
సాక్షి, సంగారెడ్డి: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2020 వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారి నుంచి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గణతంత్రదినోత్సావాన్ని పురస్కరించుకొని అవార్డులు ఇస్తామన్నారు. చిత్రలేఖనం, సామాజిక, సేవ, ప్రజాసంబంధాలు, సైన్స్, ఇంజనీరింగ్, ట్రేడ్, అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, సాహిత్యం, విద్య, సివిల్‌సర్వీస్, క్రీడలు, తదితరరంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి పద్మ అవార్డుకు ఎంపిక చేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అవార్డుల కోసం ప్రతిపాదనలను ఈనెల 22 లోగా పంపించాలని సూచించారు. www.padmaawards.gov.in వెబ్‌సైట్‌లో పద్మ అవార్డుల కోసం గైడ్‌లైన్స్ చూడవచ్చని అన్నారు. ఈ అవార్డు కోసం జిల్లాకు చెందినవారై విశేష కృషి చేసిన ఆసక్తిగల వ్యక్తులు అవసరమైన పత్రాలను జతచేయాలన్నారు. హెచ్‌ఓడీలకు అందజేయాలని చెప్పారు. పరిశీలించి అర్హత కలిగిన దరఖాస్తులను ఎన్‌ఐసీ, డీఐఓ కార్యాలయంలో సంబంధిత వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు వారి పరిదిలో ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన జిల్లాకు చెందిన వ్యక్తులను గుర్తించి దరఖాస్తులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment