
‘సైఫ్‌కు పద్మ’పై చర్యలేంటి?
న్యూఢిల్లీ: కనీస విచారణ లేకుండా నటుడు సైఫ్ అలీఖాన్, వ్యాపారి అరుణ్ ఫిరోడియాల పేర్లను ‘పద్మ’ అవార్డులకు ఆమోదించిన అధికారుల పేర్లు, వారిపై చర్యల వివరాలు చెప్పాలని కేంద్ర హోం శాఖను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. సైఫ్‌కు 2010లో, ఫిరోడియాకు 2012లో పద్మ అవార్డులు వచ్చాయి. అవార్డులకు ఎవరెవరిని ఎవరెవరు సిఫార్సు చేశారో తెలపాలంటూ సుభాష్ అగర్వాల్ అనే కార్యకర్త వేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలిచ్చింది. విజేతల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకోలేదని, నిఘా సంస్థలతో కనీస విచారణ చేయించకుండానే వీరిని ఎంపికచేశారని ఆరోపించారు.