గడ్కరీ మాటలు నన్ను బాధించాయి: నటి | Gadkari's remarks did hurt me: Asha Parekh | Sakshi
Sakshi News home page

గడ్కరీ మాటలు నన్ను బాధించాయి: నటి

Published Thu, Apr 6 2017 1:29 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

గడ్కరీ మాటలు నన్ను బాధించాయి: నటి

గడ్కరీ మాటలు నన్ను బాధించాయి: నటి

ముంబయి: పద్మభూషణ్‌ అవార్డు కోసం తన వెంటపడ్డానంటూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి నష్టం లేదని ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆశా పరేఖ్‌ అన్నారు. అయితే, ఆయన అన్న మాటలు మాత్రం తనను తీవ్రంగ బాధించాయని చెప్పారు. గత ఏడాది ఓసారి అవార్డుల విషయంలోమాట్లాడిన నితిన్‌ గడ్కరీ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్‌ అవార్డుకు తన పేరును సిఫారసు చేయాలని ఆశా పరేఖ్‌ తనను కోరినట్లు గడ్కరీ చెప్పిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలను మీడియా ఆమెకు తాజాగా గుర్తు చేయగా స్పందిస్తూ ‘ఆయన మాటలు నన్ను బాధించాయి. ఆయన అలా చేయడం భావ్యం కాదు. అయితే, అది నాకు పెద్ద విషయమేం కాదు. చిత్ర పరిశ్రమలో వివాదాలు ఒక భాగంగానే ఉంటాయి’ అని అన్నారు. పరేఖ్‌ 1992లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2014లో జీవితకాల సాఫల్య అవార్డును అందుకున్నారు. హిందీ చిత్రాల్లో 1959న ఉంచి 1973 వరకు ఆమె అగ్రశ్రేణినటిగా ఒక వెలుగు వెలిగారు. పరేక్‌ ఆశా జీవిత చరిత్రను ‘ది హిట్‌ గర్ల్‌’ అనే పేరిట ప్రముఖ క్రిటిక్‌ ఖలీద్‌ మహ్మద్‌ రాస్తున్నారు. ఈ పుస్తకం ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement