జేసుదాస్‌కు పద్మవిభూషణ్
జేసుదాస్‌కు పద్మవిభూషణ్
Published Wed, Jan 25 2017 5:44 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
సంగీత దిగ్గజానికి రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించింది. కొన్ని దశాబ్దాలుగా తన విలక్షణమైన గానమాధుర్యంతో యావద్దేశాన్ని అలరిస్తున్న ప్రముఖ గాయకుడు కె.జె. జేసుదాస్‌కు పద్మ విభూషణ్ లభించింది. ఆయనతో పాటు దివంగత నేతలు సుందర్‌లాల్ పట్వా, పీఏ సంగ్మాలకు కూడా ఈ అవార్డును ప్రకటించారు. ఇప్పటివరకు ప్రతిసారీ ఎక్కువగా ప్రముఖులకు, అందరికీ తెలిసినవారికి మాత్రమే వస్తున్న పద్మ అవార్డులు ఈసారి సంఘసేవలో ఉన్నవారికి, వివిధరంగాల్లో లబ్ధప్రతిష్ఠులకు కూడా వచ్చాయి. కలరియపట్టు లాంటి యుద్ధ విద్యను గత 68 సంవత్సరాలుగా ప్రాక్టీసు చేస్తున్న మీనాక్షి అమ్మ, ఎయిడ్స్‌పై పోరాటం చేసిన సునీతి సాల్మన్.. ఇలాంటి పలువురికి ఈసారి పద్మ అవార్డుల జాబితాలో చోటు దక్కింది.
అవార్డుల పూర్తి వివరాలు ఇవీ...
పద్మవిభూషణ్
కె.జె. జేసుదాస్, జగ్గీ వాసుదేవ్, శరద్ పవార్, మురళీ మనోహర్ జోషి, ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు, సుందర్ లాల్ పట్వా, పీఏ సంగ్మా
పద్మభూషణ్
విశ్వమోహన్ భట్, ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది, తెహెమ్టన్ ఉద్వైదా, రత్నసుందర్ మహరాజ్, స్వామి నిరంజనానంద సరస్వతి, మహాచకి్ర సిరిందోర్న్ (విదేశీయులు), చో రామస్వామి
పద్మశ్రీ
బసంతి బిస్త్, చెమన్‌చెరి కున్హిరామన్ నాయర్, అరుణా మొహంతి, భారతీ విష్ణువర్ధన్, సాధు మెహర్, టి.కె. మూర్తి, లైష్రాం బీరేంద్రకుమార్ సింగ్, కృష్ణరామ్ చౌదరి, బవోవా దేవి, తిలక్ గితాయ్, ప్రొఫెసర్ ఎక్కా యాదగిరిరావు, జితేంద్ర హరిపాల్, కైలాష్ ఖేర్, పరస్సల బి. పొన్నమ్మాళ్, సుక్రి బొమ్మగౌడ, ముకుంద్ నాయక్, పురుషోత్తం ఉపాధ్యాయ్, అనురాధా పౌడ్వాల్, వారెప్ప నబా నీల్, త్రిపురనేని
హనుమాన్ చౌదరి, టీకే వివ్వనాథన్, కన్వల్ సిబాల్, బిర్ఖా బహదూర్ లింబూ మురింగ్లా, ఎలి అహ్మద్, నరేంద్ర కోహ్లి, ప్రొఫెసర్ జి.వెంకటసుబ్బయ్య, అక్కితం అచ్యుతన్ నంబూద్రి, కాశీనాథ్ పండిత, చాము కృష్ణశాస్త్రి, హరిహర్ కృపాళు త్రిపాఠి, మైఖేల్ డానినో, పూనమ్ సూరి, వీజీ పటేల్, వి. కోటేశ్వరమ్మ, బల్బీర్ దత్, భావనా సోమయ్య, విష్ణు పాండ్య, సుబ్రతో దాస్, భక్తియాదవ్, మహ్మద్ అబ్దుల్ వహీద్, మదన్ మాధవ్ గోడ్బోలే, దేవేంద్ర దయాభాయ్ పటేపల్, ప్రొఫెసర్ హరికిషన్ సింగ్, ముకుట్ మింజ్, అరుణ్ కుమార్ శర్మ, సంజీవ్ కపూర్, మీనాక్షి అమ్మ, జెనాభాయ్ దర్గాభాయ్ పటేల్, చంద్రకాంత్ పిఠావా, ప్రొఫెసర్ అజోయ్ కుమార్ రే, చింతకింది మల్లేశం, జితేంద్రనాథ్ గోస్వామి, దారిపల్లి రామయ్య, గిరీష్ భరద్వాజ్, కరీముల్ హక్, బిపిన్ గణత్రా, నివేదితా రఘునాథ్ భిడే, అప్పాసాహెబ్ ధర్మాధికారి, బాబా బల్బీర్ సింగ్ సీచేవల్, విరాట్ కోహ్లీ, శేఖర్ నాయక్, వికాస గౌడ, దీపా మాలిక్, మరియప్పన్ తంగవేలు, దీపా కర్మాకర్, పీఆర్ శ్రీజేష్, సాక్షి మాలిక్, మోహన్ రెడ్డి వెంకట్రామ బోడనపు, ఇమ్రాన్ ఖాన్, అనంత్ అగర్వాల్, హెచ్ఆర్ షా, సునీతి సాల్మన్, అశోక్ కుమార్ భట్టాచార్య, డాక్టర్ మపుస్కర్, అనురాధా కొయిరాలా
Advertisement
Advertisement