మాతృదేశాన్ని, ఇక్కడి ప్రజలను తలుచుకుని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భావోద్వేగానికి లోనయ్యారు. గణతంత్రదినోత్సవ వేడుకల వేళ భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు పద్మభూషన్ అవార్డును ప్రకటించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ఎమెషనల్ అయ్యారు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రిలతో ఇక్కడి ప్రజలకు కృతజ్ఞనతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులతో పాటు ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానంటూ చెప్పారు.
It’s an honor to receive a Padma Bhushan Award and to be recognized with so many extraordinary people. I’m thankful to the President, Prime Minister, and people of India, and look forward to continuing to work with people across India to help them use technology to achieve more.
— Satya Nadella (@satyanadella) January 27, 2022
సత్యనాదెళ్లతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్‌కి సైతం కేంద్రం పద్మభూషన్ అవార్డును ప్రకటించింది.. దీనిపై ఆయన స్పందిస్తూ వివిధ రంగాల్లో గొప్ప ప్రతిభ చూపిన వ్యక్తులతో కలిసి ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment