aplication
-
గిరిజన గ్రామాల వివరాలకో మొబైల్ యాప్
సాక్షి, అమరావతి: గిరిజన గ్రామాల వివరాలు, మౌలిక సదుపాయాలు తెలుసుకునేందుకు వీలుగా మొబైల్ యాప్‌ను గిరిజన సంక్షేమ ఐటీ విభాగం రూపొందించింది. రోడ్లు, భవనాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు మొదలైన అన్ని మౌలిక సదుపాయాలను, గ్రామాల్లోని అన్ని ఇతర ఆస్తులను ప్రభుత్వ విభాగాలు తెలుసుకునేందుకు ఈ మొబైల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ► ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఏపీసీఎఫ్ఎఫ్) గిరిజన గ్రామాలకు చెందిన మొత్తం సమాచారాన్ని ఆయా విభాగాల నుంచి సేకరించి క్రోడీకరిస్తుంది. ► త్వరలో అందుబాటులోకి రానున్న ఈ యాప్‌ను ఆఫ్‌లైన్, ఆన్లైన్లో చూసుకోవచ్చు. మొబైల్, కంప్యూటర్ సిస్టమ్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► ఈ యాప్‌లో గ్రామ ప్రొఫైల్‌లో జనాభా వివరాలు, గృహాలు, స్వయం సహాయక బృందాల సంఖ్య, పెన్షనర్ల సంఖ్య, సంక్షేమ సహాయకుడి పేరు, గ్రామ వలంటీర్ల సంఖ్య, వ్యవసాయ భూమి ఎన్ని ఎకరాలు ఉందనే వివరాలు ఉంటాయి. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొఫైల్‌లో 35 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అవి.. ఏపీఎస్ఆర్టీసీ, వ్యవసాయం, వినోదం, పాడి, పశుసంవర్థక, విద్య, విద్యుత్, ఫైబర్‌నెట్, ఫైనాన్స్, ఫైర్ స్టేషన్, ఫిషరీస్, ఫుడ్– సివిల్ సప్లైస్, ఫారెస్ట్, జీసీసీ, గ్యాస్ అండ్ పెట్రోల్, హెల్త్, హార్టికల్చర్, ఐటీడీఏ, ఇరిగేషన్ సోర్స్, జువెనైల్ వెల్ఫేర్, లేబర్ విభాగం, పంచాయతీ రాజ్, పోలీస్‌స్టేషన్, ఆర్టీఏ, రెవెన్యూ విభాగం, గ్రామీణ నీటి సరఫరా, సెర్ప్, స్వయం సహాయక బృందాలు, సెరికల్చర్, నైపుణ్యాభివృద్ధి, వసతి గృహాలు, టెలికాం, వెటర్నరీ, మహిళ– శిశు సంక్షేమం, ఇతర విభాగాలు. ► రహదారి కనెక్టివిటీ సమాచారంతో రహదారులను సంగ్రహించడానికి జియో ఫెన్సింగ్ సౌకర్యం ఉంది. డ్యాష్ బోర్డులో పూర్తి వివరాలు ఉంటాయి. ► హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా రోగులకు వైద్య సాయాన్ని అందించే అనువర్తనాన్ని ఈ అప్లికేషన్లో అభివృద్ధి చేశారు. -
జనాభా లెక్క తేలుస్తారు..
జనాభా లెక్కల సేకరణ కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో 45 రోజుల్లో నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ తయారీ నిర్వహిస్తారు. 2021 ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకు పాపులేషన్ ఎన్యుమరేషన్ నిర్వహించి మార్చిలో వివరాలు ప్రకటిస్తారు. సెన్సెస్ కోసం తొలిసారిగా మూడు యాప్‌లు వినియోగించనున్నారు. కచ్చితమైన జనాభా సంఖ్యను తేల్చేందుకు ఆధార్‌తో అనుసంధానించనున్నారు. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ అధికారులు శిక్షణ ఇచ్చారు. సాక్షి, కడప: ప్రతి పదేళ్లకు ఓసారి జనాభా లెక్కలు తయారు చేస్తారు. 2021 జనాభా లెక్కల సేకరణకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటివరకు వివరాల సేకరణ, నమోదు మాన్యువల్‌గానే సాగింది. ఈసారి కొత్తగా మూడు యాప్‌లు వినియోగిస్తున్నారు. కేవలం యాప్‌లనే నమ్ముకుంటే సాంకేతిక అవరోధాలు ఉత్పన్నమైతే మొదటికే మోసం వచ్చే వస్తుంది. అందుకే యాప్‌లతోపాటు మాన్యువల్‌గా కూడా వివరాలు సేకరించి నమోదు చేయనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం, గుంటూరుజిల్లా నరసరావుపేటలో ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రయోగాత్మకంగా పాపులేషన్ సెన్సెస్ నిర్వహించారు. సత్ఫలితాలు రావడంతో రాష్ట్రమంతటా నిర్వహించాలని నిర్ణయించారు. అధికారులు వీరే: జన గణన–2021 కార్యక్రమానికి కలెక్టర్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఆయా మున్సిపాలిటీలకు కమిషనర్లు ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారులుగా ఉంటారు. ఆర్డీఓలు సబ్ డివిజన్ సెన్సెస్ అధికారులుగా, తహసీల్దార్లు మండల చార్జ్ ఆఫీసర్లుగా, ఎంపీడీఓలు అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా ఉంటారు. నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ 2020 ఏప్రిల్ నుంచి నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ తయారు చేస్తారు. జనాభా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, వలస తదితర వివరాలు నమోదు చేస్తారు. రెండు