
సాక్షి, న్యూఢిల్లీ: పద‍్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉన్నారు. 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డు ప్రకటించారు.
స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషన్, బాలీవుడ్ నటికి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. మరణానంతరం అరుణ్ జైట్లీకి పద్మ విభూషన్, సుష్మా స్వరాజ్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు పద్మ విభూషన్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. విజయవాడ వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురానికి చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావు, తొలి మృదంగ కళాకారిణి విజయవాడకు చెందిన నిడుమోలు సుమతి రాష్ట్రపతి చేతులమీదిగా పద్మ శ్రీ పురాస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ కళాకారుడు కనకరాజుకు రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment