవలందించినందుకు దలవాయి చలపతిరావు, ఎడ్ల గోపాలరావుకు పద్మశ్రీ పురస్కారాలు అందుకోనున్నారు.
(చదవండి: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం)
Comments
Please login to add a commentAdd a comment