తరాల కుటుంబ సభ్యుల వివరాలను ప్రజలు అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. స్వస్థలం ఏదీ? ఎప్పటి నుంచి ఇక్కడ నివాసముంటున్నారు? ఏమి చేస్తున్నారు? తదితర వివరాలు సెన్సెస్ అధికారులకు తెలపాలి. అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెన్సెస్‌లో భాగంగా తయారు చేయనున్న నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ ఇందుకు దోహదపడుతుంది. ఎన్పీఆర్ ఆధారంగానే ఎన్ఆర్సీ రూపొందిస్తారు. దీంతోపాటు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తారు. జిల్లా జనాభా వివరాలు 2011 సెన్సెస్ ప్రకారం జిల్లాలో 28.82 లక్షల జనాభా ఉంది. పురుషులు 14.52 లక్షలు, మహిళలు 14.03 లక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో 19.03 లక్షల మంది జనాభా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 9.79 లక్షల మంది ఉన్నారు. సెక్స్ రేషియో పరిశీలిస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు 985 మంది మహిళలు ఉన్నారు. 2001 జనాభా లెక్కల కంటే 10.76 శాతం 2011లో పెరిగారు. త్వరలో శిక్షణ 2021 సెన్సెస్‌లో భాగంగా జిల్లాలో నలుగురు మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇప్పించాము. వీరు జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాలోని 130 మంది ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన ఫీల్డ్ ట్రైనర్లు అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోని ఏడు వేల మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జనాభా లెక్కల సేకరణ కోసం ఇంటింటికి వచ్చే అధికారులకు ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపుకార్డులు వంటి వివరాలను ప్రజలు సమర్పించి సహకరించాలి. ఇంకా ప్రభుత్వం నుంచి నియమ నిబంధనలు రావాల్సి ఉంది. – వి.తిప్పేస్వామి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, కడప -
మొబైల్ నుంచీ జనరల్ టికెట్
సాక్షి, హైదరాబాద్: మొబైల్ యాప్ ద్వారా సాధారణ తరగతి రైల్వే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటు లోకి తెచ్చింది. సబర్బన్ రైళ్లకు మాత్రమే పరిమితమైన మొబైల్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని ఇప్పుడు అన్ని రైళ్లలోని అన్రిజర్వ్డ్ బోగీలకూ విస్తరించారు. ఇందుకోసం అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్(యూటీఎస్) యాప్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణానికి మూడు గంటల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలోని 554 రైల్వేస్టేషన్లలో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు జనరల్ క్లాస్ టికెట్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. దశలవారీగా సమీప రైల్వేజోన్లకు.. ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించే అన్ని రైళ్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉమాశంకర్‌కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎంజీ శేఖరం, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఆయన యూటీఎస్ యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు.ఈ నెల 16వ తేదీ తెల్లవారుజాము నుంచి బయలుదేరే రైళ్లలో యూటీఎస్ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. రైల్వే సేవల డిజిటైజేషన్లో దక్షిణ మధ్య రైల్వే మొదటి నుంచి ముందు వరుసలో ఉందని, 80 రైల్వేస్టేషన్లలో వైఫై సదుపాయం ఏర్పాటు చేశామని, త్వరలో అన్ని రైల్వేస్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయని జీఎం చెప్పారు. యూటీఎస్ సేవలు ఇలా.. పండుగలు, వరుస సెలవుల్లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంటోంది. సాధారణ తరగతి టికెట్ల కోసం ప్రయాణికులు కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఒక్కోసారి రైలు వచ్చి వెళ్లే వరకూ టికెట్ లభించడం లేదు. ఇలాంటి సందర్భాల్లో యూటీఎస్ యాప్ ద్వారా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకుని రైలు ఎక్కొచ్చు. యూటీఎస్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలంటే ప్రయాణికులు బయలుదేరే స్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల జీపీఎస్ పరిధిలో ఉండాలి. ఆ రోజు బయలుదేరే రైళ్ల(కరెంట్ బుకింగ్)లో మాత్రమే యూటీఎస్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. 