
వరంగల్ స్పోర్ట్స్: భారత ప్రభుత్వం–2019 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా డీవైఎస్‌ఓ ధనలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కళలు, క్రీడలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు అందజేస్తారన్నారు. ఆసక్తి, అర్హతగల వారు నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేయాలని తెలిపారు.