3 గంటల పాటు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుంది. ఆ వ్యవధిలో బయలుదేరకుండా ఉంటే టికెట్ డబ్బులు నష్టపోవాలి. సాధారణ రైళ్లతో పాటు సబర్బన్ రైళ్లలో టికెట్లూ బుక్ చేసుకోవచ్చు. సీజనల్ టికెట్లు(నెలవారీ/3 నెలల పాస్‌లు) పొందవచ్చు. రెన్యువల్ చేసుకొవచ్చు. రైల్వే స్టేషన్లలోకి రెండు గంటల పాటు అనుమతించే ప్లాట్‌ఫామ్ టికెట్లు కూడా ఈ యాప్ ద్వారా లభిస్తాయి. యూటీఎస్ యాప్ ద్వారా ఒకేసారి నలుగురికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రెండు రకాల టికెట్లు.. యూటీఎస్ యాప్ బుకింగ్స్‌లో రెండు రకాల టికెట్ ఆప్షన్లు ఉన్నాయి. పేపర్‌లెస్ టికెట్ తీసుకోవచ్చు. పేపర్ టికెట్ కావాలనుకుంటే స్టేషన్‌కు వెళ్లిన తర్వాత బుకింగ్ కౌంటర్లలో తమ మొబైల్ నంబర్, టికెట్ బుకింగ్ కోడ్ చెబితే ప్రింటెడ్ టికెట్ ఇస్తారు. స్టేషన్లలోని ఏటీవీఎంల నుంచీ పేపర్ టికెట్ తీసుకోవచ్చు. పేపర్‌లెస్ టికెట్లను మొబైల్లో భద్రపరుచుకుని టికెట్ ఎగ్జామినర్లకు చూపిస్తే సరిపోతుంది. పేపర్‌లెస్ టికెట్లకు ఏ రోజుకు ఆ రోజు రంగు మారిపోతుంది. టిక్కెట్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఆర్–వాలెట్‌పై 5 శాతం రాయితీ.. ప్రయాణికులు ఆండ్రాయిడ్, యాపిల్, విండోస్ స్మార్ట్ఫోన్లలోని ప్లేస్టోర్ల నుంచి ‘యూటీఎస్’యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పేరు, మొబైల్ నంబర్, ఆధార్ తదితర వివరాలు నమోదు చేయాలి. దాంతో యూటీఎస్ యాప్ నుంచి టికెట్ బుకింగ్ సదుపాయం లభిస్తుంది. ఈ యాప్‌లో రైల్వే వాలెట్ (ఆర్–వాలెట్) కూడా ఉంటుంది. ఆర్–వాలెట్ నుంచి టికెట్లు బుక్ చేస్తే 5 శాతం రాయితీ లభిస్తుంది. పేటీఎం, పేమెంట్ గేట్‌వే, నెట్ బ్యాంకింగ్ తదితర మార్గాల్లోనూ టికెట్ల డబ్బులు చెల్లించవచ్చు. యాప్‌ను ఆవిష్కరిస్తున్న జీఎం వినోద్ -
‘పద్మ’ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
వరంగల్ స్పోర్ట్స్: భారత ప్రభుత్వం–2019 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా డీవైఎస్ఓ ధనలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కళలు, క్రీడలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులు అందజేస్తారన్నారు. ఆసక్తి, అర్హతగల వారు నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేయాలని తెలిపారు. -
ఓంక్యాప్ ద్వారా మస్కట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడ (మొగల్రాజపురం) : ఆం్ర«దప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఓంకాప్ ద్వారా మస్కట్‌లో అన్వర్ అల్మజెడ్ యునైటెడ్ (నేషనల్ ఎలక్ట్రిసిటీ సెంటర్)లో వివిధ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాశాఖాధికారి డాక్టర్ పి.వి.రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. టెస్టింగ్ ఇంజినీరు–1, ఫోర్‌మెన్–3, లైన్మెన్–4, ఎలక్ట్రీషియన్–3, కేబుల్ జాయింటర్–1, డ్రాప్ట్స్‌మెన్–1, సర్వేయర్–1, హెచ్ఎస్ఈ ఆఫీసర్–1, బిల్ డిస్ట్రిబ్యూటర్లు–50 పోస్టుల భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. అక్టోబర్‡మూడో వారంలో ఇంటర్వూ్యలు జరుగుతాయని, ఇంటర్వూ్య జరిగే ప్రదేశం వివరాలను తర్వాత తెలియజేస్తామని వివరించారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తిబయోడేటా, పాస్‌పోర్టు, అర్హతలకు సంబంధించిన పత్రాలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో నగరంలోని ఐదో నంబరు బస్సు రూట్లో ఐటీఐ కళాశాల ఆవరణలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో అందించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 0866–2484948, 81792 04289, 70753 40904 నంబర్లను సంప్రదించాల్సిందిగా కోరారు. బయోడేటాను నేరుగా సీవీవోఎంసీఏపీ ఎట్ దరెట్ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్‌కు పంపవచ్చని తెలిపారు. -
ముగిసిన మద్యం షాపుల లైసెన్స్ గడువు
హైదరాబాద్: తెలంగాణలో రిటైల్ మద్యం షాపుల లైసెన్స్‌ల కోసం గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే కొన్ని జిల్లాల్లోని షాపుల కోసం మాత్రం దరఖాస్తులు రాలేదు. ఈ నేపధ్యంలో దరఖాస్తులు రానీ షాపులకోసం రీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
విద్యార్థులకు ‘ఉపకారం’ చేయరా..!
కడప రూరల్ : జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారులకు వింత సమస్య ఎదురైంది. మహాప్రభో ఉపకార వేతనాల కోసం విద్యార్థుల దరఖాస్తులను పంపండి.. నిధులు మంజూరు చేస్తామని మొత్తుకుంటున్నా ఆయా కళాశాలలు స్పందించడం లేదు. దీంతో ఆ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అందని 5458 ఎస్సీ విద్యార్థుల దరఖాస్తులు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫీజులు, స్కాలర్‌షిప్పుల కోసం రెన్యూవల్ విద్యార్థులు 9766, ఫ్రెషర్స్ విద్యార్థులు 7845, మొత్తం 17611 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 12153 మందికి ఉపకార వేతనాలు మంజూరు చేశారు. అయితే ఇంకా కాలేజీ స్థాయిలో 1514 మంది విద్యార్థుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 839 మంది దరఖాస్తులు ఆధార్‌కు వేలిముద్రలను కళాశాల యాజమాన్యాలు తీసుకుని పంపాల్సి ఉంది. అలాగే 2945 మంది దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరిచారు. అయితే, అందుకు సంబంధించిన హార్డ్ కాపీలను సోషల్ వెల్ఫేర్‌కు పంపలేదు. మొత్తం కలిపి 5458 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉపకార వేతనాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 577 కళాశాలల్లో ఎస్సీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆ కళాశాలల నుంచి ఈ 5458 దరఖాస్తులు రావాల్సి ఉంది. ఇంతవరకు ఆ దరఖాస్తులు రాకపోవడంతో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయలేక పోతోంది. కళాశాల నిర్లక్ష్యం కారణంగానే ఆ శాఖకు దరఖాస్తులు అందడం లేదని తెలుస్తోంది. కళాశాల యాజమాన్యాలే బాధ్యత వహించాలి 2014-15లో ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేశాము. అయితే, 5458 మంది దరఖాస్తులు కళాశాల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నందున వారికి నిధులు మంజూరు చేయలేక పోతున్నాము. కళాశాల యాజమాన్యాలు ఆ వివరాలు పంపకపోతే విద్యార్థులు ఉపకార వేతనాలు పొందడం ఆలస్యం అవుతుంది. అందుకు కళాశాల యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ఇందుకు సంబంధించి ఈనెల 11వ తేది ఉదయం కడప మహిళా డిగ్రీ కళాశాలలో, సాయంత్రం ప్రొద్దుటూరులోని వైఎస్సార్ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేశాము. - పీఎస్ఏ ప్రసాద్, జాయింట్ డెరైక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ, కడప. -
'అసాంఘిక శక్తులు అధికమయ్యాయి'
విశాఖపట్నం: శాంతి భద్రతల కోసం అప్లికేషన్స్ ను ఉపయోగించే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు కె.హరిబాబు పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. మహిళల భద్రత కోసం ఐక్లిక్ విధానాన్ని మంగళవారం విశాఖపట్నంలో ఏపీ హోం మంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ...ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని కలిగించాలని ఆయన పోలీసులుకు హితవు పలికారు. పోలీసుల బలహీనతలు, పనితీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయని... ఈ నేపథ్యంలో ఓ సారి పునసమీక్షించుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. విశాఖలో గతంలో కంటే అసాంఘిక శక్తుల కార్యకలాపాలు అధికమైయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో శాంతియుత వాతావరణం కల్పించకపోతే ఏ పారిశ్రామిక వేత్త విశాఖకు రారని అన్నారు. గతంలో నగరంలో పోలీస్ శాఖలో చోటు చేసుకున్న తప్పులను సమీక్షించాలని కొత్త సీపీ అమిత్ గార్గ్ కి కె.హరిబాబు హితవు పలికారు.